Kishan Reddy: ఈ వారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమాలలో ‘అరి’ పాజిటివ్ టాక్ తెచ్చుకొని బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. కంటెంట్ ఉంటే ప్రేక్షకులు ఆదరిస్తారని తాజాగా వచ్చిన ‘అరి’ చిత్రం మరోసారి నిరూపించింది. గతంలో ‘పేపర్ బాయ్’ లాంటి యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్‌ని తీసి గుర్తింపు తెచ్చుకున్న జయశంకర్ ఎంతో విభిన్నంగా ఆలోచించి కొత్త తరహా స్క్రీన్‌ప్లేతో రూపొందించారు. ఒక సినిమా మొదలై, అది ప్రేక్షకుల ముందుకు వచ్చే క్రమంలో ఎన్నో ఆటు పోట్లను ఎదుర్కోవాల్సి వస్తుంది. ‘అరి’ చిత్ర దర్శకుడు జయశంకర్ కూడా ఇలాంటివన్నీ అధిగమించి ఏడేళ్ళ కష్టానికి అరి సినిమాతో విజయం సాధించాడు.
తాజాగా ఈ సినిమాపై ఎంతో సృజనాత్మకతతో ఆలోచించి తీసిన దర్శకుడు జయశంకర్ మీద కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రశంసల వర్షం కురిపించారు. అక్టోబర్ 10న రిలీజైన ఈ సినిమాకి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఇందులో ఉన్న పాత్రలు, వాటి స్వభావాలు చక్కగా ఆవిష్కరించాడు దర్శకుడు. ఇప్పుడంతా పాన్ ఇండియా సినిమాల హవాతో పాటు హర్రర్ అండ్ థ్రిల్లర్ జానర్ సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఆ సినిమాలకి భిన్నంగా వచ్చిన ‘అరి’ సమాజంలో ఉండే సమస్యలను ఎత్తి చూపి, ఆలోచింపజేసేలా ఉండటం ఈ సక్సెస్‌కి ప్రధాన కారణం.
Also Read – Anupama Parameswaran: చీరకట్టులో అచ్చ తెలుగు అమ్మాయిలా.. అనుపమ కిల్లింగ్ లుక్స్ వైరల్
ఏ దర్శకుడైనా కెరీర్ ప్రారంభంలో రిస్క్ చేయకుండా లవ్ స్టోరీని గానీ, హర్రర్ సినిమాను గానీ తీసి నిరూపించుకోవాలనుకుంటాడు. కానీ, సినిమాపై ఉన్న మమకారమే కాకుండా సమాజానికి మంచి సందేశం ఇస్తూ జనాలలో ఉన్న ద్వంధ వైఖరిని తట్టి లేపే కథ, కథనాలు.. ఇందుకోసం ఎంచుకున్న పాత్రలతో ప్రేక్షకులను మెప్పించాలంటే అదో పెద్ద సాహసం. అలాంటి సాహసం చేసి విజయాన్ని అందుకున్నాడు ‘అరి’ ద్వారా దర్శకుడు జయశంకర్. ‘అరి’ షడ్వర్గాలుగా పిలువబడే కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాల కాన్సెప్ట్‌ని అనుకోవడంలోనే దర్శకుడి నిజాయితీ అర్థమవుతుంది.
సమాజం మీద ఉన్న బాధ్యతతో సినిమా చేయాలనే సంకల్పం చాలా తక్కువమంది దర్శకులకి ఉంటుంది. ‘అరి’ సినిమాతో ఆ దర్శకుల జాబితాలో జయశంకర్ కూడా ఖచ్చితంగా చేరతాడు. ఇప్పటికే, ఈ సినిమాను చూసిన సినీ ప్రముఖులు దర్శకుడి గట్స్‌కి మెచ్చుకుంటున్నారు. నవతరానికి కావాల్సిన ఓ చక్కటి సందేశాత్మక చిత్రాన్ని అందించాడని శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మొత్తంగా ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ‘అరి’ చిత్రం ఇంతటి విజయం సాధిస్తుందని ఊహించలేదు. ఇది పూర్తిగా దర్శకుడి చిత్రం. కాబట్టే, మంత్రులు సైతం అభినందనలు తెలుపుతున్నారు.
Also Read – OG MOVIE: సినిమా హిట్, కలెక్షన్స్ ఫట్ అంటే ఇదేనేమో!


