Kiran Abbavaram: ఈ దీపావళికి రిలీజైన తెలుగు సినిమాల్లో లాభాల్లోకి అడుగుపెట్టిన మొదటి మూవీగా కిరణ్ అబ్బవరం కే ర్యాంప్ నిలిచింది. శుక్రవారం నాటి కలెక్షన్స్ కే ర్యాంప్ బ్రేక్ ఈవెన్‌ను సాధించింది. జైన్స్ నాని దర్శకత్వంలో రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ ఎనిమిదిన్నర కోట్ల వరకు జరిగింది. 9 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో కే ర్యాంప్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
మిగిలిన మూడు సినిమాల పోటీని తట్టుకొని ఏడు రోజుల్లోనే కే ర్యాంప్ టార్గెట్‌ను చేరుకుంది. మిక్స్‌డ్ టాక్‌తో సినిమా లాభాల్లోకి అడుగుపెట్టడం బాక్సాఫీస్ వర్గాలను విస్మయపరుస్తోంది. శుక్రవారం వరకు కే ర్యాంప్ మూవీ తొమ్మిది కోట్ల పది లక్షలకుపైగా వసూళ్లను దక్కించుకున్నది. ఏడు రోజుల్లో వరల్డ్ వైడ్‌గా ఈ మూవీకి 16.70 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి. అన్ని ఏరియాల్లో కే ర్యాంప్ ప్రాఫిట్ జోన్‌లోకి ఎంటరైనట్లు ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి.
ఈ దీపావళికి కే ర్యాంప్‌తో పాటు ప్రదీప్ రంగనాథన్ డ్యూడ్, సిద్ధు జొన్నలగడ్డ తెలుసు కదా, మిత్రమండలి రిలీజయ్యాయి. వీటిలో కే ర్యాంప్ మూవీ ఫస్ట్ బ్రేక్ ఈవెన్‌ను సాధించింది. డ్యూడ్ లాభాలకు దగ్గరలో ఉండగా… తెలుసు కదా, మిత్రమండలి డిజాస్టర్స్‌గా నిలిచాయి.
Also Read – Rashmika: ‘ది గర్ల్ ఫ్రెండ్’ ట్రైలర్ వచ్చేసింది: రష్మికను ఇలా ఎప్పుడూ చూసి ఉండరు!
కే ర్యాంప్ మూవీలో కిరణ్ అబ్బవరానికి జోడీగా యుక్తి తరేజా హీరోయిన్‌గా నటించింది. నరేష్ వీకే, సాయికుమార్, వెన్నెలకిషోర్ కీలక పాత్రలు పోషించారు. కాన్సెప్ట్‌లో కొత్తదనం లేదంటూ విమర్శలు వచ్చినా కిరణ్ అబ్బవరం క్యారెక్టరైజేషన్‌తో పాటు కామెడీ వర్కవుట్ కావడంతో ఈ సినిమాకు ప్లస్సయ్యింది. మాస్ రోల్‌లో తన కామెడీ టైమింగ్, యాక్టింగ్‌తో తెలుగు ప్రేక్షకులను మెప్పించాడు కిరణ్ అబ్బవరం. డైరెక్టర్‌గా ఫస్ట్ మూవీతోనే జైన్స్ నాని కూడా హిట్టు అందుకున్నాడు.
కాగా కే ర్యాంప్ మూవీపై వస్తోన్న నెగెటివ్ వార్తలపై ఇటీవల జరిగిన సక్సెస్ మీట్‌లో నిర్మాత రాజేష్ దండా ఫైర్ కావడం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. మా సినిమాను జనం ఆదరిస్తున్నా కొందరు మాత్రం నెగెటివ్ వార్తలు రాస్తూ నష్టాన్ని కలిగించాలని చూస్తున్నారంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పలువురు నెటిజన్లు రాజేష్ దండా మాటల్ని తప్పుపట్టగా చాలా మంది సమర్థిస్తున్నారు. నిర్మాత ఆవేదనలో న్యాయం ఉందని కామెంట్స్ చేస్తున్నారు.
క తర్వాత కే ర్యాంప్‌తో మరో బిగ్గెస్ట్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు కిరణ్ అబ్బవరం. ఈ సక్సెస్ జోష్‌తో నెక్స్ట్ సినిమాను మొదలు పెట్టబోతున్నాడు. ప్రస్తుతం హీరోగా ఐదు సినిమాలతో పాటు ఓ వెబ్‌సిరీస్ చేస్తున్నాడు కిరణ్ అబ్బవరం. కోలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చే సన్నాహాల్లో ఉన్నాడు. హీరోగానే కాకుండా ప్రొడ్యూసర్‌గా కూడా మారిన కిరణ్ అబ్బవరం తిమ్మరాజు పల్లి టీవీ పేరుతో ఓ కాన్సెప్ట్ ఓరియెంటెడ్ మూవీని నిర్మించాడు. ఇప్పటికే షూటింగ్‌ను పూర్తి చేసుకున్న ఈ మూవీ రిలీజ్‌కు రెడీగా ఉంది.
Also Read – Nayanthara: నయనతారకు సంక్రాంతి సెంటిమెంట్ కలిసొస్తుందా?


