Kotha Lokah: Chapter 1 Collections: లార్జర్ దేన్ లైఫ్ క్యారెక్టర్స్ ఉన్న సినిమాలను ఇప్పుడు ఆడియెన్స్ బాగా ఆదరిస్తున్నారు. దీంతో సూపర్ హీరో కాన్సెప్ట్స్ కూడా ప్రేక్షకులకు బాగానే కనెక్ట్ అవుతోంది. ఈ కోవలోనే రీసెంట్‌గా సూపర్ ఉమెన్ కాన్సెప్ట్‌తో విడుదలైన మాలీవుడ్ మూవీ ‘కొత్త లోక చాప్టర్ 1’ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. కళ్యాణి ప్రియదర్శిని (Kalyani Priyadarshni) ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాకు సూపర్బ్ రెస్పాన్స్ వస్తోంది. బాక్సాఫీస్ దగ్గర సినిమా కలెక్షన్స్ రూపంలో దుమ్ము రేపుతోంది. ప్రేమలు ఫేమ్ నస్లెన్ (Naslen) ఇందులో మరో ప్రధాన పాత్రలో కనిపించిన సంగతి తెలిసిందే. ఆగస్ట్ 29న విడుదలైన ఈ సినిమా కలెక్షన్స్ పరంగా రికార్డులను క్రియేట్ చేస్తోంది. తెలుగు విషయానికి వస్తే సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్య దేవర నాగవంశీ ఈ సినిమాను ఏపీ, తెలంగాణల్లో విడుదల చేశారు.
తెలుగులో సాంకేతిక కారణాలతో ఓ రోజు ఆలస్యంగా విడుదలైన ‘కొత్త లోక చాప్టర్ 1’ అభిమానులను ఆకట్టుకోవటంలో మాత్రం వెనుకంజ వేయలేదు. పాన్ ఇండియా లెవల్లో ఈ సినిమా ఇప్పటికే రూ.159 కోట్ల రూపాయల వసూళ్లను సాధించి.. లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లో నెంబర్ వన్ స్థానంలో నిలిచింది. అంతే కాకుండా ఈ కేటగిరీలో వంద కోట్లు సాధించిన సినిమాగానూ ఓ రికార్డును సొంతం చేసుకోవటం విశేషం. ఇప్పుడు ఇది రెండు వందల కోట్ల మార్కును దాటేస్తుందని ట్రేడ్ వర్గాలంటున్నాయి.
Also Read – BCCI: ప్రపంచంలోనే సంపన్న బోర్డు.. అకౌంట్లో రూ.20 వేల కోట్లు..!
తెలుగు రాష్ట్రాల్లో సినిమా 10 రోజులకుగానూ రూ.5.25 కోట్ల షేర్ వసూళ్లను సాధించింది. గ్రాస్ కలెక్షన్స్ ప్రకారం చూస్తే రూ.10.15 కోట్లు అయ్యాయి. రూ.3.50 కోట్లు బ్రేక్ ఈవెన్ రావాల్సి ఉండగా ఇప్పటికే తెలుగులో రూ.1.75 కోట్లు లాభాన్ని నిర్మాతలకు సంపాదించి పెట్టింది.
వరల్డ్ వైడ్ గ్రాస్ కలెక్షన్స్ చూస్తే..
తెలుగు రాష్ట్రాల్లో – రూ. 10.15 కోట్లు
కేరళ – రూ. 51.55 కోట్లు
తమిళనాడు – రూ. 10.65 కోట్లు
కర్ణాటక – రూ. 7.95 కోట్లు
రెస్టాఫ్ ఇండియా – రూ. 4.05 కోట్లు
ఓవర్సీస్ – రూ. 74.65 కోట్లు వసూళ్లు వచ్చాయి.. మొత్తంగా చూస్తే రూ.159 కోట్లు అయ్యాయి. రూ.71.05 కోట్లు షేర్ కలెక్షన్స్ అని ట్రేడ్ వర్గాలంటున్నాయి. రూ.20 కోట్లు షేర్ వసూళ్లతో విడుదలైన ఈ మూవీ ఇప్పటికే రూ.50 కోట్లు లాభాలను నిర్మాతలకు తెచ్చి పెట్టింది. మలయాళ సూపర్‌స్టార్ దుల్కర్ సల్మాన్ (Dulquer Salman) దీనికి నిర్మాతగా వ్యవహరించారు.
Also Read – Vitamin D: విటమిన్ డి లోపంతో గుండెపోటు..? ఈ జాగ్రతలు తీసుకోండి..


