Kiran Abbavaram: ఓటీటీ ట్రెండ్ కారణంగా వెబ్‌సిరీస్‌లకు ఆదరణ పెరిగింది. అగ్ర హీరోహీరోయిన్లు సైతం వెబ్‌సిరీస్‌లలో నటిస్తున్నారు. వెంకటేష్, రానా, నాగచైతన్య, త్రిష, తమన్నాతో పాటు పలువురు స్టార్స్ వెబ్‌సిరీస్‌లతో తెలుగు ప్రేక్షకులను మెప్పించారు. వీరి బాటలో టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం అడుగులు వేయబోతున్నాడు. ఫస్ట్ టైమ్ ఓ వెబ్‌సిరీస్‌కు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చాడు.
డియర్ కామ్రేడ్ డైరెక్టర్…
థ్రిల్లర్ కథాంశంతో రూపొందనున్న ఈ సిరీస్‌కు డియర్ కామ్రేడ్ డైరెక్టర్ భరత్ కమ్మ షో రన్నర్‌గా వ్యవహరించబోతున్నారట. ఈ సిరీస్‌కు అతడే కథ, స్క్రీన్‌ప్లేను సమకూర్చుతున్నట్లు సమాచారం. ఈ వెబ్‌సిరీస్‌తో కొత్త దర్శకుడు టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్నాడట.
అమెజాన్ ప్రైమ్‌లో…
అమెజాన్ ప్రైమ్‌లో కిరణ్ అబ్బవరం, భరత్ కమ్మ వెబ్ సిరీస్ రిలీజ్ కానుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి ఈ సిరీస్ రెగ్యులర్ షూటింగ్ మొదలవబోతున్నట్లు సమాచారం. ఇందులో కిరణ్ అబ్బవరం రోల్ డిఫరెంట్‌గా ఉంటుందని చెబుతున్నారు. టాప్ నాచ్ ప్రొడక్షన్ వాల్యూస్‌తో సిరీస్ రూపొందనున్నట్లు సమాచారం. ఈ వెబ్‌సిరీస్‌తోనే కిరణ్ అబ్బవరం ఓటీటీలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.
Also Read – Jalgaon Crematorium Theft : దారుణం.. శ్మశానంలో చోరీ చేసి చితిలో నుంచి కపాలం ఎత్తుకెళ్లిన దుండగులు
క తర్వాత బిజీ…
గత ఏడాది రిలీజైన క మూవీతో కెరీర్‌లోనే పెద్ద విజయాన్ని అందుకున్నాడు కిరణ్ అబ్బవరం. సైకలాజికల్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ మూవీ యాభై కోట్ల వరకు వసూళ్లను దక్కించుకున్నది. క సక్సెస్‌తో సినిమాల జోరును పెంచాడు. ప్రస్తుతం హీరోగా ఐదు సినిమాలు చేస్తున్నాడు. కిరణ్ అబ్బవరం కథానాయకుడిగా నటించిన కే ర్యాంప్ మూవీ దీపావళి కానుకగా అక్టోబర్ 18న రిలీజ్ అవుతోంది. యూత్‌ఫుల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమాకు జైన్స్ నాని దర్శకత్వం వహిస్తున్నారు. యుక్తి తరేజా హీరోయిన్‌గా నటిస్తోంది. కిరణ్ అబ్బవరం మరో మూవీ చెన్నై లవ్‌స్టోరీ రిలీజ్‌కు రెడీగా ఉంది.
ప్రొడ్యూసర్‌గా…
వీటితో పాటు ఓ బాలీవుడ్ డైరెక్టర్ సినిమాతో పాటు క సీక్వెల్‌ను అంగీకరించాడు కిరణ్ అబ్బవరం. హీరోగా బిజీగా ఉన్న కిరణ్ అబ్బవరం ఇటీవలే ప్రొడ్యూసర్‌గా అవతారం ఎత్తాడు. క ప్రొడక్షన్స్ పేరుతో బ్యానర్ నెలకొల్పాడు. ఈ నిర్మాణ సంస్థపై తొలి ప్రయత్నంగా తిమ్మరాజుపల్లి టీవీ అనే చిన్న సినిమాను నిర్మించబోతున్నాడు. సాయితేజ్, వేదాశ్రీ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ మూవీ షూటింగ్ పూర్తయ్యింది.
Also Read – Karnataka Menstrual Leave Policy : గుడ్ న్యూస్.. మహిళా ఉద్యోగులకు వేతనంతో కూడిన నెలసరి సెలవు


