Kushboo: 96 ఫేమ్ గౌరీ కిషన్ బాడీ షేమింగ్ వివాదం కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఇటీవల అదర్స్ సినిమా ప్రమోషన్స్‌లో ఓ మీడియా ప్రతినిధి అడిగిన అభ్యంతరకర ప్రశ్నపై గౌరీ కిషన్ ధీటుగానే బదులిచ్చింది. గౌరీ కిషన్ స్పందించిన తీరుకు అభిమానులే కాకుండా సెలిబ్రిటీలు సైతం ఆమెకు సపోర్ట్‌గా నిలుస్తున్నారు. గౌరీ కిషన్ చేదు అనుభవంపై సీనియర్ హీరోయిన్ ఖుష్బూ ఫైర్ అయ్యింది.
జర్నలిజం తన విలువను కోల్పోయిందంటూ కుష్బూ సుందర్ ట్వీట్ చేశారు. ఈ సోకాల్డ్ జర్నలిస్ట్‌లు జర్నలిజాన్ని అధఃపాతాళానికి తీసుకుపోతున్నారంటూ విరుచుకుపడింది. “ఒక మహిళ ఎంత బరువు ఉందనేది వారి పని కాదు. దీని గురించి హీరోను అడగటం ఎంతో సిగ్గుచేటుగా అనిపిస్తోంది. ఇలాంటి ఇబ్బందికర ప్రశ్నకు గట్టిగా నిలబడి ధీటుగా సమాధానం చెప్పింది గౌరీ కిషన్. మీరు గౌరవం ఆశిస్తే ముందు గౌరవం ఇవ్వడం నేర్చుకొండి” అంటూ తన ట్వీట్‌లో ఖుష్బూ పేర్కొన్నది. రెస్పెక్ట్ ఆల్ ఉమెన్.. షేమ్‌ఫుల్ జర్నలిజం అంటూ హ్యాష్‌ట్యాగ్స్ జోడించింది. ఖుష్బూ ట్వీట్ వైరల్ అవుతోంది.
Also Read – SSMB29: రాజమౌళి నెక్ట్స్ లెవల్ ప్లాన్, మహేష్ ఫస్ట్ లుక్ కోసం భారీ స్టేజ్ రెడీ!
గౌరీకిషన్ హీరోయిన్‌గా నటించిన తమిళ మూవీ అదర్స్ ప్రెస్‌మీట్ ఇటీవల చెన్నైలో జరిగింది. ఈ ఈవెంట్‌లో మీ బరువు ఎంత అని గౌరీకిషన్‌ను ఓ మీడియా ప్రతినిధి ప్రశ్న అడిగాడు. అతడి ప్రశ్నకు సమాధానం చెప్పడానికి గౌరీకిషన్ నిరాకరించింది. దాంతో సదరు మీడియా ప్రతినిధి.. గతంలో కొందరు స్టార్ హీరోయిన్లు కూడా ఇలాంటి ప్రశ్నకు సమాధానం చెప్పారంటూ అన్నాడు.
దాంతో ఆ మీడియా ప్రతినిధిపై సీరియస్ అయ్యింది గౌరీకిషన్. “నా బరువు తెలుసుకొని ఏం చేస్తారు. నా బరువు వల్ల ఈ సినిమాకు ఏమైనా నష్టం ఉందా. నా టాలెంట్ గురించి.. నేను ఇప్పటివరకు చేసిన సినిమాలు, క్యారెక్టర్ల గురించి అడగండి. అవే నేనంటే ఏమిటో చెబుతాయి. సినిమాలో నా పాత్ర గురించి కాకుండా నా బరువు గురించి తెలుసుకోవాలని అనుకోవడం తెలివితక్కువగా అనిపిస్తోంది. ఇదే ప్రశ్నను హీరోలను అడుగుతారా?” అంటూ గౌరీకిషన్ ఫైర్ అయ్యింది. మరోవైపు బాడీ షేమింగ్ గురించి ఆ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నలకు మూవీ టీమ్ మౌనంగా ఉండటంపై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు.
విజయ్ సేతుపతి, త్రిష హీరోహీరోయిన్లుగా నటించిన 96 మూవీతో ఫేమస్ అయ్యింది గౌరీ కిషన్. ఈ మూవీలో చిన్ననాటి త్రిష పాత్రలో కనిపించింది. 96కు రీమేక్‌గా తెరకెక్కిన జానులో సేమ్ రోల్ చేసింది. చిరంజీవి కూతురు సుస్మిత కొణిదెల నిర్మించిన శ్రీదేవి శోభన్‌బాబు మూవీలో హీరోయిన్‌గా నటించింది. తెలుగులోనే కాకుండా తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో సినిమాలు చేసింది.


