Saturday, November 15, 2025
Homeచిత్ర ప్రభJunior Movie Review: ‘జూనియర్’ మూవీ రివ్యూ

Junior Movie Review: ‘జూనియర్’ మూవీ రివ్యూ

సినిమా: జూనియ‌ర్‌
న‌టీన‌టులు: కిరిటీ, శ్రీలీల‌, ర‌విచంద్ర‌న్‌, జెనీలియా, రావు ర‌మేష్‌, వైవా హ‌ర్ష‌, అచ్యుత్ కుమార్ త‌దిత‌రులు
ద‌ర్శ‌క‌త్వం: రాధాకృష్ణ రెడ్డి
నిర్మాత‌: ర‌జినీ కొర్ర‌పాటి
సినిమాటోగ్ర‌ఫీ: కె.కె.సెంథిల్ కుమార్‌
సంగీతం: దేవిశ్రీ ప్ర‌సాద్‌
ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌: ర‌వీంద‌ర్‌
యాక్ష‌న్‌: పీట‌ర్ హెయిన్స్‌
ఎడిట‌ర్‌: నిరంజ‌న్‌

- Advertisement -

Junior Movie Review: గాలి జనార్ధన్ రెడ్డి తనయుడు కిరిటీ హీరోగా రూపొందిన చిత్రం ‘జూనియర్’. ఈ సినిమా వైరల్ వయ్యారి పాటతో ట్రెండింగ్‌లోకి వచ్చింది. కిరిటీ, శ్రీలీల వేసిన స్టెప్పులు అభిమానులను అలరించాయి. దీంతో సినిమాపై అందరూ దృష్టి సారించారు. దేవిశ్రీ ప్రసాద్, సెంథిల్ కుమార్ వంటి టాప్ టెక్నీషియన్స్ కూడా ఇందులో భాగమయ్యారు. తండ్రి, కొడుకు మధ్య సాగే ఎమోషనల్ మూవీగా జూనియర్ తెరకెక్కిందని ట్రైలర్‌తో అర్థమైంది. మరి శుక్రవారం విడుదలైన ఈ మూవీ ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందనే విషయాన్ని ఇప్పుడు చూసేద్దాం.

Also Read- Kavya Thapar: బీచ్ ఒడ్డున బికినీలో అందాల మోత మోగించిన కావ్య థాపర్

కథ-
కోదండ పాణి(రవిచంద్రన్), శ్యామల దంపతులకు పెళ్లైన చాలా కాలం తర్వాత అభి(కిరిటీ) పుడతాడు. కొడుకంటే కోదండపాణికి చెప్పలేనంత ప్రేమ. తండ్రి చూపించే అతి ప్రేమను అభి తట్టుకోలేడు. దీంతో చదువు పేరుతో సిటీకి వచ్చేస్తాడు. స్నేహితులతో సరదాగా ఉంటూ చదువుకునే అభి జీవితంలో మెమొరీస్ ఎంతో ముఖ్యమైందని, గుర్తు పెట్టుకునేలా అవి ఉండాలని భావిస్తుంటాడు. కాలేజీలోనే స్ఫూర్తి(శ్రీలీల)ని ప్రేమిస్తాడు. ఆమె పనిచేసే కంపెనీలోనే జాబ్ కూడా సంపాదిస్తాడు. కంపెనీలో ఎంటరైన తొలి రోజునే బాస్ విజయ సౌజన్య(జెనీలియా)కు, అభికి మధ్య గ్యాప్ వస్తుంది. అయితే అనుకోని పరిస్థితుల్లో విజయ సౌజన్యతో కలిసి విజయ నగరం వస్తాడు. అసలు విజయ నగరంకు, అభికి ఉన్న సంబంధం ఏంటి? విజయ సౌజన్య గురించి అభికి తెలిసిన నిజమేంటి? అనే విషయాలు తెలియాలంటే మాత్రం సినిమా చూడాల్సిందే.

సమీక్ష –
సినీ రంగంలోకి వారసుల ఎంట్రీ ఇవ్వటం అనేది కామన్‌గా మారింది. అయితే ఇప్పుడు సినీ రంగానికి చెందిన వారే కాదు.. రాజకీయ రంగానికి చెందినవారి వారసులు కూడా ఎంట్రీ ఇచ్చేస్తున్నారు. వారసులు సినీ రంగంలోకి వస్తున్నప్పుడు అలాంటి వారి కోసం అన్ని జాగ్రత్తలు తీసుకుని పక్కా కమర్షియల్ సబ్జెక్ట్‌తో సినిమాను సిద్ధం చేస్తుంటారు. కిరిటీ విషయంలోనూ అదే జరిగింది. జూనియర్ సినిమా డాన్సులు, ఫైట్స్, ఎమోషన్స్ ఇలా అన్ని ఎలిమెంట్స్ కాంబోలో కమర్షియల్ మూవీని రూపొందించాడు దర్శకుడు రాధాకృష్ణ. అయితే కథ మాత్రం పాత చింతకాయ పచ్చడిలాగానే ఉంది. సినిమా చూస్తున్నంత సేపు సన్నివేశాల్లో కొత్తదనం కనిపించదు. ఏం జరుగుతుందనే విషయాలు ప్రేక్షకులకు అర్థమవుతుంటాయి.

