Tuesday, July 2, 2024
Homeచిత్ర ప్రభKrrish 4: హృతిక్ రోషన్ ఫ్యాన్స్ కు బిగ్ బ్రేకింగ్, త్వరలో క్రిష్ 4

Krrish 4: హృతిక్ రోషన్ ఫ్యాన్స్ కు బిగ్ బ్రేకింగ్, త్వరలో క్రిష్ 4

గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ సూపర్ హీరో మూవీ సిరీస్ క్రిష్ లో నెక్ట్స్ సిరీస్ త్వరలో తెరకెక్కనుంది. క్రిష్ అనే సినిమాల సీక్వెల్స్ అన్నీ హీరో హృతిక్ కు చాలా పాపులారిటీ, సక్సెస్ తెచ్చాయి. దీంతో ఆయన ఇండియన్ సూపర్ హీరో కూడా అయిపోయారు. ఈ సిరీస్ ను కంటిన్యూ చేసే వ్యూహంలో భాగంగా రాకేష్ రోషన్ బిగ్ అనౌన్స్ మెంట్ చేసి అందరినీ సర్ప్రైజ్ చేశారు.

- Advertisement -

కోయి మిల్ గయా పేరుతో 2003లో ప్రారంభమైన క్రిష్ సిరీస్, క్రిష్, క్రిష్ 3 అంటూ హిట్స్ కొట్టాయి. చాలా కాలంగా క్రిష్-4 చేస్తామన్న ప్రకటనలు అలా కోల్డ్ స్టోరేజ్ లో ఉండిపోయాయి. గతంలో మూడు క్రిష్ సినిమాలు తీసిన హృతిక్ ఫాదర్ రాకేష్ రోషన్ తాజాగా క్రిష్-4 త్వరలో షూటింగ్ స్టార్ట్ అవుతుందని చెప్పారు.

వార్, పఠాన్ సినిమాల డైరెక్టర్ అయిన సిద్ధార్థ్ ఆనంద్ తో కలిసి ప్రస్తుతం ఫైటర్ అనే సినిమాతో హృతిక్ బిజీగా ఉన్నారు. దీపికా పదుకున్ హీరోయిన్ గా వస్తున్న ఫైటర్ సినిమా ఓ ఏరియల్ యాక్షనర్ గా సరికొత్తగా ఉండబోతోంది. ఈ సినిమా వచ్చే ఏడాది జనవరిలో రిలీజ్ కానుంది. ఈలోగా క్రిష్-4 షూటింగ్ పట్టాలు ఎక్కనుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News