ఏ పిల్లలకైనా తమ తల్లిదండ్రులను గొప్పగా చూస్తుంటే ఆ అనుభూతే వేరుగా ఉంటుంది. అలాంటి అనుభూతే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) కుమార్తె క్లీంకార(Klinkaara)కు దక్కింది. చరణ్ నటించిన ‘ఆర్‌ఆర్‌ఆర్: బిహైండ్ అండ్ బియాండ్’ (RRR: Behind& Beyond) డాక్యుమెంటరీ ట్రైలర్ వీక్షిస్తూ ఉంది. చరణ్ టీవీలో కనిపించగానే నాన్న అంటూ స్క్రీన్ వైపు చూపిస్తూ మురిసిపోయింది. ఇందుకు సంబంధించిన క్యూట్ వీడియోను ఉపాసన సోషల్ మీడియాలో పంచుకున్నారు. తన తండ్రిని తొలిసారి టీవీలో చూసి క్లీంకార ఎంతో ఆనందం వ్యక్తంచేసిందని క్యాప్షన్ ఇచ్చారు. దీంతో క్లీంకార వీడియో వైరల్ గా మారింది.
కాగా చరణ్ దంపతులకు 2023లో క్లీంకార జన్మించిన విషయం తెలిసిందే. ఫ్యామిలీ ఫొటోలు పంచుకున్నా అందులో పాప ముఖాన్ని మాత్రం చూపించడం లేదు. ఈ నేపథ్యంలో క్లీంకార ముఖం పూర్తిగా ఎప్పుడు చూస్తామంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే చరణ్ హీరోగా నటించిన ‘గేమ్ ఛేంజర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇవాళ సాయంత్రం రాజమండ్రిలో జరుగనుంది. ఈ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Pawan Kalyan) హాజరుకానున్నారు.