Saturday, November 15, 2025
Homeచిత్ర ప్రభKGF 3: క్రేజీ అప్‌డేట్ వచ్చేసింది

KGF 3: క్రేజీ అప్‌డేట్ వచ్చేసింది

KGF 3: కేజీఎఫ్ సినిమా నుంచి క్రేజీ అప్‌డేట్ వచ్చేసింది. ఇండియన్ సినిమా అభిమానులందరూ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న కన్నడ ఇండస్ట్రీ హిట్ కేజీఎఫ్ సీక్వెల్స్ లో భాగంగా ఇప్పటికే రెండు భాగాలు వచ్చి సంచలన విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. కన్నడ సినిమా చరిత్రను మార్చిన కేజీఎఫ్ సిరీస్ అటు దర్శకుడిగా ప్రశాంత్ నీల్ కి, హీరోగా యష్ కి తీసుకువచ్చిన క్రేజ్ అసాధారణం.

- Advertisement -

కన్నడ సినిమా అంటేనే చిన్న సినిమా ఇండస్ట్రీ అనే మాటను పూర్తిగా చేరిపేశారు ప్రశాంత్ నీల్ అండ్ యష్. రాకీభాయ్ గా యష్ చూపించిన ప్రతాపం ఇండియన్ బాక్సాఫీస్ ని షేక్ చేసింది. ఇక రెండు భాగాలు ఇప్పటికే వచ్చి పాన్ ఇండియా వైడ్ గా అత్యంత భారీ వసూళ్లను అందుకున్నాయి. అప్పటి నుంచి ఈ సినిమాకి కొనసాగింపుగా మూడవ భాగం ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా, దీనికి సంబంధించిన ఓ క్రేజీ అప్‌డేట్ ని ప్రశాంత్ నీల్ అండ్ యష్ ఇచ్చారు.. అని అందరూ భావిస్తున్నారు. కానీ ఇది నిజం కాదనే వార్త సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.

Also Read – Sudheer Babu: బావ సినిమా హైప్ కోసం రంగంలోకి మహేష్

అసలు విషయం ఏమిటంటే.. ప్రశాంత్ నీల్ ఇన్స్టాగ్రాంలో ఓ పోస్ట్ పెట్టారు. కేజీఎఫ్ 3 కి స్క్రిప్ట్ సిద్ధం అయినట్టుగా ఈ పోస్ట్ లో ఉంది. కానీ, ఇది నిజంగా ప్రశాంత్ నీల్ పెట్టినది కాదనేది ఇప్పుడు అంతటా వైరల్ అవుతున్న వార్త. ఎందుకంటే, గత కొంతకాలంగా మన సెలబ్రిటీస్ పేరు మీద కొన్ని ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసి ఎన్నో పోస్టులు పెడుతున్నారు. దీనివల్ల చాలా ఇబ్బందులు కూడా తలెత్తుతున్నాయి. ఇలాంటిదే ఇప్పుడు ప్రశాంత్ నీల్ పేరుతో వైరల్ అవుతున్న కేజీఎఫ్ 3 న్యూస్ కూడా అంటున్నారు.

ఇది నిజమే కావచ్చు..
ఇదే నిజం కావచ్చు కూడా. ఎందుకంటే ప్రస్తుతం ప్రశాంత్ నీల్ ఎన్‌టిర్ తో డ్రాగన్ అనే సినిమాను చేస్తున్నారు. ఇది అవడానికి ఇంకా చాలా సమయం పడుతుంది. దీని తర్వాత ప్రభాస్ తో సలార్ 2 చేయాల్సి ఉంది. అయితే ప్రభాస్ ఇప్పుడు ది రాజాసాబ్ అలాగే.. ఫౌజీ చిత్రాలు పూర్తి చేసి కానీ సలార్ సెట్స్ లోకి అడుగుపెట్టడు. అలాగే, యష్ విషయానికొస్తే, ఆయన కూడా హిందీ సినిమా రామాయణ సిరీస్ తో బిజీగా ఉన్నారు. కాబట్టి ఇవన్నీ చూస్తే ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతున్న న్యూస్ ఫేక్ అనిపిస్తోంది. దీనిపై మేకర్స్ ఏమైనా క్లారిటీ ఇస్తారేమో చూడాలి.

Also Read – Ntr – Yash: రామ్‌చ‌ర‌ణ్‌తో య‌శ్ బాక్సాఫీస్ క్లాష్‌ – క్లైమాక్స్‌కు చేరిన టాక్సిక్ షూటింగ్ – థియేట‌ర్ల‌లో పూన‌కాలే

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad