Lady Oriented Movies: సినిమాలను చూడటంలో ఆడియెన్స్ అభిరుచి మారుతోంది. హీరోల సినిమాలనే కాదు.. హీరోయిన్స్ ప్రధాన పాత్రలో నటించిన సినిమాలకు కూడా ఆదరణ పెరుగుతోంది. తాజాగా రిలీజైన ఉమెన్ ఓరియెంటెడ్ సినిమాలను గమనిస్తే.. హీరోల సినిమాలకు ధీటుగా అవి లాభాల బాటపడుతున్నాయి. ఇంతకీ ఏంటా సినిమాలు.. ఎవరా హీరోయిన్స్ అనే వివరాలపై ఓ లుక్కేద్దాం…
సినిమా పరిశ్రమ ఎప్పుడూ పురుషాధిపత్యంతోనే నడుస్తుందనడంలో సందేహం లేదు. ముఖ్యంగా మన సౌత్ సినీ రంగంలో హీరోయిన్ల ప్రధాన చిత్రాలకు అంతగా ప్రాధాన్యత లభించదు. అగ్రతారలు కూడా ఇలాంటి ప్రయోగాలు చేయాలంటే దర్శకనిర్మాతలు వెనుకాడతారు. సినిమా హిట్టయితే క్రెడిట్ అంతా హీరోలది, ఫ్లాపయితే మాత్రం ‘ఐరన్ లెడీ’, ‘ఐరన్ లెగ్’ అంటూ హీరోయిన్లపై నిందలు వేయడం పరిపాటి. అయితే, ఈ ధోరణిని మార్చేసి, మహిళా ప్రధాన చిత్రాలు కూడా భారీ విజయాలు సాధించగలవని కొందరు నటీమణులు నిరూపిస్తున్నారు. వారి కృషి ఫలితంగా విమెన్ సెంట్రిక్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద అద్భుతాలు సృష్టిస్తున్నాయి.
Also Read- Bigg Boss Telugu 9 : గృహహింస కథతో ఫ్లోరా సైనీ ఎంట్రీ.. బిగ్ బాస్‌లో కన్నీటి జర్నీ!
ఇటీవల కాలంలో మహిళా ప్రాధాన్య చిత్రాలకు ఒక కేరాఫ్ అడ్రెస్ గా నిలిచింది అనుష్క శెట్టి. 2009లో వచ్చిన అరుంధతి ఒక ప్రభంజనం. కోడి రామకృష్ణ దర్శకత్వంలో అనుష్క నటన అగ్రశ్రేణి. ఆ చిత్రం అప్పట్లోనే 70 కోట్లు రాబట్టడం స్టార్ హీరోలకు కూడా దక్కని అసమానమైన విజయం. ఆ తర్వాత ఆమె రుద్రమదేవితో 82 కోట్లు, భాగమతితో 67 కోట్లను వసూలు చేసి, అత్యధిక వసూళ్లు సాధించిన మహిళా ప్రధాన చిత్రాలలో తన ముద్ర వేసింది. ఈ మూడు చిత్రాలు హైయెస్ట్ గ్రాసింగ్ ఫీమేల్ ఓరియెంటెడ్ చిత్రాలుగా నిలిచాయి. అయితే, ‘భాగమతి’ వచ్చిన అదే సంవత్సరంలో, ఈ రికార్డులన్నింటినీ మహానటి చిత్రం చెరిపేసింది.
సావిత్రమ్మ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రంలో కీర్తి సురేష్ నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. మహానటి దాదాపు 85 నుంచి 90 కోట్ల కలెక్షన్లను సాధించి, అప్పటి వరకు సౌత్ లో అత్యధిక వసూళ్లు సాధించిన హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రంగా నిలిచింది. ఇప్పుడు ఈ రికార్డులను కూడా ఓ మలయాళ ముద్దుగుమ్మ, కళ్యాణి ప్రియదర్శన్ బద్దలు కొట్టింది. ఆమె నటించిన ‘లోకా చాప్టర్ 1’ చిత్రం ఏకంగా 100 కోట్లను దాటి బాక్సాఫీస్ వద్ద విజయం సాధించింది. ఇప్పటి వరకు అత్యధిక వసూళ్లు సాధించిన తెలుగు చిత్రాలన్నింటినీ ఈ మలయాళ చిత్రం క్రాస్ చేసేసింది. కళ్యాణి ప్రియదర్శన్ పేరు మీద సరికొత్త రికార్డులు నమోదయ్యాయి.
ఆగస్టు 5న విడుదలైన ‘ఘాటి’ చిత్రం ముందు ఒక పెద్ద సవాలుగా నిలిచింది. విడుదలకు ముందే సినిమా మేకర్స్ కి ప్రాఫిట్స్ ను తెచ్చి పెట్టింది. కళ్యాణి ప్రియదర్శన్ నెలకొల్పిన రికార్డులనే కాదు, అనుష్క శెట్టి తన పేరు మీద ఉన్న పాత రికార్డులను కూడా “ఘాటి” చెరిపేస్తుందని ఫ్యాన్స్ భావించారు. అయితే సినిమా థియేటర్స్ లో బోల్తా కొట్టింది. కానీ మహిళా ప్రాధాన్య చిత్రాలు ఇకపై కేవలం ప్రయోగాత్మక చిత్రాలుగా కాకుండా, బాక్సాఫీస్ వద్ద విజేతలుగా నిలుస్తాయని ఉమెన్ ఓరియెంటెడ్ సినిమాలు రుజువు చేస్తున్నాయి.


