Karthi : మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు ‘మన శంకర వరప్రసాద్’ సిినిమాను కంప్లీట్ చేయటంలో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఈ మూవీని సంక్రాంతి సందర్భంగా జనవరి 9న విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత బాబీ దర్శకత్వంలో మూవీ చేయటానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ప్రముఖ నిర్మాణ సంస్థ కెవిఎన్ ప్రొడక్షన్స్ సంస్థ ఈ సినిమాను ప్రెస్టీజియస్‌గా నిర్మించటానికి ప్లానింగ్ చేస్తోంది. డైరెక్టర్ బాబీ సినిమాను మెగా ఇమేజ్, క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుని కథను సిద్ధం చేస్తున్నాడు. ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. నవంబర్ నెలకంతా అనీల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘మన శంకర వరప్రసాద్’ మూవీని కంప్లీట్ చేసి.. వెంటనే బాబీ సినిమాను సెట్స్ పైకి తీసుకెళతారు.
మెగాస్టార్ ఎక్కువ గ్యాప్ తీసుకోకుండా వీలైనంత త్వరగా మెగా 158ను స్టార్ట్ చేయబోతున్నారు. ఇంతకు ముందు చిరంజీవి, బాబీ కాంబోలో వచ్చిన వాల్తేరు వీరయ్య మూవీ కూడా మల్టీస్టారరే. చిరంజీవితో పాటు మాస్ మహారాజా రవితేజ కలిసి నటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరోసారి బాబీ మెగాస్టార్‌తో మల్టీస్టారర్ మూవీనే చేయబోతున్నట్టు టాక్ వినిపిస్తోంది. నిన్న మొన్నటి వరకు మలయాళ సూపర్‌స్టార్ మోహన్ లాల్..చిరంజీవితో కలిసి నటిస్తాడని వార్తలు వినిపించాయి. కానీ.. తాజా సమాచారం మేరకు చిరు, బాబీ మూవీ కోలీవుడ్ స్టార్ కార్తి కీలక పాత్రలో నటించబోతున్నాడు. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రానుంది.
ALSO READ : https://teluguprabha.net/cinema-news/dhruv-vikram-confirmed-his-dating-with-anupama-parameswaran/
మెగాస్టార్ చిరంజీవి సరసన ఇద్దరు హీరోయిన్స్ కనిపించబోతున్నారు. వారెవరో కాదు.. ఒకరేమో మాళవికా మోహనన్.. మరో బ్యూటీ రాశీఖన్నా. క్రేజీ స్టార్స్‌తో మెగా 158ను బాబీ తెరకెక్కించటానికి సన్నాహాలు చేస్తున్నారు. కెవిఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్ తెలుగులో నిర్మించబోతున్న తొలి సినిమా కూడా ఇదే. నిజానికి శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో చిరంజీవి ఓ సినిమా చేయాల్సింది. కానీ నానితో ఆయన తెరకెక్కిస్తోన్న ది ప్యారడైజ్ మూవీ ఇంకా పూర్తి కాలేదు. ఈ గ్యాప్‌లో బాబీ డైరెక్షన్‌లో చిరంజీవి సినిమా చేయబోతున్నారు.
ALSO READ : https://teluguprabha.net/cinema-news/anand-ravi-latest-movie-napoleon-returns-ttitle-glimpse-released-today/


