Saturday, November 15, 2025
Homeచిత్ర ప్రభSparsh Shrivastava: టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోన్న మరో బాలీవుడ్ యాక్టర్.. చైతన్యతో పోటీ

Sparsh Shrivastava: టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోన్న మరో బాలీవుడ్ యాక్టర్.. చైతన్యతో పోటీ

Sparsh Shrivastava Telugu Movie: బాలీవుడ్ స్టార్స్ చాలా మంది తెలుగులోకి ఎంట్రీ ఇస్తున్నారు. ఇమ్రాన్ హష్మి, తర్వాత దివ్యేందు శర్మ ఇలా లిస్టు పెరుగుతోంది. తాజాగా ఈ లిస్టులోకి మరో బాలీవుడ్ వెర్సటైల్ యాక్టర్ కూడా చేరుతున్నాడు. వివరాల్లోకెళ్తే.. చందు మొండేటి దర్శకత్వంలో వచ్చిన సూపర్ హిట్ సినిమా తండేల్ తో పాన్ ఇండియా స్టార్ గా మారాడు అక్కినేని నాగ చైతన్య. ఈ సినిమా ఇచ్చిన సాలీడ్ హిట్ తో వరుస సినిమాలను లైన్లో పెడుతున్నాడు. ప్రస్తుతం నాగ చైతన్య హీరోగా నటిస్తున్న చిత్రాల్లో ఆయన 24వ చిత్రం ఒకటి. కార్తీక్ దండు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను బివిఎస్ఎన్ ప్రసాద్, దర్శకుడు సుకుమార్ కలిసి భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇందులో నాగ చైతన్య కి జంటగా మీనాక్షీ చౌదరి నటిస్తోంది.

- Advertisement -

ఇప్పటి వరకు నాగ చైతన్య లవ్ స్టోరీస్ లోనే ఎక్కువగా నటించాడు. మొదటిసారి చైతూ మైథలాజికల్ థ్రిల్లర్ మూవీలో నటిస్తున్నారు. ఇక పోస్టర్ తోనే ఈ సినిమాపై అభిమానులు భారీగా అంచనాలను పెట్టుకున్నారు. విరూపాక్ష చిత్రంతో దర్శకుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెలుగు సినిమా ఇండస్ట్రీలో సంపాదించుకున్నాడు కార్తీక్ దండు. ఈ మూవీ తరువాత దానికి మించి భారీ ప్లాన్ చేస్తున్నాడు. ఇక ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది.

Also Read – Prabhas: ప్ర‌భాస్ ఫ్యాన్స్‌కు బ్యాడ్‌న్యూస్.. రాజాసాబ్ పోస్ట్‌పోన్.. కొత్త రిలీజ్ డేట్‌పై ప్రొడ్యూస‌ర్ క్లారిటీ!

ఈ సినిమాలోకి బాలీవుడ్ నటుడిని ఎంచుకున్నాడు కార్తీక్ దండు. హిందీలో సూపర్ హిట్ గా నిలిచిన లపతా లేడీస్ సినిమా విమర్శకుల నుంచి మంచి ప్రశంసలు అందుకొని ఆస్కార్ నామినేషన్స్ లో నిలిచింది. దీంతో ప్రపంచం మొత్తం ఒక్కసారిగా లపతా లేడీస్ వైపు దృష్టి పెట్టింది. బాలీవుడ్ స్టార్ ఆమీర్ ఖాన్ మాజీ భార్య కిరణ్ రావు దర్శకత్వం వహించిన ఈ మూవీలో హీరోగా నటించి ఆకట్టుకున్న స్పర్ష్ శ్రీవాస్తవని చైతూ మూవీ ద్వారా టాలీవుడ్ కు పరిచయం చేస్తున్నాడు.

స్పర్ష్.. చైతు సినిమాలో ఒక కీలక పాత్ర పోషిస్తున్నట్టుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఆగస్టు 28న స్పర్ష్ శ్రీవాస్తవ పుట్టినరోజు. ఈ సందర్భంగా స్పర్ష్ ని ఈ క్రేజీ ప్రాజెక్ట్ లోకి అధికారికంగా ఆహ్వానిస్తూ బర్త్ డే విషెస్ తెలిపారు.” ఇప్పటివరకు స్పర్ష్ కనిపించని ఓ కొత్త అవతారంలో కనిపించబోతున్నాడు. ఇక తాజాగా సోషల్ మీడియా ద్వారా ప్రకటించిన పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. ఈ మధ్య బాలీవుడ్ నుంచి చాలామంది స్టార్స్ మన తెలుగు ఇండస్ట్రీకి వచ్చి హిట్ అందుకుంటున్నారు. మరి స్పర్ష్ ఎలాంటి క్రేజ్ ని ఇక్కడ తెచ్చుకుంటాడో చూడాలి.

Also Read – OG: ఓజీ… సువ్వి సువ్వి సాంగ్‌కు 24 గంట‌ల్లో వ‌చ్చిన వ్యూస్ ఎన్నంటే?.. హ‌రిహ‌ర‌ వీర‌మ‌ల్లును బీట్ చేయ‌లేక‌పోయిందిగా!

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad