Jayam Ravi: కోలీవుడ్ హీరో జయం రవి మరోసారి వార్తల్లో నిలిచారు. ఇంటి కోసం తీసుకున్న లోన్‌కు సంబంధించిన ఈఎమ్ఐలను జయం రవి చాలా కాలంగా చెల్లించలేకపోవడంతో బ్యాంకు అధికారులు సీజ్ నోటీజులు జారీ చేశారట. జయం రవి ఇంటిని వేలం వేయబోతున్నట్లు కోలీవుడ్‌లో జోరుగా ప్రచారం జరుగుతోంది. జయం రవి మూడేళ్ల క్రితం చెన్నైలోని ఇంజంబాకంలో లగ్జరీ బంగ్లా కొనుగోలు చేశారు. తన భార్య పిల్లలతో కలిసి ఈ ఇంటిలోనే చాలా కాలం ఉన్నారు. ఈ ఇంటిని కొనడం కోసం ఓ ప్రైవేటు బ్యాంకు నుంచి కోట్ల రూపాయల లోన్ తీసుకున్నారట జయం రవి.
విభేదాల కారణంగా…
భార్య ఆర్తితో విభేదాల కారణంగా ఇంటి నుంచి బయటకు వచ్చేశారు జయం రవి. గత ఏడాది కాలంగా ఆర్తితో పాటు ఆమె పిల్లలు మాత్రమే ఈ ఇంటిలో ఉంటున్నారు. కాగా గత పదకొండు నెలలుగా జయం రవి ఇంటి లోన్ తాలూకు ఈఎమ్ఐలు చెల్లించడం లేదట. ఈఎమ్ఐలకు సంబంధించి పలుమార్లు జయం రవికి బ్యాంకు అధికారులు సమాచారం అందించారట. కానీ ఆయన నుంచి ఎలాంటి సమాధానం రాలేదని అంటున్నారు. దాంతో ఇంజంబాకంలోని జయం రవి ఇంటికి వెళ్లిన బ్యాంకు అధికారులు వేలం నోటీసులను అంటించినట్లు కోలీవుడ్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. ఆయన ప్రొడక్షన్ ఆఫీస్‌కు కూడా నోటీసులను అంటించినట్లు సమాచారం. ఈ నోటీసులో జయం రవి ఏడు కోట్ల అరవై లక్షల వరకు లోన్ అమౌంట్ బాకీగా ఉన్నట్లు బ్యాంకు అధికారులు పేర్కొన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. లోను చెల్లించని పక్షంలో జయం రవిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని బ్యాంకు అధికారులు పేర్కొన్నట్లు సమాచారం.
Also Read- Ghaati OTT: అనుష్క ఘాటీ ఓటీటీలోకి వచ్చేస్తోంది – స్ట్రీమింగ్ డేట్, ప్లాట్‌ఫామ్ ఇవే!
భార్య పిల్లలు రోడ్డు మీదకు…
బ్యాంకు అధికారులు ఇంటిని వేలం వేస్తే ఆర్తి, ఆమె పిల్లలు రోడ్డు మీదకు రావాల్సిన పరిస్థితి వస్తుందని నెటిజన్లు చెబుతోన్నారు. భార్యపై రివేంజ్ తీర్చుకోవడానికే జయం రవి ఈఎమ్ఐలు కట్టడం ఆపేసి ఉంటారని అంటున్నారు. భార్య, పిల్లలకు ఇళ్లు లేకుండా జయం రవి చేస్తున్నాడని అంటున్నారు.
ఆరు కోట్ల అడ్వాన్స్‌లు…
టచ్ గోల్డ్ యూనివర్సల్ అనే ప్రొడక్షన్ హౌస్ కూడా జయం రవి ఇల్లును జప్తు చేయాలని బ్యాంకు అధికారులతో పాటు పోలీసులను కోరినట్లు తెలిసింది. తమ బ్యానర్‌లో వరుసగా రెండు సినిమాలు చేస్తానని జయం రవి ఆరు కోట్ల వరకు అడ్వాన్స్‌లు తీసుకున్నాడని, కానీ తమకు కేటాయించిన డేట్స్‌లో వేరే బ్యానర్‌లో సినిమాలు చేస్తున్నాడని కొద్ది రోజుల క్రితం టచ్ గోల్డ్ బ్యానర్ జయం రవిపై కేసు పెట్టింది. డబ్బులు తిరిగి ఇవ్వమని అడిగినా జయం రవి నుంచి స్పందన లేదని పేర్కొన్నారు. ఇంటిని వేలం వేసి ఆ డబ్బును ఇప్పించాలని బ్యాంకు అధికారులను ప్రొడక్షన్ హౌజ్ కోరినట్లు టాక్.
Also Read- OG Review: సినీ ప్రపంచంలో రికార్డులు సృష్టిస్తున్న గంభీర..అదరగొడుతున్న ఓజీ!
సింగర్ కేనీషాతో చెట్టపట్టాలు…
మరోవైపు జయం రవి, ఆయన భార్య ఆర్తి విడాకుల కేసు ప్రస్తుతం కోర్టులో ఉంది. సింగర్ కేనీషా కారణంగానే ఆర్తి నుంచి జయం రవి దూరమయ్యాడని ప్రచారం జరుగుతోంది. గత కొన్నాళ్లుగా సింగర్ కేనీషాతో జయం రవి సన్నిహితంగా ఉంటున్న ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.


