Saturday, November 15, 2025
HomeTop StoriesKriti Sanon: లింగ సమానత్వ గౌరవ రాయబారిగా కృతి..తొలి భారతీయ నటిగా రికార్డు!

Kriti Sanon: లింగ సమానత్వ గౌరవ రాయబారిగా కృతి..తొలి భారతీయ నటిగా రికార్డు!

Kriti Sanon-World Health Summit 2025:జర్మనీ రాజధాని బెర్లిన్‌లో జరిగిన ప్రపంచ ఆరోగ్య సమ్మిట్ 2025లో భారతీయ సినీ నటి కృతి సనన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ గ్లోబల్ వేదికపై ప్రసంగించిన తొలి భారతీయ నటిగా ఆమె కొత్త చరిత్ర సృష్టించారు. ప్రపంచ వ్యాప్తంగా 100కిపైగా దేశాల ప్రతినిధులు, వైద్య నిపుణులు, శాస్త్రవేత్తలు పాల్గొన్న ఈ సమ్మిట్‌లో కృతి తన ప్రసంగంతో అందరి దృష్టిని తన వైపునకు తిప్పుకున్నారు.

- Advertisement -

మహిళల ఆరోగ్యం, లింగ సమానత్వం..

కృతి సనన్ తన ప్రసంగంలో ప్రధానంగా మహిళల ఆరోగ్యం, లింగ సమానత్వం వంటి అంశాలపై దృష్టి సారించారు. ప్రపంచ జనాభాలో సగం మంది మహిళలే ఉన్నప్పటికీ, వారి ఆరోగ్యానికి అవసరమైన నిధులు, వైద్య సదుపాయాలు సరిపడా అందడం లేదని ఆమె పేర్కొన్నారు. మహిళల ఆరోగ్యానికి పెట్టుబడులు పెరగకపోతే భవిష్యత్తులో సమాజ అభివృద్ధి మందగిస్తుందని ఆమె వివరించారు.

మహిళలే సమాజానికి, కుటుంబానికి..

ఇంకా ఆమె మాట్లాడుతూ మహిళల ఆరోగ్యాన్ని చిన్న విషయంగా తీసుకోవడం తప్పని స్పష్టం చేశారు. ఆరోగ్యవంతమైన మహిళలే సమాజానికి, కుటుంబానికి బలమైన ఆధారం అవుతారని ఆమె ఈ సందర్భంగా అన్నారు. మహిళలు ఎదుర్కొనే ఆరోగ్య సమస్యలు కేవలం వ్యక్తిగతం కావు, అది దేశ అభివృద్ధికి సంబంధిత అంశమని కృతి వివరించారు.

Also Read: https://teluguprabha.net/cinema-news/daggubati-family-summoned-by-court-in-filmnagar-deccan-kitchen-case/

మహిళల ఆరోగ్యంపై..

కృతి సనన్ మాట్లాడుతూ, “ఇప్పటికే ప్రపంచం అభివృద్ధి దిశగా ముందుకు సాగుతున్నా, మహిళల ఆరోగ్యంపై పెట్టుబడులు మాత్రం చాలా తక్కువగా ఉన్నాయి. మనం సాంకేతికతలో ఎంత ఎదిగినా, మహిళలకు ప్రాథమిక ఆరోగ్య సేవలు అందకపోతే నిజమైన పురోగతి సాధ్యంకాదు” అని పేర్కొన్నారు.

లింగ సమానత్వ గౌరవ రాయబారి..

అలాగే లింగ సమానత్వం కోసం కూడా కృతి ప్రాముఖ్యతను వివరించారు. మహిళలు సమాన హక్కులు, అవకాశాలు పొందినప్పుడు మాత్రమే సమాజం సమతుల్యంగా ఎదుగుతుందని చెప్పారు. ఈ సందర్భంలో ఆమె ఐక్యరాజ్యసమితి జనాభా నిధి (UNFPA)తో తన అనుబంధాన్ని గుర్తు చేశారు. సెప్టెంబర్‌లో కృతిని యుఎన్‌ఎఫ్‌పిఎ ఇండియా “లింగ సమానత్వ గౌరవ రాయబారి”గా నియమించిన సంగతి తెలిసిందే. ఆ బాధ్యతలో భాగంగా మహిళల ఆరోగ్యాన్ని ప్రోత్సహించే కార్యక్రమాల్లో పాల్గొనడం తన కర్తవ్యంగా భావిస్తున్నట్టు ఆమె తెలిపింది.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఇతర అంతర్జాతీయ వక్తలు కూడా మహిళల ఆరోగ్యంపై పెట్టుబడులు పెంచాల్సిన అవసరాన్ని ఉటంకించారు. అయితే కృతి సనన్‌ ప్రసంగం భారతీయ ప్రతినిధులలో ప్రత్యేకంగా ప్రశంసలు అందుకుంది. ఆమె వ్యాఖ్యలు గ్లోబల్ మీడియా దృష్టిని ఆకర్షించాయి.

సోషల్ మీడియాలో కూడా..

సినీ రంగం నుంచి అంతర్జాతీయ వేదికపై మహిళా సాధికారత గురించి బలమైన సందేశం ఇచ్చిన కృతి ప్రసంగం సోషల్ మీడియాలో కూడా చర్చనీయాంశమైంది. అనేక మంది భారతీయులు ఆమెపై గర్వం వ్యక్తం చేశారు.

ప్రస్తుతం కృతి సనన్‌ తన సినిమా ప్రాజెక్టులతో బిజీగా ఉంది. కోలీవుడ్ హీరో ధనుష్ సరసన నటించిన ప్రేమకథా చిత్రం ‘తేరే ఇష్క్ మే’ నవంబర్ 28న విడుదల కానుంది. ఈ సినిమాలో ఆమె కొత్తగా రూపుదిద్దుకున్న పాత్రలో కనిపించనుంది. అదనంగా, షాహిద్ కపూర్‌తో కలిసి నటిస్తున్న ‘కాక్‌టెయిల్ 2’ సినిమా వచ్చే సంవత్సరం ప్రేక్షకుల ముందుకు రానుంది.

Also Read: https://teluguprabha.net/business/nestle-to-cut-16000-jobs-globally-over-next-two-years/

వరల్డ్ హెల్త్ సమ్మిట్ 2025లో కృతిసనన్‌ పాల్గొనడం ద్వారా భారతీయ సినీ ప్రముఖులు ప్రపంచ స్థాయిలో సామాజిక బాధ్యతను ముందుకు తీసుకువెళ్తున్నారని మరోసారి రుజువైంది. ఆమె ప్రసంగం మహిళల ఆరోగ్యంపై ఉన్న నిర్లక్ష్యాన్ని గుర్తు చేస్తూ, భవిష్యత్తు తరాల కోసం పెద్ద పిలుపుగా నిలిచింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad