Kotha lokah: మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ నిర్మించిన లేడీ సూపర్ హీరో మూవీ కొత్త లోక బాక్సాఫీస్ వద్ద అదరగొడుతోంది. కళ్యాణి ప్రియదర్శన్ హీరోయిన్‌గా నటించిన ఈ మూవీ రిలీజైన ఏడు రోజుల్లోనే 93 కోట్ల వసూళ్లను దక్కించుకున్నది. వంద కోట్ల మైలురాయికి చేరువలో ఉంది. కొత్త లోక దెబ్బకు మలయాళం స్టార్ హీరో మోహన్‌లాల్ నటించిన హృదయపూర్వం కూడా వెనుకబడిపోయింది. లేడీ సూపర్ హీరో మూవీ కలెక్షన్స్‌లో సగం కూడా మోహన్‌లాల్ మూవీ రాబట్టలేకపోయింది.
అనుష్క, కీర్తి సురేష్ సినిమాలను దాటేసి…
సౌత్ లేడీ ఓరియెంటెడ్ మూవీస్‌లో హయ్యెస్ట్ కలెక్షన్స్ దక్కించుకున్న సినిమాగా కొత్త లోక సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. గతంలో ఈ రికార్డ్ కీర్తి సురేష్ మహానటి పేరిట ఉండేది. సావిత్రి జీవిత కథతో తెరకెక్కిన మహానటి 84 కోట్ల వరకు వసూళ్లను దక్కించుకున్నది. ఆ తర్వాత ప్లేస్‌లో అనుష్క రుద్రమదేవి (82 కోట్లు), అరుంధతి (68 కోట్లు), భాగమతి (64 కోట్లు) ఉన్నాయి. ఈ సినిమాల రికార్డులన్నింటిని ఏడు రోజుల్లోనే కొత్త లోక దాటేసింది. వంద కోట్లు కలెక్ట్ చేయనున్న ఫస్ట్ లేడీ ఓరియెంటెడ్ మూవీగా చరిత్రను సృష్టించడానికి అడుగు దూరంలో ఉంది.
Also Read – ChatGPT : చాట్‌జీపీటీ సేవలు ఆగిపోయాయా!
లాభాల్లోకి…
ఈ మలయాళం మూవీ తెలుగులో భారీగా వసూళ్లను రాబడుతోంది. మంగళవారం రోజు కూడా కోటి వరకు వసూళ్లను దక్కించుకొని సత్తా చాటింది. తెలుగులో ఏడు రోజుల్లో ఆరు కోట్లకుపైనే వసూళ్లను సొంతం చేసుకుంది. మంగళవారం నాటితో తెలుగు వెర్షన్ లాభాల్లోకి అడుగుపెట్టినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఫుల్ థియేట్రికల్ రన్‌లో కొత్త లోక తెలుగు వెర్షన్ పన్నెండు నుంచి పడమూడు కోట్ల వరకు వసూళ్లను దక్కించుకోవచ్చునని చెబుతున్నారు.
ఫ్లాప్‌లకు బ్రేక్…
కొత్త లోక మూవీని తెలుగులో సూర్యదేవర నాగవంశీ రిలీజ్ చేశారు. రెట్రో, కింగ్డమ్, వార్ 2 సినిమాలతో బ్యాక్ టూ బ్యాక్ డిజాస్టర్స్‌ను అందుకున్న నాగవంశీ ఫ్లాప్‌లకు కొత్త లోకతో బ్రేక్ పడింది.
యక్షిణి పాత్రకు…
పురాణాల్లోని యక్షిణి పాత్రకు సూపర్ హీరో ఎలిమెంట్స్ జోడించి డైరెక్టర్ డొమినిక్ అరుణ్ ఈ సినిమాను తెరకెక్కించారు. కళ్యాణి ప్రియదర్శన్ టైటిల్ పాత్రలో నటించిన ఈ సినిమాలో ప్రేమలు ఫేమ్ సస్లేన్ హీరోగా నటించాడు. తనకున్న సూపర్ పవర్స్ దాచిపెట్టి బెంగళూరులోని ఓ కేఫ్‌లో పనిచేస్తుంది చంద్ర. సన్నీ అనే యువకుడితో ప్రేమలో పడుతుంది. సాఫీగా సాగిపోతున్న ఆమె జీవితం ఎస్ఐ నాచియప్ప కారణంగా ఎలాంటి మలుపులు తిరిగింది అనే అంశాలతో ఈ మూవీ రూపొందింది.
Also Read – Potti Sriramulu Smruthivanam : అమరావతిలో పొట్టి శ్రీరాములు స్మృతివనం


