Sunday, September 8, 2024
Homeచిత్ర ప్రభKirak RP : నెల్లూరు చేపల పులుసు అమ్ముతున్న జబర్దస్త్ కమెడియన్..

Kirak RP : నెల్లూరు చేపల పులుసు అమ్ముతున్న జబర్దస్త్ కమెడియన్..

- Advertisement -

Kirak RP : జబర్దస్త్ తో పేరు తెచ్చుకున్న కమెడియన్స్ లో కిరాక్ ఆర్పీ ఒకరు. జబర్దస్త్ తో పాటు పలు టీవీ షోలలోను కనిపిస్తూ అప్పుడప్పుడు సినిమాల్లో కూడా కనిపిస్తున్నాడు ఆర్పీ. ప్రస్తుతం తానే డైరెక్టర్ గా ఒక సినిమా కూడా చేయబోతున్నాడు. ఇటీవలే తను ప్రేమించిన అమ్మాయిని ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నాడు. త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాడు ఆర్పీ.

తాజాగా కొత్త బిజినెస్ లోకి ఎంటర్ అయ్యాడు కిరాక్ ఆర్పీ. కిరాక్ ఆర్పీ నెల్లూరు నుంచి వచ్చాడు. నెల్లూరులో చేపల పులుసు బాగా ఫేమస్. ఆర్పీ కూడా బాగా వండుతాడంట. కిరాక్ ఆర్పీ ఎప్పట్నుంచో హైదరాబాద్ లో వాళ్ళ నెల్లూరు టేస్ట్ ఇచ్చే చేపల పులుసు అమ్మాలనుకున్నాడు. తాజాగా నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు అనే కర్రీపాయింట్ ని ఓపెన్ చేశాడు.

హైదరాబాద్ కూకట్ పల్లిలో ఈ కర్రీ పాయింట్ ఓపెన్ చేశాడు కిరాక్ ఆర్పీ. ఈ కర్రీ పాయింట్ లో అన్ని చోట్ల దొరికే మాములు కర్రీలతో పాటు నెల్లూరు నుంచి తెచ్చిన చేపల ఐటమ్స్ చాలా స్పెషల్. చేపల పులుసు, బొమ్మిడాయిల పులుసు, కొరమీను పులుసు, సన్నచేపల పులుసు, రవ్వ చేపల పులుసు, చేప తలకాయ పులుసు.. ఇలా అన్నీ నెల్లూరు నుంచి తెప్పించిన చేపలతో కట్టెలపొయ్యి మీదనే వండుతారట. ఈ రెస్టారెంట్ బాగా క్లిక్ అయితే హైదరాబాద్ లోనే నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు కర్రీ పాయింట్స్‌ 15 బ్రాంచులు ఓపెన్‌ చేస్తానని కిరాక్ ఆర్పీ తెలిపాడు. మరి హైదరాబాద్ లో ఉన్నవాళ్లు నెల్లూరు చేపల పులుసు తినాలనుకుంటే కిరాక్ ఆర్పీ కర్రీ పాయింట్ కి వెళ్లిపోండి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News