Kashmir Floods: గత కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలు (Heavy rains), వాటి వల్ల సంభవించిన వరదలు (Floods) ప్రజలను అతలాకుతలం చేస్తున్న విషయాలను గమనిస్తూనే ఉన్నాం. తెలుగు రాష్ట్రాలతో పాటు, జమ్మూ కాశ్మీర్‌లోని పలు ప్రాంతాలు కూడా వరదల కారణంగా నీట మునిగాయి. ఒకవైపు సహాయక చర్యలు జరుగుతున్నప్పటికీ, మరోవైపు వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. ఈ ప్రకృతి వైపరీత్యాల కారణంగా సామాన్యులే కాకుండా, సెలబ్రిటీలు కూడా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. తాజాగా ప్రముఖ తమిళ స్టార్ హీరో మాధవన్ (Hero Madhavan) వరదల్లో చిక్కుకున్నట్లు సమాచారం అందింది. ఇది ఆయన అభిమానులలో తీవ్ర ఆందోళనను కలిగిస్తోంది.
జమ్మూ కాశ్మీర్‌లో వరదల్లో మాధవన్..
మాధవన్ తన తదుపరి సినిమా షూటింగ్ నిమిత్తం జమ్మూ కాశ్మీర్‌లోని లేహ (Leh) ప్రాంతానికి వెళ్లారు. అయితే, అక్కడ నిరంతరాయంగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా అన్ని రవాణా సర్వీసులు నిలిచిపోయాయి. విమానాలు రద్దు కావడంతో, ఆయన తిరిగి రాలేక ఆ ప్రాంతంలోనే చిక్కుకుపోయారు. ఈ పరిస్థితిని చూసిన మాధవన్.. 17 ఏళ్ల క్రితం ‘3 ఇడియట్స్’ (3 Idiots) సినిమా షూటింగ్ సమయంలో ఎదురైన అలాంటి అనుభవాన్నే గుర్తు చేసుకున్నారు. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియా ద్వారా మరోసారి గుర్తు చేసుకున్నారు. ఆయన పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది.
Also Read – Nikki Bhati : నిక్కీ భాటి హత్య కేసు.. సిలిండర్ పేలుడు కాదు, ప్రణాళికాబద్ధమైన హత్య!
ఫ్యాన్స్ టెన్షన్..
మాధవన్ చిక్కుకుపోయారనే వార్త విన్న ఆయన అభిమానులు ఆందోళన పడుతున్నారు. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ప్రస్తుతం మాధవన్ సురక్షితంగానే ఉన్నారని తెలుస్తుంది. హీరో మాధవన్ కొద్దికాలం సినిమాల నుండి విరామం తీసుకుని, ఇటీవల తన సెకండ్ ఇన్నింగ్స్ (Second Innings)ను విజయవంతంగా ప్రారంభించారు. తన వయసుకు తగ్గ పాత్రలను ఎంచుకుంటూ వరుసగా సూపర్ హిట్ చిత్రాలను తన ఖాతాలో వేసుకుంటున్నారు. ప్రస్తుతం ఆయన ఒక పాన్ ఇండియా సినిమాలో తండ్రి పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం.
స్టార్ ఇమేజ్ ఉన్నప్పటికీ మాధవన్ చాలా సింపుల్‌గా కనిపిస్తారు.. అందుకు కారణం ఆయన స్టార్ హీరోలైన రజినీకాంత్, అజిత్‌లను ఆదర్శంగా తీసుకున్నట్లు ఒకానొక సందర్భంలో వెల్లడించారు. దేశవ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు (Heavy rains), వరదలు (Floods) సామాన్యుల జీవితాలను, సెలబ్రిటీల ప్రణాళికలను కూడా ప్రభావితం చేస్తున్నాయి. మాధవన్ సురక్షితంగా ఉండటం ఆయన అభిమానులకు ఊరట కలిగించే విషయం.
నిశ్శబ్దం సినిమా తర్వాత మాధవన్ మరో తెలుగు సినిమా చేయలేదు. హిందీ, తమిళ ప్రాజెక్టులతోనే బిజీగా ఉన్నారు. ప్రస్తుతం మహేష్, రాజమౌళి కాంబోలో తెరకెక్కుతోన్న సినిమాలో ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నారు.
Also Read – Mohan Babu: ఘట్టమనేని వారసుడి సినిమాలో విలన్‌గా మోహన్‌బాబు.. హీరోయిన్‌గా రవీనా టాండన్ కూతురు


