హీరోయిన్ కియారా అద్వానీ తల్లి కాబోతున్నట్లు తెలుస్తోంది. తాజాగా కియారా అద్వానీ- సిద్ధార్థ్ మల్హోత్ర దంపతులు సోషల్ మీడియాలో ఈ శుభవార్తను తెలిపారు. త్వరలోనే తాము తల్లిదండ్రులు కాబోతున్నట్లు పరోక్షంగా చెబుతూ పోస్ట్ పెట్టారు. బేబీ సాక్స్‌ను చేతిలో పట్టుకున్న ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ.. ”మా జీవితంలో అద్భుతమైన బహుమతి త్వరలో రాబోతోంది” అని క్యాప్షన్ ఇచ్చారు. అంతేకాదు ఈ పోస్టుకు బేబీ ఎమోజీని జోడించారు.
దీంతో ఈ పోస్ట్ చూసి కియారా తల్లి కాబోతుందనే చెప్పి అందరూ అనుకుంటున్నారు. దీనిపై పలువురు స్పందిస్తూ కియారా దంపతులకు శుభాకాంక్షలు చెబుతున్నారు. సమంత, రకుల్ ప్రీత్ సింగ్, కరీనా కపూర్, నేహా ధూపియా, ఏక్తా కపూర్, రియా కపూర్, ఇషాన్ కట్టర్, హ్యూమా ఖురేషి వంటి సెలబ్రిటీలు కూడా కియారా, సిద్ధార్థ్ పోస్టుపై స్పందిస్తున్నారు. కొత్త దంపతులను బెస్ట్ విషెస్ అందిస్తున్నారు.
సిద్ధార్థ్, కియారా తొలిసారి ‘షేర్షా’ సినిమాతో కలిసి నటించారు. ఆ సినిమా చిత్రీకరణ సమయంలోనే వారిద్దరి మధ్య స్నేహం ఏర్పడి.. తర్వాత ప్రేమగా మారింది. చివరికి కుటుంబ సభ్యుల సమక్షంలో 2023 ఫిబ్రవరి 7వ తేదీన పెళ్లి చేసుకున్నారు.
వివాహం అనంతరం ఇద్దరూ తమ తమ కెరీర్ కొనసాగిస్తూ సినిమాల పరంగా బిజీగా కొనసాగుతున్నారు. బాలీవుడ్ తో పాటు టాలీవుడ్‌లో కూడా సత్తా చాటాలని ప్రయత్నాలు చేస్తోంది కియారా. రీసెంట్‌గా ఆమె నటించిన ‘గేమ్ ఛేంజర్’ ఈ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చి మిశ్రమ స్పందన తెచ్చుకుంది. తెలుగులో మహేష్ బాబుతో ‘భరత్ అనే నేను’, రామ్ చరణ్‌తో ‘వినయ విధేయ రామ’ సినిమాలు చేసిన కియారా అద్వానీ.. చాలా రోజుల తర్వాత మళ్లీ రామ్ చరణ్ తోనే ‘గేమ్ చేంజర్’ మూవీ చేసింది. అయితే ఈ సినిమా పెద్దగా అలరించలేదు.