Saturday, November 15, 2025
Homeచిత్ర ప్రభKotha Lokah Chapter 1: ‘కొత్త లోక చాప్ట‌ర్ 1’ సెన్సేషన్.. 13 రోజుల్లోనే మరో...

Kotha Lokah Chapter 1: ‘కొత్త లోక చాప్ట‌ర్ 1’ సెన్సేషన్.. 13 రోజుల్లోనే మరో అరుదైన రికార్డ్ సొంతం!

Kotha Lokah Chapter 1: మారుతోన్న ప్రేక్షకులు అభిరుచికి అనుగుణంగా రూపొందిన లేటెస్ట్ మూవీ ‘కొత్త లోక’ బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. సూపర్ హీరో కాన్సెప్ట్స్ కూడా ఆడియెన్స్‌తో బాగా కనెక్ట్ అవుతున్నాయి. ఇలాంటి అంశాలను పరిగణలోకి తీసుకుంటే, ఇటీవల విడుదలైన మలయాళ చిత్రం ‘కొత్త లోక చాప్టర్ 1’ బ్లాక్‌బస్టర్ హిట్‌గా మారింది. ఈ చిత్రంలో క‌ళ్యాణి ప్రియ‌ద‌ర్శిని ప్రధాన పాత్రలో నటించారు. ఆమె పెర్ఫామెన్స్‌కు అద్భుతమైన ప్రశంసలు లభిస్తున్నాయి. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా అద్భుతమైన కలెక్షన్లు సాధించి దుమ్ము రేపుతోంది. ఇటీవల విడుదలైన ఈ సినిమాలో ‘ప్రేమలు’ ఫేమ్ నస్లెన్ కూడా మరో ప్రధాన పాత్రలో నటించారు. ఆగస్ట్ 29న విడుదలైన ఈ సినిమా, కలెక్షన్లతో రికార్డులు సృష్టిస్తోంది. లేటెస్ట్‌గా మూవీ రూ. 200 కోట్ల క్లబ్‌లో చేరటం విశేషం. మూవీ తెలుగు ప్రేక్షకులకు కూడా తెగ ఆకట్టుకుంటోంది, ఎందుకంటే సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్య దేవర నాగవంశీ ఈ సినిమాను ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో విడుదల చేశారు.

- Advertisement -

Also Read- Kanthara Chapter 1: ఆరోజు నుంచే రాజాసాబ్ కూడా..

తెలుగులో సాంకేతిక కార‌ణాల‌తో ఓ రోజు ఆల‌స్యంగా విడుద‌లైన ‘కొత్త లోక చాప్ట‌ర్ 1’ అభిమానుల‌ను ఆక‌ట్టుకోవ‌టంలో మాత్రం వెనుకంజ వేయ‌లేదు. పాన్ ఇండియా లెవ‌ల్లో ఈ సినిమా 13 రోజులకుగానూ రూ. 200 కోట్ల రూపాయ‌ల వ‌సూళ్ల‌ను సాధించి.. లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లో మైల్ స్టోన్ మూవీగా నిలిచింది. అంతే కాకుండా ఈ కేట‌గిరీలో తొలి రెండు వందల కోట్లు సాధించిన సినిమాగానూ సెన్సేషనల్ రికార్డును సొంతం చేసుకోవ‌టం విశేషం.

తెలుగు రాష్ట్రాల్లో సినిమా 13 రోజుల‌కుగానూ రూ.6.45 కోట్ల షేర్ వ‌సూళ్ల‌ను సాధించింది. గ్రాస్ క‌లెక్ష‌న్స్ ప్ర‌కారం చూస్తే రూ.12.45 కోట్లు అయ్యాయి. రూ.3.50 కోట్లు బ్రేక్ ఈవెన్ రావాల్సి ఉండ‌గా ఇప్ప‌టికే తెలుగులో రూ. 2.95 కోట్లు లాభాన్ని నిర్మాత‌ల‌కు సంపాదించి పెట్టింది.

వ‌ర‌ల్డ్ వైడ్ గ్రాస్‌ క‌లెక్ష‌న్స్ చూస్తే..
తెలుగు రాష్ట్రాల్లో – రూ. 12.45కోట్లు
కేర‌ళ – రూ. 65.90 కోట్లు
త‌మిళ‌నాడు – రూ. 12.40 కోట్లు
కర్ణాట‌క – రూ. 9.35 కోట్లు
రెస్టాఫ్ ఇండియా – రూ. 7.25 కోట్లు
ఓవ‌ర్సీస్ – రూ. 93.95 కోట్లు వ‌సూళ్లు వ‌చ్చాయి.. మొత్తంగా చూస్తే రూ. 200 కోట్లు క్రాస్ అయ్యింది. ఇందులో రూ. 88 కోట్లకు పైగానే షేర్ క‌లెక్ష‌న్స్ అని ట్రేడ్ వ‌ర్గాలంటున్నాయి. రూ. 20 కోట్లు షేర్ వ‌సూళ్ల‌ టార్గెట్‌తో విడుద‌లైన ఈ మూవీ ఇప్ప‌టికే రూ.68 కోట్లు లాభాల‌ను నిర్మాత‌ల‌కు తెచ్చి పెట్టింది. మ‌ల‌యాళ సూప‌ర్‌స్టార్ దుల్క‌ర్ స‌ల్మాన్ (Dulquer Salman) దీనికి నిర్మాత‌గా వ్య‌వ‌హరించారు.

Also Read- Anushka Ghaati: కోట్ల నుంచి ల‌క్ష‌ల‌కు.. ఘాటి క‌లెక్ష‌న్స్ భారీగా డ్రాప్.. బిగ్గెస్ట్ డిజాస్ట‌ర్ దిశ‌గా అనుష్క మూవీ

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad