Kota Srinivasa Rao: టాలీవుడ్ విలక్షణ నటుడు కోట శ్రీనివాసరావు ఆదివారం కన్నుమూశారు. సుదీర్ఘ నట ప్రయాణంలో ఏడు వందలకుపైగా సినిమాలు చేశారు కోట శ్రీనివాసరావు. విలన్‌గానే కాకుండా కమెడియన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా…ఇలా వెండితెరపై కోట శ్రీనివాసరావు చేయని పాత్ర లేదు. క్యారెక్టర్ ఏదైనా దానికి తగ్గట్లుగా యాస, భాషలతో పాటు హావభావాల్ని ప్రదర్శిస్తూ అందులో ఒదిగిపోవడం కోట ప్రత్యేకత. తెలుగుతో పాటు తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో నటించి మెప్పించారు కోట.
ప్రతిఘటనతో…
విజయశాంతి హీరోయిన్‌గా నటించిన ప్రతిఘటన మూవీతో నటుడిగా కోట శ్రీనివాసరావు ఫేమస్ అయ్యాడు. అవినీతిపరుడైన మినిస్టర్ పాత్రలో తెలంగాణ యాసలో డైలాగ్స్ చెబుతూ విలనిజానికి కొత్త నిర్వచనం ఇచ్చాడు. ఈ సినిమాతో నటుడిగా కోట వెనక్కి తిరిగి చూసుకోలేదు.
Also Read – From Space to Isolation : కాలిఫోర్నియా తీరంలో ల్యాండింగ్.. భారత వ్యోమగామి శుభాంశుకు తప్పని క్వారంటైన్!
ప్రాణం ఖరీదు…
కోట శ్రీనివాసరావు డెబ్యూ మూవీ ప్రతిఘటన కాదు. 1978లో వచ్చిన ప్రాణం ఖరీదు సినిమాతో నటుడిగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు కోట శ్రీనివాసరావు. ఈ సినిమాలో ఓ చిన్న పాత్రలో కనిపించాడు. మెగాస్టార్ చిరంజీవి కూడా ప్రాణం ఖరీదు సినిమాతోనే తెలుగు ప్రేక్షకులకు పరిచయం కావడం గమనార్హం. పునాది రాళ్లు నటుడిగా చిరంజీవి అంగీకరించిన ఫస్ట్ మూవీ…కానీ థియేటర్లలో మాత్రం ప్రాణం ఖరీదు ముందుగా రిలీజైంది.
సీరియస్ విలన్…
చిరంజీవి, కోట శ్రీనివాసరావు…ఇద్దరు దిగ్గజ నటులను టాలీవుడ్‌కు అందించిన మూవీగా ప్రాణం ఖరీదు నిలిచింది. ఆ తర్వాత కాలంలో చిరంజీవి హీరోగా నటించిన ఎన్నో సినిమాల్లో కోట విలన్‌గా కనిపించాడు.
సీరియస్ విలన్ పాత్రలతో ఆడియెన్స్‌ను భయపెట్టిన కోట శ్రీనివాసరావు కామెడీ విలన్‌గా అంతకుమించి నవ్వించాడు. మనీ, ఏవండీ ఆవిడొచ్చింది, చినరాయుడు ఇలా ఎన్నో సినిమాలు అందుకు ఉదాహరణగా నిలిచాయి.
Also Read – Regina Cassandra Hot Pics: సెగలు రేపుతున్న రెజీనా లేటెస్ట్ హాట్ ఫోటోలు
హిందీలో..
రామ్‌గోపాల్ వర్మ సినిమాల్లో ఎక్కువగా వెరైటీ క్యారెక్టర్స్ చేశాడు కోట శ్రీనివాసరావు. గాయంలో గురునారాయణ అనే సీరియస్ విలన్‌గా కనిపించాడు. మనీ, మనీ మనీలో కామెడీ విలన్‌గా డిఫరెంట్ స్లాంగ్, కామెడీ టైమింగ్‌తో అదరగొట్టాడు. శివ, అనగనగా ఒకరోజు, గోవిందా గోవిందా ఇలా… కెరీర్ ఆరంభంలో రామ్‌గోపాల్ వర్మ చేసిన అన్ని సినిమాల్లో కోట నటించారు. రామ్‌గోపాల్ వర్మ సర్కార్ మూవీతో బాలీవుడ్‌లోనూ కోట శ్రీనివాసరావు మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.


