Saturday, November 15, 2025
Homeచిత్ర ప్రభKhaidi2: ఖైదీ 2 మొదలైంది, LCU ఫ్యాన్స్ కి పండగే!

Khaidi2: ఖైదీ 2 మొదలైంది, LCU ఫ్యాన్స్ కి పండగే!

Khaidi: కార్తి హీరోగా, లోకేష్ కనగరాజ్ డైరెక్షన్‌లో వచ్చిన ‘ఖైదీ’ సినిమా ఎంత పెద్ద హిట్టో మనందరికీ తెలిసిందే. ఈ సినిమా ఏకంగా లోకేష్‌ను ఒక స్టార్ డైరెక్టర్‌గా మార్చేసింది. తెలుగులో కూడా ‘ఖైదీ’కి మంచి క్రేజ్ ఉంది. ఈ సినిమా తర్వాత లోకేష్ తీసిన ‘విక్రమ్’, ‘లియో’ కూడా పెద్ద హిట్స్ అయ్యాయి. దాంతో, ఈ సినిమాలన్నీ కలిపి లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ (LCU) గా తయారయ్యాయి. అందుకే, ఇప్పుడు ‘ఖైదీ 2’ వస్తుందంటే ఫ్యాన్స్ అంచనాలు మామూలుగా లేవు.

- Advertisement -

‘ఖైదీ 2’ పనులు మొదలు

ఇప్పుడు లేటెస్ట్ అప్‌డేట్ ఏంటంటే… ‘ఖైదీ’ సినిమా వచ్చి ఆరేళ్లు అయిన సందర్భంగా, ‘ఖైదీ 2’ కోసం ప్రీ-ప్రొడక్షన్ పనులు ఈ రోజు నుంచి మొదలయ్యాయి అనే వార్త బయటికొచ్చింది. డైరెక్టర్ లోకేష్ కనగరాజ్, కార్తి, నిర్మాత దీనిపై క్లారిటీకి వచ్చారు అని తెలుస్తోంది. లోకేష్ తదుపరి డైరెక్ట్ చేసే సినిమా ఇదే అయ్యే అవకాశం ఉంది. ఈ సినిమా షూటింగ్ వచ్చే ఏడాది మొదలవుతుందని సమాచారం.

డిల్లీ vs రోలెక్స్

‘ఖైదీ 2’ లో ఫ్యాన్స్ ఎక్కువగా దేని కోసం ఎదురుచూస్తున్నారంటే… డిల్లీ, రోలెక్స్ ల ఫేస్-ఆఫ్. ‘విక్రమ్’ క్లైమాక్స్‌లో కొన్ని క్షణాలే కనిపించినా, సూర్య చేసిన ‘రోలెక్స్’ పాత్రకు విపరీతమైన ఫాలోయింగ్ వచ్చింది.
ఇప్పుడు ‘ఖైదీ 2’ లో రోలెక్స్ పాత్ర పూర్తిగా కనిపిస్తుంది అని, ఈ కథ డిల్లీ జైలుకి వెళ్లడానికి ముందు జరిగిన విషయాలు చుట్టూ తిరుగుతుందని గట్టి టాక్ నడుస్తోంది.

‘కూలీ’ విమర్శలకు సమాధానం!

రజనీకాంత్‌తో లోకేష్ కనగరాజ్ తీసిన ‘కూలీ’ సినిమా ఆశించినంతగా ఆడలేదు. అందుకే లోకేష్‌పై కొంత ట్రోలింగ్ కూడా నడిచింది. అయితే, లోకేష్ తిరిగి తన ఫేవరెట్ అయిన LCU కథలోకి, ‘ఖైదీ 2’ తో రావడం ఆయనకు బాగా కలిసిరావచ్చు. తన స్టైల్‌లో ఉండే యాక్షన్, గ్రిప్పింగ్ స్టోరీతో ‘ఖైదీ 2’ ని హిట్‌ చేస్తే, ‘కూలీ’ సినిమా విషయంలో వచ్చిన విమర్శలకు ఇది కచ్చితంగా మంచి సమాధానం అవుతుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad