Saturday, October 26, 2024
Homeచిత్ర ప్రభKiran Abbavaram: మంచి కొత్త సినిమా అందించాలనే 'క' సినిమా చేశా

Kiran Abbavaram: మంచి కొత్త సినిమా అందించాలనే ‘క’ సినిమా చేశా

ఎంటర్టైనర్ గా..

ప్రేక్షకులకు ఒక మంచి కొత్త సినిమా అందించాలనే “క” సినిమా చేశా – హీరో కిరణ్ అబ్బవరం

- Advertisement -

యంగ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న భారీ పీరియాడిక్ థ్రిల్లర్ సినిమా “క”. ఈ సినిమాలో నయన్ సారిక, తన్వీ రామ్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. శ్రీమతి చింతా వరలక్ష్మి సమర్పణలో శ్రీచక్రాస్ ఎంటర్ టైన్ మెంట్స్ తో బ్యానర్ పై చింతా గోపాలకృష్ణ రెడ్డి భారీ ప్రొడక్షన్ వ్యాల్యూస్ తో నిర్మిస్తున్నారు. దర్శక ద్వయం సుజీత్, సందీప్ విలేజ్ బ్యాక్ డ్రాప్ యాక్షన్ థ్రిల్లర్ కథతో ‌”క” సినిమాను రూపొందిస్తున్నారు. ఈ సినిమా ఈ నెల 31న దీపా‌వళి పండుగ సందర్భంగా తెలుగులో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. “క” సినిమాను తెలుగులో ప్రొడ్యూసర్ వంశీ నందిపాటి, మలయాళంలో హీరో దుల్కర్ సల్మాన్ తన వేఫర్ ఫిలింస్ పై రిలీజ్ చేయబోతున్నారు. తాజాగా రిలీజ్ చేసిన ‌”క” సినిమా ట్రైలర్ కు హ్యూజ్ రెస్పాన్స్ వస్తోంది. ఈ నేపథ్యంలో ఈ రోజు ‌”క” సినిమా ట్రైలర్ ను మీడియాకు ప్రత్యేకంగా ప్రదర్శించారు. అనంతరం జరిగిన ప్రెస్ మీట్ లో..దర్శకుడు సందీప్ మాట్లాడుతూ – “క” సినిమా ట్రైలర్ మీ అందరికీ బాగా నచ్చిందని భావిస్తున్నా. ఈ సినిమా కథను బీ, సీ సెంటర్స్ ఆడియెన్స్ కోసం రాసుకున్నాం. స్క్రీన్ ప్లే కూడా అలాగే చేశాం. కథ చెప్పగానే కిరణ్ గారు వెంటనే ఓకే చేశారు. ఆయన ఇచ్చిన కాన్పిడెన్స్ తో కంటిన్యూ అయ్యాం. స్క్రిప్ట్ ఓకే అయ్యాక కిరణ్ గారు మాకు చాలా ఫ్రీడమ్ ఇచ్చారు. మనకు కథల కంటే కథను కొత్తగా చెప్పడమే ఇంపార్టెంట్. అలా “క” సినిమాను స్క్రీన్ మీద కొత్తగా ప్రెజెంట్ చేశాం. 1970, 80 కాలాన్ని ప్రతిబింబించేలా ప్రతి సీన్ డిజైన్ చేసుకున్నాం. కృష్ణగిరి అనే ఊరు యూనిక్ గా ఉండేలా మధ్యాహ్నం చీకటి పడే ఎలిమెంట్ తీసుకున్నాం. సినిమా బిగిన్ అయిన ఫస్ట్ మినిట్ నుంచే క ప్రపంచంలోకి వెళ్తారు, వాసుదేవ్ క్యారెక్టర్ కు కనెక్ట్ అవుతారు.

డిస్ట్రిబ్యూటర్ వంశీ నందిపాటి మాట్లాడుతూ – “క” సినిమా ట్రైలర్ కు హ్యూజ్ రెస్పాన్స్ వస్తోంది. ట్రైలర్ రిలీజ్ అయినప్పటి నుంచి చాలా ఫోన్స్ వస్తున్నాయి. మా సినిమా దీపావళికి కాసుల వర్షం కురవాలని కోరుకుంటున్నా. ఒక ఆడియెన్ గా ఈ సినిమాను బాగా ఎంజాయ్ చేశాను. ఫస్ట్ టైమ్ చూసినప్పుడు ఎంతగా ఎగ్జైట్ అయ్యానో 30వ సారి చూసినప్పుడు కూడా అంతే ఎగ్జైట్ అయ్యాను. మనం విరూపాక్ష గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. క సినిమా రిలీజ్ అయ్యాక ఈ సినిమాను కూడా రిఫరెన్స్ గా తీసుకుంటారనే నమ్మకం ఉంది. సినిమా చూశాక నాకు అనిపించిన సజెషన్స్ టీమ్ కు చెప్పాను. దీపావళికి ఒక మంచి మూవీతో మీ ముందుకు వస్తుండటం సంతోషంగా ఉంది. తప్పకుండా మీ ఆదరణ దక్కుతుందని కోరుకుంటున్నాం. అన్నారు.

నటి తన్వీ రామ్ మాట్లాడుతూ – “క” సినిమా కథను దర్శకులు సందీప్, సుజీత్ చెప్పినప్పుడు చాలా ఎగ్జైట్ అయ్యాను. నేను ఎప్పుడూ మూవీ సెలెక్ట్ చేసుకున్నా..అందులో హీరోయిన్ గా నేను చేసే రోల్ ఎలా ఉందని చూస్తాను. “క” మూవీలో నా క్యారెక్టర్ తో పాటు ప్రతి రోల్ కు ఇంపార్టెన్స్ ఉంటుంది. ఈ మూవీలో భాగమవడం సంతోషంగా ఉంది. “క” సినిమాకు మీ దగ్గర నుంచి వచ్చే రెస్పాన్స్ కోసం వెయిట్ చేస్తున్నా. అన్నారు.

హీరోయిన్ నయన్ సారిక మాట్లాడుతూ – “క” సినిమాలో సత్యభామ అనే క్యారెక్టర్ చేశాను. ఈ క్యారెక్టర్ లో నటించడం నాకు చాలా సంతృప్తినిచ్చింది. నాకు “క” మూవీలో నటించే అవకాశం ఇచ్చిన దర్శకులు సందీప్, సుదీప్, హీరో కిరణ్ గారికి థ్యాంక్స్ చెబుతున్నా. నా గత మూవీ ఆయ్ లో చేసిన క్యారెక్టర్ కు కంప్లీట్ డిఫరెంట్ రోల్ “క” సినిమాలో చేశాను. కిరణ్ గారితో కలిసి నటించడం హ్యాపీగా ఉంది. సినిమాలో అనేక మలుపులు ఉంటాయి. అవన్నీ మిమ్మల్ని చాలా ఎగ్జైట్ చేస్తాయి. ఈ నెల 31న థియేటర్స్ లో మిమ్మల్ని కలుస్తాను. మీ ఫీడ్ బ్యాక్ కోసం వెయిట్ చేస్తున్నాం. అన్నారు.

కో ప్రొడ్యూసర్ చింతా వినీషా రెడ్డి మాట్లాడుతూ – “క” సినిమా ట్రైలర్ మీ అందరికీ చూపించి మీ రెస్పాన్స్ తెలుసుకోవాలని భావించాం. మీ దగ్గర నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే హ్యాపీగా ఉంది. మా టీమ్ అంతా ఒక మంచి మూవీ చేయాలనే ప్రయత్నంలో చాలా ఎఫర్ట్స్ పెట్టి పనిచేశాం. “క” సినిమా ఔట్ పుట్ మేమంతా సంతృప్తిపడేలా వచ్చింది. ట్రైలర్ ను ఎంతగా ఇష్టపడుతున్నారో థియేటర్స్ లో సినిమాను అంతకంటే ఎక్కువగా ఆదరిస్తారనే నమ్మకం ఉంది. అన్నారు.

హీరో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ – మా “క” మూవీ ట్రైలర్ చాలా బాగుందంటూ రెస్పాన్స్ వస్తోంది. మరో నాలుగు రోజులే ఉంది సినిమా రిలీజ్ కు . చాలా ఎగ్జైటింగ్ గా ఫీల్ అవుతున్నాం. 31న కేవలం తెలుగులో మాత్రమే సినిమాను రిలీజ్ చేస్తున్నాం. ఒకవారం తర్వాత కన్నడ, తమిళ, మలయాళంలో రిలీజ్ చేయాలనుకుంటున్నాం. ఎందుకంటే తమిళనాట థియేటర్స్ దొరకలేదు, మలయాళంలో దుల్కర్ గారి లక్కీ భాస్కర్ సేమ్ డేట్ కు రిలీజ్ అవుతోంది. కాబట్టి ఒక వారం ఆగి “క” సినిమాను ఆ భాషల్లో విడుదల చేయాలని నిర్ణయించాం. తెలుగులో మీరు మంచి సక్సెస్ ఇస్తే ఆ భాషల నుంచి రెస్పాన్స్ బాగా వస్తుంది. “క” సినిమా కథ విన్నప్పుడు ఇలాంటి ఒక మంచి కథ ప్రేక్షకులకు చూపించాలి అనిపించింది. నా గత సినిమాల్లో కంటెంట్ పరంగా కొన్ని మిస్టేక్స్ జరిగాయి. అలాంటివి లేకుండా ఫస్ట్ సీన్ నుంచి లాస్ట్ వరకు ఎంతో జాగ్రత్తగా సినిమాను చేశాం. దీని వెనక మా టీమ్ లోని ప్రతి ఒక్కరి కృషి ఉంది. మా మూవీ క్లైమాక్స్ 20 నిమిషాలు మాత్రం హైలైట్ అవుతుంది. క్లైమాక్స్ సీన్స్ మొత్తం సర్ ప్రైజ్ చేస్తాయి. “క” సినిమాలో అనవసరపు కమర్షియల్ ఎలిమెంట్స్ ఉండవు. ఫైట్స్ కూడా భారీగా కావాలని పెట్టలేదు. ఇదొక థ్రిల్లర్ మూవీ. గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే తో వెళ్తుంటుంది. కథలో కావాల్సివచ్చినప్పుడు మాత్రమే యాక్షన్ సీన్స్ పెట్టాం. “క” సినిమాలో ఏదైనా ఎలిమెంట్ గతంలో స్క్రీన్ మీద చూశామని మీకు అనిపిస్తే నేను సినిమాలు చేయడం ఆపేస్తా. వాసుదేవ్ అనే క్యారెక్టర్ లో అనేక షేడ్స్ ఉన్నాయి. గ్రే షేడ్స్ కూడా కనిపిస్తాయి. వాసుదేవ్ కు పక్కవాడి జీవితంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలని కోరిక. అందుకే వేరేవాళ్ల ఉత్తరాలు చదువుతుంటాను. ఆ క్రమంలో అతని లైఫ్ ఎలాంటి టర్న్ తీసుకుంది అనేది ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. “క” సినిమా కాస్ట్ అండ్ క్రూ అందరికీ మంచి పేరు తెస్తుందని ఆశిస్తున్నాం. అన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News