Kiccha Sudeep Movies: కిచ్చా సుదీప్ హీరోగా నటించిన కన్నడ బ్లాక్‌బస్టర్ మూవీ హెబ్బులి తెలుగులోకి వచ్చింది. సారథి పేరుతో డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజైంది. ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. యాక్షన్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమాలో కిచ్చా సుదీప్‌కు జోడీగా అమలాపాల్ హీరోయిన్‌గా నటించింది. తెలుగు హీరోయిన్ కళ్యాణి ఈ మూవీలో ఓ కీలక పాత్రలో నటించింది. సారథి మూవీకి ఎస్ కృష్ణ దర్శకత్వం వహించాడు.
ఇరవై కోట్ల బడ్జెట్…
2017లో కన్నడంలో రిలీజైన హెబ్బులి కమర్షియల్ హిట్‌గా నిలిచింది. ఇరవై కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ మూవీ 36 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది. 2017 ఏడాదిలో కన్నడంలో హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది. హెబ్బులి మూవీతోనే హీరోయిన్‌గా అమలాపాల్ కన్నడంలోకి అడుగుపెట్టింది. ఈ సినిమాలో కబీర్‌సింగ్ దుహాన్, రవికిషన్, రవిచంద్రన్ ముఖ్య పాత్రలు పోషించారు.
Also Read – Natti Kumar: సినీ ఇండస్ట్రీలో సాయం చేసేందుకు ఎవరూ రారు.. నిర్మాత నట్టికుమార్ సంచనల వ్యాఖ్యలు
సారథి కథ ఏమిటంటే?
రామ్ (కిచ్చా సుదీప్) పారా కమాండోగా ఆర్మీలో పనిచేస్తుంటాడు. భయానికి మీనింగ్ తెలియని ఆఫీసర్‌గా పేరుతెచ్చుకున్నాడు. రామ్ అన్నయ్య సత్యమూర్తి (రవిచంద్రన్) కలెక్టర్. నితీ నిజాయితీలకు మారుపేరుగా సత్యమూర్తి నిలుస్తాడు. సత్యమూర్తి ఆత్మహత్యకు పాల్పడుతాడు. అన్న మరణం వెనుక మిస్టరీని రామ్ ఎలా ఛేదించాడు? ఈ ఇన్వేస్టిగేషన్‌లో రామ్‌కు ప్రియురాలు డాక్టర్ నందిని (అమలాపాల్) ఎలా అండగా నిలిచింది అన్నదే సారథి మూవీ కథ.
డిఫరెంట్ లుక్…
సారథి మూవీలో కిచ్చా సుదీప్ యాక్టింగ్, అతడిపై షూట్ చేసిన యాక్షన్ ఎపిసోడ్స్ హైలైట్‌గా నిలిచాయి. ఈ సినిమాలో సుదీప్ డిఫరెంట్ లుక్‌లో కనిపించి అభిమానులను ఆకట్టుకున్నాడు. ఈ సినిమాకు అర్జున్ జన్యా మ్యూజిక్ అందించాడు.
మ్యాక్స్ తర్వాత…
మ్యాక్స్ మూవీతో గత ఏడాది ప్రేక్షకులను పలకరించాడు సుదీప్. యాక్షన్ థ్రిల్లర్‌గా కథాంశంతో రూపొందిన ఈ మూవీ మిక్స్‌డ్ టాక్‌ను సొంతం చేసుకున్నది. ప్రస్తుతం బిల్లా రంగా బాషా పేరుతో ఓ పీరియాడికల్ యాక్షన్ సినిమా చేస్తున్నాడు సుదీప్. ఈ సినిమాకు అనూప్ భండారీ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇటీవల ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలైంది.
Also Read – Pawan Kalyan: సినీ ఇండస్ట్రీలో ప్రతిభే ముఖ్యం.. నా కొడుకైనా అంతే : పవన్ కళ్యాణ్
కిచ్చా సుదీప్ సౌత్‌తో పాటు నార్త్ ప్రేక్షకులకు కూడా సుపరిచితుడే. తెలుగు విషయానికి వస్తే ఇక్కడి ప్రేక్షకులకు ఈగ సినిమాతో దగ్గరయ్యాడు. ఈ మూవీలో విలన్‌గా మెప్పించిన ఆయన తర్వాత బాహుబలిలో గెస్ట్ అప్పియరెన్స్ కూడా ఇచ్చాడు. అలాగే ఆయన నటించిన పలు సినిమాలు పాన్ ఇండియా మూవీస్‌గా రిలీజ్ అవుతున్నప్పుడు తెలుగులోనూ రిలీజ్ అయ్యాయి.


