Sunday, July 7, 2024
Homeచిత్ర ప్రభKhushi Kapoor: శ్రీదేవి రెండో కూతురు 'ఖుషీ' ఆరంగేట్రం

Khushi Kapoor: శ్రీదేవి రెండో కూతురు ‘ఖుషీ’ ఆరంగేట్రం

'ఆర్చీస్' ప్రమోషన్ లో బిజీగా ఖుషీ

లెజెండరీ యాక్ట్రెస్ శ్రీదేవి రెండో కూతురు ఖుషీ కపూర్ తెరమీద ఆరంగేట్రం అవుతున్నారు. ఆర్చీస్ తో ఖుషీ మనకు పరిచయం అవుతున్నారు. లేటెస్ట్ గా ‘ఆర్చీస్’ ప్రమోషన్స్ లో భాగంగా ఐఫా రెడ్ కార్పెట్ పై తళుక్కుమన్నారు. అమ్మ శ్రీదేవి గతంలో వేసుకుని కనిపించిన గౌన్లో ఖుషీ కనిపిస్తూ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా వెలిగారు. రెడ్ కార్పెట్ పై ఖుషీని మీడియా అంతా హైలైట్ చేసింది.

- Advertisement -

శ్రీదేవి పెద్ద కుమార్తె జాన్వీ కపూర్ ఇప్పటికే హీరోయిన్ గా స్ట్రగుల్ అవుతున్నారు. బాలీవుడ్ సినిమాలు, ఓటీటీల్లో ఎంత ట్రై చేసినా పెద్ద హిట్ లేక టాలీవుడ్ లో జూనియర్ ఎన్టీఆర్ సరసన దేవరలో జాన్వీ తన లక్ ట్రై చేస్తున్నారు.

శ్రీదేవి-బోనీ కపూర్ లకు జాన్వీ, ఖుషీ ఇద్దరు కుమార్తెలు. ఇద్దరూ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News