Saturday, November 15, 2025
Homeచిత్ర ప్రభKiran Abbavaram : త‌మిళనాడు స్క్రీన్స్ ఇవ్వ‌మ‌ని మొహం మీద‌నే చెప్పేశారు.. కానీ మ‌నం అలా...

Kiran Abbavaram : త‌మిళనాడు స్క్రీన్స్ ఇవ్వ‌మ‌ని మొహం మీద‌నే చెప్పేశారు.. కానీ మ‌నం అలా కాదు.. కిర‌ణ్ అబ్బ‌వ‌రం సెన్సేష‌న‌ల్ కామెంట్స్‌

Kiran Abbavaram Sensational Comments : న‌టుడు, నిర్మాత‌ కిర‌ణ్ అబ్బ‌వరం చేసిన సంచలన వ్యాఖ్యలు ప్రస్తుతం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఎస్ఆర్ క‌ళ్యాణమండ‌పం సినిమాతో మంచి క్రేజ్ సంపాదించుకున్న కిరణ్.. ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాల‌తో బిజీగా ఉన్నారు. దీపావ‌ళి సంద‌ర్భంగా అక్టోబ‌ర్ 18న K-RAMP (కె-రాంప్) సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ నేపథ్యంలో సినిమా ప్ర‌మోష‌న్స్‌లో భాగంగా ఇచ్చిన ఓ ఇంట‌ర్వ్యూలో తెలుగు సినిమాల‌కు ఇత‌ర రాష్ట్రాల్లో ఎదుర‌వుతోన్న ఇబ్బందులు గురించి మాట్లాడిన మాట‌లు వైర‌ల్ అవుతున్నాయి.

- Advertisement -

ప‌ర‌భాషా హీరోల‌ సినిమాలు తెలుగు రాష్ట్రాల్లో గ్రాండ్‌గా విడుదలవుతుంటాయి. సినిమా ఏమాత్రం బావున్నా.. మ‌న ఆడియెన్స్ వాటిని ఆద‌రించే తీరే వేరుగా ఉంటుంది. కానీ మ‌న హీరోల సినిమాలు ఇత‌ర రాష్ట్రాల్లో విడుద‌ల కావాలంటే చాలా ఇబ్బందులు ఎదుర‌వుతాయి. దీనికి ఉదాహ‌ర‌ణ తెలుగులో బ్లాక్ బస్ట‌ర్ అయిన KA సినిమాను త‌మిళ‌నాడులో విడుద‌ల చేయాలంటే థియేట‌ర్స్ ఇవ్వ‌మ‌ని చెప్పేశారు. ఈ విష‌యాన్ని కిర‌ణ్ అబ్బ‌వ‌రం స్వ‌యంగా చెప్ప‌టం ఇప్పుడు డిస్క‌ష‌న్ పాయింట్‌గా మారింది.

‘KA మూవీ డబ్బింగ్ వెర్ష‌న్‌ను త‌మిళ‌నాడులో విడుదల చేయడానికి తాము చాలా ప్ర‌య‌త్నించాం. కఠినమైన వాస్తవం ఏమిటంటే మాకు తమిళనాడులో స్క్రీన్లు ఇవ్వమని మొహం మీదనే చెప్పేశారు’ అని కిరణ్ అబ్బవరం పేర్కొన్నారు. అంతే కాదు తెలుగు వెర్షన్‌కు కూడా మొదటి వారం ముగిసే వరకు సరైన స్క్రీన్లు దొరకలేదని కిరణ్ తెలిపారు. ప్రేక్షకుల నుంచి డిమాండ్ వచ్చినప్పటికీ కేవలం 10 స్క్రీన్లు మాత్రమే దొరికాయన్నారు. ఇతర ఇండ‌స్ట్రీలకు చెందిన యంగ్ యాక్ట‌ర్స్‌ మంచి సినిమాలు చేసినప్పుడు తెలుగు ప్రేక్షకులు వారిని ఆదరిస్తారని.. కానీ తెలుగు నుంచి యంగ్ యాక్ట‌ర్స్‌ ఏదైనా కొత్తగా ప్రయత్నించినప్పుడు మాత్రం ఇతర రాష్ట్రాల్లో థియేట‌ర్లు ఇవ్వరంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కొందరు దీనిని లాజిస్టిక్స్ అని, మరికొందరు స్టార్‌డమ్ అని అంటారని, ఈ పద్ధతి అర్థం కాలేదని కిరణ్ అన్నారు.

ఈ దీపావళికి తమిళ నటుడు ప్రదీప్ రంగనాథన్ (Pradeep Ranganathan) న‌టించిన డ్యూడ్ (Dude movie) చిత్రం తెలుగులో విడుదలవుతుంది. ఇక్కడ ఎక్కువ స్క్రీన్స్‌లో సినిమా రిలీజ్ అవుతుంది. దీని గురించి కిర‌ణ్ ప్ర‌స్తావిస్తూ దక్కించుకుందని కిరణ్ అబ్బవరం ప్రస్తావించారు. ప్ర‌దీప్ రంగ‌నాథ‌న్‌లా నాకు త‌మిళ‌నాడులో థియేట‌ర్లు దొర‌క‌వు అని ఈ సంద‌ర్భంగా కిరణ్ స్పష్టం చేశారు. కిరణ్ అబ్బవరం చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైర‌ల్‌గా మారుతున్నాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad