K-Ramp Collections: కిరణ్ అబ్బవరం, యుక్తి తరేజా హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘కె-ర్యాంప్’. జైన్ నాని దర్శకుడిగా పరిచయం అయ్యాడు. నేటి యువత మైండ్ సెట్‌ను బేస్ చేసుకుని నిర్మాతలు ఈ సినిమాను రూపొందించారు. దీపావళి సందర్భంగా సినిమా అక్టోబర్ 18న రిలీజైన సంగతి తెలిసిందే. మూడు రోజుల్లో సినిమా బ్రేక్ ఈవెన్ సాధించటంతో నిర్మాతలే కాదు.. డిస్ట్రిబ్యూటర్స్ కూడా సేఫ్ జోన్‌లో ఉన్నారని ట్రేడ్ వర్గాలంటున్నాయి. పండుగ రోజులు సినిమాకు బాగా కలిసొచ్చాయి. తొలిరోజున రూ. 4.5 కోట్లు గ్రాస్ కలెక్షన్స్ రాబట్టుకున్న ఈ సినిమా రెండో రోజున, తొలి రోజు కంటే ఎక్కువ వసూళ్లను సాధించింది. రెండు రోజులకు కలిపి రూ.11 కోట్లు వచ్చాయి. సోమవారం దీపావళి పండుగ కాబట్టి.. థియేటర్స్‌కు ప్రేక్షకులు వచ్చారు. మొత్తంగా చూస్తే మూడు రోజులకు కలిపి ‘కె-ర్యాంప్’ మూవీ రూ.14 కోట్లు గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి. అంటే రూ.6 కోట్లు షేర్ కలెక్షన్స్ వచ్చినట్లు సినీ సర్కిల్స్ అంటున్నాయి.
‘కె-ర్యాంప్’ మూవీ మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ కావటం మేకర్స్‌కు కలిసొచ్చే అంశం. అంతే కాదు.. గత ఏడాది ‘క’ మూవీతో బ్లాక్ బస్టర్‌ను తన ఖాతాలో వేసుకున్న కిరణ్ అబ్బవరంకు ‘దిల్ రూబా’ మూవీ షాకిచ్చింది. అయితే ఇప్పుడు ‘కె-ర్యాంప్’తో కిరణ్ మళ్లీ సక్సెస్ ట్రాక్‌లో పడ్డాడు. ఇక్కడ చదువు కోకుండా బలాదూర్‌గా తిరిగే కొడుకుని కేరళలోని కాలేజ్‌లో చేర్పిస్తాడు తండ్రి. అక్కడే హీరోయిన్‌తో ప్రేమలో పడతాడు. ఆమెకు ఓ మానసిక సమస్య ఉంటుంది. దాన్నుంచి హీరోయిన్ ఎలా బయటపడుతుంది. ఆమె గురించి హీరోకి తెలిసి ఏం చేశాడు? వాళ్ల మధ్య ప్రేమ పుట్టటానికి కారణమేంటి? అనే కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కించారు. ఎంటర్‌టైనింగ్‌గా సినిమాను తెరకెక్కించారు. సీనియర్ నరేష్ పాత్ర, కొన్ని సంభాషణలపై విమర్శలు వచ్చినప్పటికీ వసూళ్లపై వాటి ప్రభావం పడలేదు.
Chepinnatte Kumar gadu theaters lo kummi padesadu 🤙😎
𝐃𝐈𝐖𝐀𝐋𝐈 𝐖𝐈𝐍𝐍𝐄𝐑 #KRamp BREAKEVEN DONE IN 3 DAYS 🔥🔥🔥
Book Your Tickets Now..!!
— https://t.co/N3Nlx4VOfJ#KRampKaDiwali 🧨 pic.twitter.com/wo49rLrkEb
— jains nani (@JainsNani) October 21, 2025
మినిమం బడ్జెట్‌తో ‘కె-ర్యాంప్’ సినిమాను రూపొందించటమే ఈ సక్సెస్‌కు కారణమని తెలుస్తుంది. అదీ కాకుండా ‘క’ సెంటిమెంట్ మరోసారి కిరణ్‌కు వర్కవుట్ అయ్యిందని అంటున్నారు. ఇంతకు ముందు చెప్పినట్లు క సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టిన ఈ యంగ్ హీరో ఇప్పుడు ‘కె-ర్యాంప్’తో మరో హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ సినిమా తర్వాత కిరణ్ నటిస్తోన్న చెన్నై లవ్ స్టోరి రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. ఇది కాకుండా మరో రెండు మూడు సినిమాలను యంగ్ హీరో లైనప్ చేస్తున్నాడు. వాటి వివరాలు త్వరలోనే రివీల్ కానున్నాయి.
Also Read- Ind vs Aus 02nd ODI: కుల్దీప్ ఇన్.. వారిద్దరూ ఔట్.. టీమ్ ఇండియా ఫ్లేయింగ్ 11 ఎలా ఉండబోతుందంటే?


