Saturday, November 15, 2025
Homeచిత్ర ప్రభKeerthy Suresh: ఎట్ట‌కేల‌కు థియేట‌ర్ల‌లోకి కీర్తి సురేష్ రివాల్వ‌ర్ రీటా - రామ్ పోతినేనికి పోటీగా...

Keerthy Suresh: ఎట్ట‌కేల‌కు థియేట‌ర్ల‌లోకి కీర్తి సురేష్ రివాల్వ‌ర్ రీటా – రామ్ పోతినేనికి పోటీగా రిలీజ్‌!

Keerthy Suresh: గ‌త ఏడాది డిసెంబ‌ర్‌లో రిలీజైన బాలీవుడ్ మూవీ బేబీ జాన్ త‌ర్వాత సిల్వ‌ర్ స్క్రీన్‌పై క‌నిపించ‌లేదు కీర్తి సురేష్. 2025లో ఈ ముద్దుగుమ్మ‌ న‌టించిన ఒక్క సినిమా కూడా రిలీజ్ కాలేదు. థియేట‌ర్ల‌లో మ‌హాన‌టి హీరోయిన్‌ సంద‌డి లేకుండానే ఈ ఏడాది ముగిసిపోతుంద‌ని ఆమె అభిమానులు డిస‌పాయింట్ అయ్యారు. వారికి కీర్తిసురేష్ గుడ్‌న్యూస్ వినిపించింది. ఎట్ట‌కేల‌కు 2025లో కీర్తి సురేష్ నుంచి ఓ మూవీ థియేట‌ర్ల‌లోకి రాబోతుంది. రివాల్వ‌ర్ రీటా మూవీ న‌వంబ‌ర్ 28న ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తోంది. రిలీజ్ డేట్‌ను మేక‌ర్స్ అఫీషియ‌ల్‌గా ప్ర‌క‌టించారు. ఓ పోస్ట‌ర్‌ను రిలీజ్ చేశారు.

- Advertisement -

ఈ పోస్ట‌ర్‌లో చేతిలో గులాబీ పువ్వు ప‌ట్టుకొని చిరున‌వ్వులు చిందిస్తూ కీర్తి సురేష్ క‌నిపిస్తోంది. ఆమె చుట్టూ కొంత మంది రౌడీలు రివాల్వ‌ర్స్ ప‌ట్టుకొని సీరియ‌స్‌గా ఉన్నారు. ఈ పోస్ట‌ర్ అభిమానుల‌ను ఆక‌ట్టుకుంటుంది. తెలుగుతో పాటు త‌మిళంలో రివాల్వ‌ర్ రీటా మూవీ విడుద‌ల కాబోతుంది. ఫ‌న్ యాక్ష‌న్ డ్రామాగా తెర‌కెక్కుతోన్న ఈ సినిమాలో రాధికా శ‌ర‌త్‌కుమార్‌, రెడిన్ కింగ్స్‌లే కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. కెరీర్‌లో ఫ‌స్ట్ టైమ్ ఔట్ అండ్ ఔట్ యాక్ష‌న్ రోల్‌లో కీర్తి సురేష్ న‌టిస్తున్న మూవీ ఇది.

Also Read – Amala Paul: ఫ్యాంట్ వేసుకోవడం మర్చిపోయిన అమలా పాల్

రివాల్వ‌ర్ రీటా షూటింగ్ ఏడాది క్రిత‌మే పూర్త‌య్యింది. అనివార్య కార‌ణాల వ‌ల్ల రిలీజ్ డిలే అవుతూ వ‌చ్చింది. తెలుగులో ఈ మూవీని కే ర్యాంప్ ప్రొడ్యూస‌ర్ రాజేష్ దండా రిలీజ్ చేయ‌బోతున్న‌ట్లు స‌మాచారం. కాగా న‌వంబ‌ర్ 28న తెలుగులో రామ్ పోతినేని ఆంధ్రా కింగ్ తాలూకా విడుద‌ల అవుతోంది. ఆ సినిమాకు పోటీగా రివాల్వ‌ర్ రీటా బ‌రిలోకి దిగుతోంది. రామ్ పోతినేనికి కీర్తి సురేష్ బాక్సాఫీస్ వ‌ద్ద ఏ మాత్రం పోటీ ఇస్తుంది అన్న‌ది చూడాల్సిందే.

పెళ్లి త‌ర్వాత సినిమాల‌కు స్మాల్ గ్యాప్ ఇచ్చిన కీర్తి సురేష్ మ‌ళ్లీ స్పీడు పెంచింది. ఇటీవ‌ల తెలుగుతో పాటు మ‌ల‌యాళం, హిందీ భాష‌ల్లో నాలుగు సినిమాల‌కు గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చింది. రౌడీ జ‌నార్ధ‌న మూవీతో మూడేళ్ల త‌ర్వాత టాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇవ్వ‌బోతుంది. ఈ సినిమాలో విజ‌య్ దేవ‌ర‌కొండ‌కు జోడీగా కీర్తి సురేష్ క‌నిపించ‌బోతుంది. మ‌ల‌యాళంలో తొట్టం పేరుతో ఓ మూవీకి గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చింది. హిందీలో ఓ సినిమాతో పాటు మ‌రో వెబ్ సిరీస్ చేస్తోంది.

Also Read – Cold wave: బెంబేలెత్తిస్తోన్న చలి పులి.. ఆరోగ్యం జాగ్రత్త!

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad