K-RAMP: యంగ్ హీరో కిరణ్ అబ్బవరం దీపావళికి ధమాకా ఇవ్వడానికి రెడీ అయ్యాడు. తన కొత్త సినిమా ‘కె-ర్యాంప్’ను అక్టోబర్ 18న రిలీజ్ చేస్తున్నారు. టీజర్, గ్లింప్స్ తర్వాత.. ఇప్పుడు మేకర్స్ వదిలిన ‘రిలీజ్ ట్రైలర్’ చూశాక, సినిమా పేరుకు తగ్గట్టే ర్యాంపేజ్ సృష్టించడం ఖాయమనే వైబ్ వచ్చింది.
నిజానికి, యూనిట్ ఈ సినిమాను ‘ఫ్యామిలీ ప్యాక్’ అన్నా… ట్రైలర్స్ చూస్తే ఇది పక్కా ‘కుర్రాళ్ల ప్యాకేజ్’ అని ఫిక్స్ అవ్వచ్చు! ట్రైలర్ చూస్తుంటే ప్లాపులతో సతమతం అవుతున్న కిరణ్, ఈ సినిమాతో ఎలాగైనా మాస్ ఇమేజ్ తెచ్చుకుని, హిట్ ట్రాక్ ఎక్కాలని గట్టిగా ఫిక్స్ అయినట్టు కనిపిస్తోంది.
ALSO READ: https://teluguprabha.net/cinema-news/pawan-kalyan-og-box-office-collections-hit-or-flop/
బోల్డ్ కంటెంట్: ట్రైలర్‌లో కిరణ్ అబ్బవరం మరియు హీరోయిన్ యుక్తి తరేజా మధ్య కెమిస్ట్రీ మామూలుగా లేదు. లిప్ లాక్‌లు (కొన్ని రిపోర్టుల ప్రకారం సినిమాలో 16 ముద్దు సీన్లు ఉన్నాయని టాక్), డబుల్ మీనింగ్ డైలాగులు ప్రేక్షకులను, ముఖ్యంగా యూత్‌ను టార్గెట్ చేశాయి. కిరణ్ ఇందులో ఒక ఊరమాస్, అల్లరి చిల్లర కుర్రాడి పాత్రలో కనిపిస్తాడు అని అర్థం అయిపోతుంది.
గతేడాది దీపావళి సీజన్‌లోనే కిరణ్ అబ్బవరం సినిమా ‘క’ మంచి హిట్ సాధించి, హీరోగా అతనికి మంచి బౌన్స్ బ్యాక్ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ అదే ఫెస్టివల్ సెంటిమెంట్‌ను నమ్ముకుని ‘కె-ర్యాంప్’ను రిలీజ్ చేస్తున్నారు.కొచ్చిలో షూట్ చేసిన హై-ఓల్టేజ్ ఎపిసోడ్, పవర్‌ఫుల్ ఇంటర్వెల్ బ్యాంగ్ సినిమాకు మేజర్ హైలైట్స్ అని మేకర్స్ నమ్మకంతో ఉన్నారు.
ALSO READ: https://teluguprabha.net/cinema-news/ai-fake-photos-sai-pallavi-priyanka-mohan-controversy/
సినిమా రన్ టైమ్ కూడా 2 గంటల 15 నిమిషాలకు పర్‌ఫెక్ట్‌గా కట్ చేశారు.
పోటీలో ఉన్న మిగతా సినిమాలతో పోలిస్తే, ఈ యూత్‌ఫుల్ కంటెంట్తో ‘కె-ర్యాంప్’ కాస్త ముందు వరుసలో నిలిచేలా ఉంది. ట్రైలర్‌లో కనిపించిన ఈ జోష్ థియేటర్ల వరకూ చేరితే, కిరణ్ ఖాతాలో మరో సాలిడ్ హిట్ పడటం ఖాయం! కానీ ఈ సినిమా తో పాటు మిత్రమండలి, తెలుసు కదా, డ్యూడ్ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. మరి వీటికి ఎంత వరకు గట్టి పోటీ ఇస్తుందో చూడాలి.


