K Ramp OTT: కే ర్యాంప్ మూవీతో కెరీర్‌లో మరో బ్లాక్‌బస్టర్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు కిరణ్ అబ్బవరం. దీపావళి కానుకగా థియేటర్లలో రిలీజైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద అదరగొట్టింది. 30 కోట్లకుపైగా వసూళ్లను సొంతం చేసుకున్నది. ఈ సూపర్ హిట్ మూవీ ఓటీటీలోకి రాబోతుంది. కే ర్యాంప్ నవంబర్ 15 నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్లలో రిలీజైన నెల రోజుల్లోనే ఈ తెలుగు మూవీ ఓటీటీలోకి వస్తుంది.
రొమాంటిక్ కామెడీగా తెరకెక్కిన కే ర్యాంప్ మూవీతో జైన్స్ నాని డైరెక్టర్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. తొలి అడుగులోనే విజయాన్ని అందుకున్నాడు. యుక్తి తరేజా హీరోయిన్‌గా నటించింది. సీనియర్ నరేష్, సాయికుమార్, అనన్య, వెన్నెలకిషోర్ కీలక పాత్రలు పోషించారు. సీనియర్ హీరోయిన్ విమలా రామన్ గెస్ట్ రోల్‌లో కనిపించింది. కే ర్యాంప్ మూవీకి ఫస్ట్ వీకెండ్‌లో మిక్స్‌డ్ టాక్ వచ్చింది. కామెడీ వర్కవుట్ కావడంతో, దీపావళికి రిలీజైన మిగిలిన సినిమాలు ప్రేక్షకులను మెప్పించలేకపోవడంతో కే ర్యాంప్‌కు కలిసివచ్చింది. తెలుసు కదా, మిత్రమండలి, డ్యూడ్ వంటి సినిమాల పోటీని తట్టుకొని కే ర్యాంప్ హిట్టుగా నిలిచింది. క తర్వాత కిరణ్ అబ్బవరం కెరీర్‌లో అత్యధిక వసూళ్లను సాధించిన మూవీగా కే ర్యాంప్ నిలిచింది. నిర్మాతలకు ఈ మూవీ ఆరు కోట్లకుపైనే లాభాలను మిగిల్చింది.
Also Read – IND vs AUS Live: నేడే చివరి టీ20.. వన్డే సిరీస్ ఓటమికి భారత్ ప్రతీకారం తీర్చుకుంటుందా?
కేరళ అమ్మాయితో ప్రేమలో పడిన ఓ తెలుగు యువకుడి కథతో దర్శకుడు జైన్స్ నాని కే ర్యాంప్ సినిమాను రూపొందించారు. తాను ప్రేమించిన అమ్మాయికి ఉన్న మానసిక సమస్య వల్ల ఆ యువకుడు ఎలాంటి ఇబ్బందులు పడ్డాడన్నది ఎంటర్‌టైనింగ్‌గా డైరెక్టర్ ఈ మూవీలో చూపించాడు. ఈ సినిమాలో కుమార్ పాత్రలో తన కామెడీ టైమింగ్‌తో ఆడియెన్స్‌ను మెప్పించాడు కిరణ్ అబ్బవరం.
కే ర్యాంప్ బ్లాక్‌బస్టర్ తర్వాత ఐదు సినిమాలను లైన్‌లో పెట్టాడు కిరణ్ అబ్బవరం. చెన్నై లవ్‌స్టోరీ రిలీజ్‌కు రెడీగా ఉంది. మరో నాలుగు సినిమాలు డిస్కషన్ స్టేజ్‌లో ఉన్నాయి. ఓ బైలింగ్వల్ మూవీతో కోలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఈ సినిమాకు అనిరుధ్ మ్యూజిక్ అందించబోతున్నాడు.
సినిమాలే కాకుండా అమెజాన్ ప్రైమ్‌లో ఓ వెబ్‌సిరీస్‌కు కిరణ్ అబ్బవరం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చాడు. పొలిటికల్ థ్రిల్లర్‌గా ఈ సిరీస్ తెరకెక్కుతోంది. ప్రొడ్యూసర్‌గా తిమ్మరాజు పల్లి టీవీ అనే కాన్సెప్ట్ ఓరియెంటెడ్ మూవీని రూపొందించారు. రూరల్ కామెడీ మూవీ త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
Also Read – Manchu Lakshmi: మంచు లక్ష్మీ అందాల ఆరబోత.. కుర్రాళ్ల గుండెల్లో గిలిగింత..


