Devara 2: ఎన్టీఆర్ దేవర 2 వస్తుందా? లేదా? అనే అనుమానాలకు ఇటీవలే చెక్ పెట్టారు మేకర్స్. దేవర రిలీజై ఏడాది పూర్తయిన సందర్భంగా దేవర 2 పోస్టర్ రిలీజ్ చేశారు. దేవర 2 కోసం రెడీగా ఉండండి అంటూ పేర్కొన్నారు. ఇప్పటికే దేవర 2 కు స్క్రిప్ట్ వర్క్‌ను డైరెక్టర్ కొరటాల శివ పూర్తి చేసినట్లు సమచారం. ఎన్టీఆర్ డేట్స్ కోసం ఎదురుచూస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. డిసెంబర్ నుంచి ఈ సీక్వెల్ సెట్స్‌పైకి రానుందట. దేవర పార్ట్ 2 కోసం స్క్రిప్ట్‌లో కొరటాల శివ చాలా మార్పులు చేసినట్లు సమాచారం.
దేవర విషయంలో కొరటాల శివపై చాలా విమర్శలొచ్చాయి. దేవర క్లైమాక్స్‌ను బాహుబలి నుంచి కాపీకొట్టాడంటూ విమర్శించారు. స్టోరీ, ట్విస్ట్‌లతో పాటు ఎన్టీఆర్ క్యారెక్టరైజేషన్‌ను సరిగ్గా ఆవిష్కరించలేకపోయాడంటూ కొరటాల శివను ఫ్యాన్స్ ట్రోల్ చేశారు. హీరోయిన్ జాన్వీకపూర్‌ను గెస్ట్ రోల్‌గా చూపించడంతో అభిమానులు డిసపాయింట్ అయ్యారు. కథలో బలం లేకపోయినా ఎన్టీఆర్ స్టార్‌డమ్, ఇమేజ్ కారణంగా కమర్షియల్‌గా సినిమా హిట్టయ్యింది.
దేవర పార్ట్ వన్‌పై వచ్చిన విమర్శల నేపథ్యంలో సీక్వెల్ విషయంలో కొరటాల శివ స్క్రిప్ట్ స్టేజ్‌లోనే చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు టాక్. ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు ఫుల్ ట్రీట్‌లా ఉండేలా దేవర 2ను ప్లాన్ చేస్తున్నట్లు తెలిసింది. వివిధ భాషలకు చెందిన స్టార్స్‌తో ప్రాపర్ పాన్ ఇండియన్ మూవీలా సీక్వెల్‌ను రూపొందించనున్నారట.
Also Read – Anushka Shetty: ఎట్టకేలకు చిరుతో స్వీటీ కోరిక నెరవేరుతుందా!
శింబు మెయిన్ రోల్…
ఈ సీక్వెల్‌లో ఎన్టీఆర్, సైఫ్ అలీఖాన్‌తో పాటు మరో ఇంపార్టెంట్ క్యారెక్టర్ కూడా ఉంటుందట. ఎన్టీఆర్ లక్ష్యానికి, పోరాటానికి సపోర్ట్‌గా ఉండే ఈ కీలక పాత్రలో కోలీవుడ్ స్టార్ హీరో శింబు నటించబోతున్నట్లు చెబుతున్నారు. ఇటీవలే శింబును కలిసిన కొరటాల శివ… దేవర 2 కథ వినిపించినట్లు సమాచారం. స్టోరీతో పాటు తన క్యారెక్టర్‌ను డిజైన్ చేసిన తీరు నచ్చడంతో ఈ సీక్వెల్‌లో నటించడానికి శింబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు చెబుతున్నారు.
ఎన్టీఆర్, శింబు కలిసి సినిమా చేయడం ఇదే ఫస్ట్ టైమ్. గతంలో ఎన్టీఆర్ బాద్‌షా సినిమాలో శింబు ఓ పాట పాడాడు. కాగా ప్రస్తుతం ప్రశాంత్ నీల్‌తో డ్రాగన్ మూవీ చేస్తున్నాడు ఎన్టీఆర్. ఈ యాక్షన్ డ్రామా మూవీ వచ్చే ఏడాది జూన్‌లో రిలీజ్ కాబోతుంది. డ్రాగన్ మూవీలో రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటిస్తుంది. నవంబర్‌లో ఈ సినిమా నెక్స్ట్ షెడ్యూల్ మొదలు కాబోతున్నట్లు సమాచారం.


