Keerthy Suresh: పెళ్లి కారణంగా సినిమాలకు స్మాల్ బ్రేక్ ఇచ్చింది కీర్తి సురేష్. ఈ ఏడాది సిల్వర్‌స్క్రీన్‌పై ఇప్పటివరకు కనిపించలేదు. మరోవైపు కొత్త సినిమాలపై సంతకాలు చేయకపోవడంతో పెళ్లి తర్వాత కీర్తి సురేష్ సినిమాలకు గుడ్‌బై చెప్పనున్నట్లు పుకార్లు వినిపించాయి. ఈ రూమర్స్‌కు చెక్ పెడుతూ గత కొద్ది రోజులుగా వరుసగా సినిమాలకు గ్రీన్‌సిగ్నల్ ఇస్తోంది కీర్తి సురేష్. ఇటీవలే విజయ్ దేవరకొండ రౌడీ జనార్ధన మూవీని అంగీకరించడమే కాకుండా షూటింగ్‌ను మొదలుపెట్టింది. బలగం వేణు ఎల్లమ్మలో హీరోయిన్‌గా కీర్తి సురేష్ పేరు వినిపిస్తోంది. తెలుగులో మళ్లీ బిజీ అవుతోన్న కీర్తి సురేష్ తాజాగా ఓ హిందీ మూవీలో ఛాన్స్ దక్కించుకున్నట్లు సమాచారం.
గత ఏడాది రిలీజైన బేబీ జాన్‌తో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది కీర్తి సురేష్. దళపతి విజయ్ తేరీ మూవీకి రీమేక్‌గా తెరకెక్కిన ఈ బాలీవుడ్ సినిమా డిజాస్టర్‌గా నిలిచింది. బేబీ జాన్ రిజల్ట్‌తో సంబంధం లేకుండా మరో హిందీ సినిమాలో హీరోయిన్‌గా కనిపించబోతున్నది కీర్తి సురేష్. రాజ్‌కుమార్ రావ్ హీరోగా ఆదిత్య నింబాల్కర్ దర్శకత్వంలో బాలీవుడ్‌లో ఓ భారీ బడ్జెట్ మూవీ రాబోతుంది. నేటి విద్యావ్యవస్థ తీరుతెన్నులపై సెటైరికల్ మెసేజ్ ఓరియెంటెడ్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటించబోతున్నది. నవంబర్‌లో షూటింగ్ ప్రారంభం కానుందట. డిసెంబర్ లేదా జనవరి నుంచి కీర్తి ఈ సినిమా షూటింగ్‌లో జాయినయ్యే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
Also Read- The Paradise: ‘ది ప్యారడైజ్’లో జాయిన్ కానున్న హాలీవుడ్ స్టార్ – నానికి హీరోయిన్ కూడా దొరికేసింది
బేబీ జాన్ మూవీలో గ్లామర్ బాగానే ఒలకబోసింది కీర్తి సురేష్. అందాల ప్రదర్శన అంతగా వర్కవుట్ కాలేదు. దాంతో ఈ సారి రూట్ మార్చి యాక్టింగ్‌కు స్కోప్ ఉన్న ఛాలెంజింగ్ క్యారెక్టర్‌లో కీర్తి కనిపించబోతున్నట్లు చెబుతున్నారు.
తెలుగు, హిందీలోనే కాకుండా మలయాళంలో ఓ యాక్షన్ అడ్వెంచర్ సినిమాపై సంతకం చేసింది కీర్తి సురేష్. ఆంటోనీ వర్గీస్ హీరోగా నటిస్తోన్న ఈ సినిమా ద్వారా మూడేళ్ల తర్వాత మలయాళంలోకి రీఎంట్రీ ఇవ్వబోతుంది. ఈ ఏడాది గ్యాప్ వచ్చినా వచ్చే ఏడాది మాత్రం కీర్తి సురేష్ నుంచి సినిమాల జాతర ఉండబోతున్నట్లు ఫ్యాన్స్ చెబుతున్నారు. ఐదు సినిమాలు రిలీజయ్యే అవకాశం కనిపిస్తోంది.
Also Read- Tamannaah: అబద్దాలు చెబితే సహించను – విజయ్ వర్మతో బ్రేకప్‌పై తమన్నా కామెంట్స్