తండ్రి, కొడుకు మధ్య ఉండే ఎమోషనల్ సీన్‌తో సినిమా ప్రారంభమవుతుంది. అక్కడి నుంచి కాలేజీకి సినిమా వెళుతుంది. అక్కడి నుంచి రొటీన్ సన్నివేశాలతో సినిమా రన్ అవుతుంది. హీరో చేసే ఫైట్స్, హీరో హీరోయిన్ మధ్య లవ్, డాన్సులు .. ఇలాగే సినిమా ఆసాంతం సాగుతుంది. అయితే కాలేజీ సన్నివేశాల్లో ఉండే కామెడీ ఆడియెన్స్‌ను ఆకట్టుకుంటాయి. ఎప్పుడైతే జెనీలియా పాత్ర ఎంట్రీ ఉంటుందో అక్కడి నుంచి కథ టర్న్ తీసుకుంటుంది. ఫ్యామిలీ, ఎమోషన్స్, ఊరు.. అంటూ కథ మలుపులు తీసుకుంటుంది. అయితే కథలో ఎక్కడా కొత్తదనం కనిపించదు. సెకండాఫ్‌లో ఊరులో వచ్చే సన్నివేశాలు శ్రీమంతుడు, మహర్షి సినిమాలను గుర్తుకు తెస్తాయి.

Also Read- SSMB 29 Updates: అదే జరిగితే ప్రపంచంలో రాజమౌళిని ఎవరు టచ్ చేయరు..

నటీనటుల విషయానికి వస్తే తొలి చిత్రమే అయినా కిరిటీ డాన్సులు, ఫైట్లు చాలా బాగా చేశాడు. తెర‌పై కనిపించిన విధానం కూడా బాగుంది. ముఖ్యంగా వైర‌ల్ వ‌య్యారి పాట‌లో అయితే పైసా వ‌సూల్ అనిపించాడు. శ్రీలీల‌, కిరీటి పోటాపోటీగా ఆ పాట‌లో ఆడిపాడారు. క‌థానాయిక శ్రీలీల పాత్ర‌కి సినిమాలో పెద్ద‌గా ప్రాధాన్యం లేదు, ఆమె పాట‌ల కోస‌మే అన్న‌ట్టుగా తెర‌పై క‌నిపిస్తుంది. ద్వితీయార్ధంలో వైర‌ల్ వ‌య్యారి పాట‌లో మాత్రమే క‌నిపిస్తుంది. కార్పొరేట్ కంపెనీ సీఈఓగా జెనీలియా క‌నిపించిన విధానం, ఆమె న‌ట‌న మెప్పిస్తుంది. కీలకమైన పాత్రతో ఆమె రీ ఎంట్రీ ఇచ్చారు కానీ, అందులో న‌టించేందుకే ఆమెకు పెద్ద‌గా ఆస్కారం ల‌భించ‌లేదు. రావు ర‌మేశ్‌, ర‌విచంద్ర‌న్ కీలక పాత్ర‌ల్లో కనిపించి, ప‌రిధి మేర‌కు న‌టించారు. అచ్యుత్‌కుమార్ విల‌న్‌గా కనిపించినా, ఆ పాత్రలో బ‌లం లేదు. వైవా హ‌ర్ష, స‌త్య అక్క‌డ‌క్క‌డా కామెడీ పండించారు.

సాంకేతికంగా చూస్తే రాక్ స్టార్ దేవిశ్రీప్ర‌సాద్ సంగీతం సినిమాకి హైలైట్‌గా నిలిచింది. సెంథిల్ ఛాయాగ్ర‌హ‌ణం మెప్పిస్తుంది. ఎడిటింగ్‌, క‌ళ విభాగాలు మంచి ప‌నితీరుని క‌న‌బ‌రిచాయి. రాధాకృష్ణ రెడ్డి ద‌ర్శ‌కుడిగా ప‌ట్టు ప్ర‌ద‌ర్శించారు కానీ, ర‌చ‌నలో కొత్త‌ద‌నం చూపించ‌లేక‌పోయారు. నిర్మాణ విలువలు బావున్నాయి. కిరిటీ నటన, వైరల్ వయ్యారి పాట సినిమాలో ఆడియెన్స్‌ను మెప్పిస్తే కథలో కొత్తదనం లేకపోవటం, భావోద్వేగాలు కనెక్టింగ్‌గా లేకపోవటం సినిమాకు మైనస్ అనే చెప్పాలి.

చివరగా.. జూనియర్.. రొటీన్ కమర్షియల్ చిత్రం
రేటింగ్ – 2.5/5

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad