Sunday, November 16, 2025
Homeచిత్ర ప్రభKota: కోట శ్రీనివాస‌రావు జీవితంలో తీర‌ని విషాదం ఇదే.. కొడుకుతో క‌లిసి ఆయ‌న న‌టించిన సినిమాలు...

Kota: కోట శ్రీనివాస‌రావు జీవితంలో తీర‌ని విషాదం ఇదే.. కొడుకుతో క‌లిసి ఆయ‌న న‌టించిన సినిమాలు ఏవంటే?

Kota Srinivas Rao: కోట శ్రీనివాస‌రావు మ‌ర‌ణంతో టాలీవుడ్‌లో విషాదం అలుముకుంది. దిగ్గ‌జ న‌టుడికి సోష‌ల్ మీడియా వేదిక‌గా టాలీవుడ్ సినీ ప్ర‌ముఖులు సంతాపం వ్య‌క్తం చేస్తున్నారు. కోట శ్రీనివాస‌రావుతో త‌మ‌కున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటున్నారు. కోట మ‌ర‌ణం టాలీవుడ్‌కు తీర‌ని లోటు అంటూ క‌న్నీటి ప‌ర్యంత‌మ‌వుతున్నారు.

- Advertisement -

తండ్రి బాట‌లోనే…
కొడుకు మ‌ర‌ణ‌మే కోట శ్రీనివాస‌రావు జీవితంలో అతి పెద్ద విషాదాన్ని మిగిల్చింది. కోట శ్రీనివాస‌రావు బాట‌లోనే ఆయ‌న కొడుకు కోట వెంక‌ట అంజ‌నేయ ప్ర‌సాద్ అడుగులు వేశాడు. జేడీ చ‌క్ర‌వ‌ర్తి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన సిద్ధం మూవీతో అంజ‌నేయ ప్ర‌సాద్ న‌టుడిగా టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చాడు. ఈసినిమాలో నెగెటివ్ షేడ్స్‌తో కూడిన‌ క్యారెక్ట‌ర్‌లో క‌నిపించి మెప్పించాడు. ఆ ఆ త‌ర్వాత గాయం 2 సినిమాలోనూ మెయిన్ విల‌న్‌గా అంజ‌నేయ ప్ర‌సాద్ న‌టించాడు. సిద్ధం, గాయం 2 రెండు సినిమాల్లో తండ్రితో క‌లిసి అంజ‌నేయ ప్ర‌సాద్ న‌టించాడు. అందులో హీరో జగపతి బాబు విలన్ అయిన కోట కొడుకు ఆంజనేయ ప్రసాద్‌ని చంపేస్తాడు. కొడుకు శవాన్ని చూసి విలన్ కన్నీరు మున్నీరవుతాడు. అయితే నిజానికి ఈ సీన్ చిత్రీకరణ చేసే సమయంలో కోట శ్రీనివాసరావు ఇబ్బందిగా ఫీలయ్యాడు.

ఇలాంటి సీన్ లో నటించటానికి కాస్త ఇబ్బందిగా ఉందని హీరో జగపతిబాబుకి చెప్పాడు. కోట వంటి యాక్టర్ పరిస్థితిని అర్థం చేసుకున్న జగపతి బాబు, ఆంజనేయ ప్రసాద్ స్థానంలో డూప్‌ని పెట్టి సీన్ కంప్లీట్ చేసేద్దామని చెప్పాడు. కానీ రీల్ సీనే రియల్‌గా కోట జీవితంలో జరగటం బాధాకరం.

Also Read – Zero Crime Village: ఆ ఊర్లో ఇంతవరకు ఒక్క పోలీసు కూడా అడుగు పెట్టలేదు… కారణం ఇదే!

యాక్సిడెంట్‌లో…
గాయం 2 సినిమానే న‌టుడిగా అంజ‌నేయ ప్ర‌సాద్ చివ‌రి మూవీ. న‌టుడిగా బిజీ అవుతోన్న టైమ్‌లోనే 2010లో హైద‌రాబాద్‌లో జ‌రిగిన రోడ్డు ప్ర‌మాదంలో అంజ‌నేయ ప్ర‌సాద్ క‌న్నుమూశాడు. కొడుకు మ‌ర‌ణం కోట శ్రీనివాస‌రావును చాలా కృంగ‌దీసింది. కోట శ్రీనివాస‌రావు త‌మ్ముడు కోట శంక‌ర్రావు కూడా న‌టుడే. కానీ అన్న‌య్య స్థాయిలో పేరుప్ర‌ఖ్యాతులు ద‌క్కించుకోలేక‌పోయాడు.

రాజ‌కీయాల్లో కోట‌…
కోట శ్రీనివాస‌రావు సినీ ప‌రిశ్ర‌మ‌లోనే కాకుండా రాజ‌కీయాల్లో త‌న‌దైన ముద్ర వేశారు. బీజేపీపై అభిమానంతో ఆ పార్టీలో చేరిన కోట చివ‌రి వ‌ర‌కు అందులోనే కొన‌సాగారు. 1999లో విజ‌య‌వాడ తూర్పు నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేసిన కోట శ్రీనివాస‌రావు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ త‌ర్వాత ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల‌కు దూర‌మ‌య్యారు.

Also Read – ASSAM MAN MILK BATH AFTER DIVORCE : విడాకులు తీసుకున్న సంతోషంలో ఏకంగా 40 లీటర్ల పాలతో స్నానం!

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad