Saturday, November 15, 2025
Homeచిత్ర ప్రభBig Breaking: కోట కుటుంబంలో మరో విషాదం..కోట శ్రీనివాసరావు భార్య కన్నుమూత!

Big Breaking: కోట కుటుంబంలో మరో విషాదం..కోట శ్రీనివాసరావు భార్య కన్నుమూత!

Kota Srinivasa Rao:తెలుగు సినీ ప్రపంచానికి గాఢమైన ముద్ర వేసిన నటుడు కోట శ్రీనివాసరావు ఇటీవలే మరణించగా, ఇప్పుడు ఆయన సతీమణి రుక్మిణి కూడా కన్నుమూయడంతో కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. అనారోగ్యంతో కొంతకాలంగా బాధపడుతున్న రుక్మిణి శనివారం హైదరాబాద్‌లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఈ వార్త తెలిసిన వెంటనే సినీ పరిశ్రమతో పాటు కోట గారి అభిమానులు కూడా షాక్‌కు గురయ్యారు.

- Advertisement -

కుటుంబం మానసికంగా..

రుక్మిణి ఆరోగ్యం కొంతకాలంగా బాలేదని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. వైద్యులు చికిత్స అందించినప్పటికీ ఆమె పరిస్థితి క్రమంగా విషమించిందని, చివరకు ఇంటి వద్దే ప్రాణాలు విడిచారని తెలిసింది. కోట గారు ఇక లేరు అనే బాధలో ఉండగా, ఇప్పుడు భార్యను కోల్పోవడంతో వారి కుటుంబం మానసికంగా కుంగిపోయింది.

తెలుగు సినీ లోకానికి పెద్ద లోటు..

తెలుగు సినిమా రంగంలో కోట శ్రీనివాసరావు ఒక శక్తివంతమైన నటుడిగా గుర్తింపు పొందారు. విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, కామెడీ రోల్స్‌లో ఆయన చూపిన ప్రతిభ అనన్యసామాన్యం. ఆయన మరణం తెలుగు సినీ లోకానికి పెద్ద లోటు కాగా, నెలల వ్యవధిలోనే ఆయన సతీమణి రుక్మిణి కూడా దూరమవడం మరింత విచారకరం.

కోట గారి కుటుంబం ప్రస్తుతం శోకసంద్రంలో మునిగిపోయింది. కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు రుక్మిణి అంతిమయాత్ర ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. హైదరాబాద్‌లోనే అంత్యక్రియలు నిర్వహించే అవకాశం ఉందని సమాచారం. సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు, సన్నిహితులు కోట కుటుంబాన్ని పరామర్శించేందుకు వస్తున్నారు.

Also Read: https://teluguprabha.net/cinema-news/rahul-sipligunj-engaged-to-harinya-reddy-in-hyderabad/

రుక్మిణి గారి మరణంతో తెలుగు సినీ వర్గాల్లో దిగ్భ్రాంతి వ్యక్తమవుతోంది. ఇప్పటికే కోట గారు మృతిచెందిన వార్త అభిమానులను కలచివేసింది. ఇప్పుడు రుక్మిణి కన్నుమూయడం ఆ బాధను మరింత పెంచింది. కోట గారిని, ఆయన కుటుంబాన్ని దగ్గరగా తెలిసిన పలువురు ఈ విషాదాన్ని భరించలేకపోతున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad