Robo Shankar Passed away: కోలీవుడ్ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. తనదైన కామెడీతో ప్రేక్షకులను మెప్పించిన స్టార్ కమెడియన్ రోబో శంకర్ కన్నుమూశారు. ఆయన వయసు 46 ఏళ్లు. కొన్నాళ్లుగా కిడ్నీ, లివర్ సమస్యలతో ఆయన ఇబ్బంది పడుతున్నారు. షూటింగ్ జరుగుతుండగా ఉన్నట్లుండి పడిపోయారు. వెంటనే ఆయన్ని హాస్పిటల్‌కు తరలించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. రోబో శంకర్ మరణ వార్త విని ఇండస్ట్రీ షాకవుతోంది. నటుడిగా సినిమాల్లోకి ప్రవేశించక ముందు ఆయన మిమిక్రీ ఆర్టిస్టుగా మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. తర్వాత బుల్లి తెరలోకి అడుగు పెట్టారు. అటు నుంచి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. నటుడిగా, కమెడియన్‌గా మంచి పేరు సంపాదించుకున్నారు. ఇండస్ట్రీలో స్టార్ హీరోలందరి సినిమాల్లోనూ ఆయన నటించారు. సింగం3, పా పా పాండి, మారి 2, విశ్వాసం, మిస్టర్ లోకల్, కోబ్రా.. ఇలా పలు చిత్రాల్లో నటించి మెప్పించారు.
Also Read – Bandla Ganesh: పెద్ద దర్శకులు, నిర్మాతలు సిగ్గుతో తల దించుకోవాలి.. దీనమ్మ ఇది కదా సినిమా అంటే
రోబో శంకర్ కుమార్తె ఇంద్రజ శంకర్ దళపతి విజయ్ హీరోగా అట్లీ తెరకెక్కించిన భారీ చిత్రం విజిల్ (బిగిల్)లో నటిగా ఎంట్రీ ఇచ్చింది. ఆయన సతీమణి ప్రియాంక శంకర్ కూడా కన్నీ మేడమ్ సినిమాతో నటిగా రంగ ప్రవేశం చేసింది. బరువు తగ్గే క్రమంలో రోబో శంకర్ పచ్చ కామెర్ల వ్యాధితో బాధపడ్డారు. గాడ్స్ జిల్లా సినిమా షూటింగ్ సమయంలో తీవ్ర అస్వస్థతకు లోనైన రోబో శంకర్.. ఉన్నట్లుండి కళ్లు తిరిగి పడిపోయి హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. ఐసీయులో ఉంచిన డాక్టర్స్ చికిత్సను అందించారు. అయినా కూడా ఫలితం లేకుండా పోయింది.
Also Read – Viral Video: నీలి రంగు నాలుక ఉన్న వింత జీవిని ఎప్పుడైనా చూశారా?


