Keerthy Suresh: పెళ్లి తర్వాత సినిమాల ఎంపికలో సెలెక్టివ్‌గా అడుగులు వేస్తుంది కీర్తి సురేష్. వచ్చిన అన్ని అవకాశాలు కాకుండా నచ్చిన సినిమాలు మాత్రమే చేయాలని కీర్తి సురేష్ ఫిక్సైనట్లుగా కనిపిస్తుంది. బాలీవుడ్ మూవీ బేబీ జాన్ రిలీజై ఆరు నెలలు అవుతున్నా.. ఇప్పటివరకు కొత్త సినిమా ఏది అంగీకరించలేదు కీర్తి సురేష్. మహానటి హీరోయిన్ కొత్త మూవీ అనౌన్స్‌మెంట్ ఎప్పుడు? ఎలాంటి జానర్‌లో సినిమా చేయబోతుంది అన్నది అభిమానుల్లో ఆసక్తికరంగా మారింది.
కోర్ట్ రూమ్ థ్రిల్లర్…
తాజాగా కీర్తి సురేష్ నెక్స్ట్ మూవీపై అప్‌డేట్ వచ్చేసింది. ప్రవీణ్ ఎస్ విజయ్ అనే కొత్త దర్శకుడితో కీర్తి సురేష్ ఓ సినిమా చేయబోతున్నట్లు చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. ఈ సినిమా జానర్‌తో పాటు కీర్తి సురేష్ రోల్‌పై నిర్మాణ సంస్థ క్లారిటీ ఇచ్చింది. కోర్ట్ రూమ్ డ్రామా థ్రిల్లర్‌గా ఈ సినిమా రూపొందనున్నట్లు డ్రమ్‌స్టిక్స్ ప్రొడక్షన్స్ ప్రకటించింది. ఈ సినిమాలో కీర్తి సురేష్ పవర్‌ఫుల్ లాయర్‌గా నటించబోతున్నట్లు వెల్లడించింది. తీర్పు గురించి వెల్లడించలేం కానీ ట్విస్ట్‌లు మాత్రం బోలెడు ఉంటాయి అంటూ నిర్మాణ సంస్థ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది.
త్వరలో షూటింగ్…
కీర్తి సురేష్ కొత్త మూవీలో తమిళ డైరెక్టర్ మిస్కిన్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నట్లు మేకర్స్ వెల్లడించాడు. నెగెటివ్ షేడ్స్‌తో మిస్కిన్ క్యారెక్టర్ సాగనున్నట్లు సమాచారం. త్వరలోనే ఈ కోర్ట్ రూమ్ డ్రామా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానున్నట్లు తెలిసింది.
తండ్రి నిర్మాతగా…
కీర్తి సురేష్ లాయర్‌గా నటించడం ఇది సెకండ్ టైమ్. గతంలో వాశి అనే మలయాళం మూవీలో లాయర్ రోల్ చేసింది. కీర్తి సురేష్ తండ్రి సురేష్ నిర్మించిన వాశి డిజాస్టర్‌గా నిలిచింది. మరోసారి ఆమె లాయర్‌గా కనిపించబోతుండటం కోలీవుడ్ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. తెలుగు, తమిళ భాషల్లో బైలింగ్వల్ మూవీగా ఈ సినిమా రూపొందుతోన్నట్లు ప్రచారం జరుగుతోంది.
రిలీజ్‌కు రెడీ…
కాగా శుక్రవారం ఓనమ్ పండుగను భర్త ఆంటోనీ తాట్టిల్‌తో కలిసి సెలబ్రేట్ చేసుకుంది కీర్తి సురేష్. ఇందుకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నది. ప్రస్తుతం కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటించిన రివాల్వర్ రీటా, కన్నేవీడి సినిమాలు రిలీజ్‌కు సిద్ధంగా ఉన్నాయి. ఈ సినిమాల షూటింగ్ పూర్తయి చాలా రోజులు అవుతోంది.
Also Read- Railway Refund: టికెట్ కన్ఫార్మ్ అయ్యాక..క్యాన్సిల్ చేశారా..అయితే రీఫండ్ ఎంత వస్తుందో తెలుసా!


