Thursday, February 13, 2025
Homeచిత్ర ప్రభKichcha Sudeep: హైదరాబాద్‌ మెట్రోలో కిచ్చా సుదీప్‌ ప్రయాణం

Kichcha Sudeep: హైదరాబాద్‌ మెట్రోలో కిచ్చా సుదీప్‌ ప్రయాణం

కన్నడ స్టార్‌ హీరో కిచ్చా సుదీప్‌ (Kichcha Sudeep) హైదరాబాద్‌ మెట్రోలో సందడి చేశారు. సెలబ్రిటీ క్రికెట్‌ లీగ్‌(CCL) కోసం తన టీమ్‌తో ఉప్పల్‌ స్టేడియంకు మెట్రోలో ప్రయాణించారు. ఈసందర్భంగా పలువురు అభిమానులు, మెట్రో సిబ్బందితో ఫొటోలు దిగారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు వైరల్‌గా మారాయి. సామాన్యులతో కలిసి మెట్రోలో ప్రయాణించడంపై నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -

కాగా సెలబ్రిటీ క్రికెట్‌ లీగ్‌లో కర్ణాటక బుల్డోజర్స్‌ టీమ్‌కు కిచ్చా సుదీప్‌ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నారు. ఫిబ్రవరి 14వ తేదీన ఉప్పల్‌ స్టేడియంలో జరగనున్న మ్యాచ్‌లో చెన్నై రైనోస్‌తో సుదీప్ టీమ్ తలపడనుంది. ఇక 15వ తేదీ జరగనున్న మ్యాచ్‌లో తెలుగు వారియర్స్‌, చెన్నై రైనోస్‌ పోటీ పడనున్నాయి. ఈ మ్యాచ్‌లకు ఎలాంటి అవాంతరాలు చోటుచేసుకోకుండా కట్టుదిట్టమైన భద్రత కల్పిస్తున్నట్టు రాచకొండ సీపీ సుధీర్‌బాబు తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News