యువ హీరో కిరణ్ అబ్బవరం(Kiran Abbavaram) హీరోయిన్ రహస్య గోరఖ్(Rahasya Gorak)ని ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా తన భార్య రహస్య గర్భవతి అయిందని సోషల్ మీడియా వేదికగా తెలిపాడు. ఈమేరకు భార్యతో దిగిన ఫొటోలను షేర్ చేశాడు. మా ప్రేమ మరో రెండు అడుగులు పెరిగింది అని తెలిపాడు. దీంతో అభిమానులు, నెటిజన్లు, పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు చెబుతూ కామెంట్స్ చేస్తున్నారు.
కాగా కిరణ్-రహస్య ఇద్దరూ కలిసి ‘రాజావారు రాణిగారు’ సినిమాలో నటించారు. ఈ సినిమా సమయంలోనే ఇద్దరూ ప్రేమలో పడ్డారు. ఐదేళ్ల ప్రేమాయణం తర్వాత గతేడాది ఆగస్టు 22న పెళ్లి చేసుకున్నారు. ఇటీవలే ‘క’ సినిమాతో కిరణ్.. సూపర్ హిట్ కొట్టాడు. త్వరలోనే ‘దిల్ రూబా’ అనే సినిమాతో ప్రేక్షకులను అలరించనున్నాడు. కిరణ్ వరుసగా సినిమాలు చేస్తున్నా రహస్య మాత్రం సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టేసింది.