Keerthy Suresh: కీర్తి సురేశ్.. ఈ పేరు వినగానే ముందు అందరికీ గుర్తొచ్చేది ఆమె నటించిన మహానటి. ఈ సినిమా అలనాటి మహానటి సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కించారు. ఈ పాత్రకు ముందు పలువురు హీరోయిన్స్ ని అనుకున్న దర్శకుడు నాగ్ అశ్విన్ ఫైనల్ గా కీర్తిని సావిత్రి పాత్రకి ఎంచుకున్నాడు. ఆయన సెలక్షన్ 100 పర్సెంట్ కరెక్ట్ అని ప్రతీ ఒక్కరు చెప్పుకున్నారు. తమిళంలో విజయ్, ధనుష్, విక్రం, శివ కార్తికేయన్ లాంటి స్టార్స్ పక్కన నటించి హిట్స్ అందుకున్నారు కీర్తి.
తెలుగులో నేను శైలజ, అజ్ఞాతవాసి, మహానటి, రంగ్ దే, నేను లోకల్, సర్కారు వారి పాట, దసరా, భోళా శంకర్ లాంటి సినిమాలు చేశారు. అయితే, అటు తమిళం అయినా.. ఇటు తెలుగు సినిమాలలోనైనా కీర్తి చేసిన సినిమాలలో పాత్రలన్నీ చాలా డీసెంట్ గా ఉంటాయి. పైగా హీరోతో రొమాంటిక్ సీన్స్ ఏవీ లేవు. చెప్పాలంటే సౌందర్య తర్వాత అంత పద్ధతిగా చక్కటి హోంలీ రోల్స్ చేస్తున్నారని చెప్పుకున్నారు. అయితే, కీర్తికి మహానటి సినిమా తర్వాత మళ్ళీ ఆ రేంజ్ హిట్ దక్కింది లేదు. చేయడానికి పది, పదిహేను సినిమాలు చేసినా వాటిలో కనీసం యావరేజ్ సినిమాలు మూడు నాలుగు కూడా లేవు.
Also Read – SSMB 29: మహేశ్ ని టెన్షన్ పెడుతున్న జక్కన్న
దాంతో సౌత్ లో కీర్తికి బాగా అవకాశాలు తగ్గిపోయాయి. భోళా శంకర్ ఫ్లాప్ తర్వాత మళ్ళీ తెలుగు సినిమాకి సైన్ చేయలేదు. కానీ, బాలీవుడ్ కి వెళ్ళి మాత్రం అడపాదడపా సినిమాలు చేస్తోంది. అంతేకాదు, ఇన్ని ఏళ్ళ నుంచి ఉన్న బౌండరీస్ అన్నీ దాటేసి అందాల ఆరబోతతో ఫ్యాన్స్ కి హీటెక్కిస్తోంది. బేబిజాన్ సినిమాలో కీర్తి స్కిన్ షో చూసి గుటకలు మింగిన సినీ లవర్స్ చాలామంది ఉన్నారు. ఇకపై నేను కూడా అన్నిటికీ రెడీ అనే విధంగా బేబీజాన్ సినిమాలో కనిపించి షాకిచ్చింది. అక్క అనే వెబ్ సిరీస్ కూడా కాస్త బోల్డ్ గానే ఉంది. కానీ ఇంకా ఈ సిరీస్ ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలియదు.
అయితే, తెలుగులో కీర్తిసురేశ్ రెండు సినిమాలు చేయడానికి ఒప్పుకుందని ఆ మధ్య చెప్పుకున్నారు. ఆ రెండు సినిమాలు దిల్ రాజు నిర్మాణంలో వచ్చేవని.. వాటిలో ఒకటి నితిన్ సినిమా, మరోటి విజయ్ దేవరకొండ హీరోగా నటించే సినిమా. అయితే, విజయ్ సినిమా అంటే హీరోయిన్‌తో లిప్ లాక్ తప్పనిసరి. రౌడీ జనార్ధన్ సినిమాలో కూడా లిప్ లాక్ ఉందని, దీనికి కీర్తి కూడా ఒప్పుకుందని టాక్ వినిపిస్తోంది. ఇదే నిజమైతే మొదటిసారి టాలీవుడ్ ప్రేక్షకులకి కీర్తి సురేశ్ లిప్ కిస్ సర్‌ప్రైజ్ చేస్తుందనడంలో సందేహం లేదు. చూడాలి మరి ఇందులో ఎంతవరకూ నిజముందో. కాగా, ఈ సినిమా షూటింగ్ మొదలై మళ్ళీ బ్రేక్ ఇచ్చినట్టు ఇటీవల వార్తలు వచ్చాయి.
Also Read – Smart TVs: జీఎస్టీ ఎఫెక్ట్.. స్మార్ట్ టీవీలపై ఎన్నడూ లేని విధంగా బంపరాఫర్లు.. పూర్తి వివరాలివే..!


