Sunday, July 7, 2024
Homeచిత్ర ప్రభLady superstar: యాక్టింగ్ కు గుడ్ బై అంటున్న నయన్!?

Lady superstar: యాక్టింగ్ కు గుడ్ బై అంటున్న నయన్!?

లేడీ సూపర్ స్టార్ నయన తార నటనకు గుడ్ బై చెప్పనున్నట్టు కొత్త పుకారు షికారు చేస్తోంది. షారూఖ్ ఖాన్ తో కలిసి హిందీలో నటిస్తున్న జవాన్, ఏకే 62 సినిమాలే ఇక నయన్ లాస్ట్ మూవీస్ అయ్యే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. తన పిల్లలపై పూర్తి ధ్యాస పెట్టేలా ఆమె పర్సనల్ లైఫ్ ప్లాన్ చేసుకున్నట్టు స్పష్టమవుతోంది. పైగా నయన్ కు బిజినెస్ అంటే చాలా ఇంట్రెస్ట్ కూడా. ఎప్పటినుంచో ఆమె యూఏఈలో పలు పెద్ద కంపెనీల్లో పెట్టుబడి పెట్టి వ్యాపారాలు చేస్తున్నారు. ఈనేపథ్యంలో ఆమె బిజినెస్, పిల్లలపై పూర్తిగా టైం స్పెండ్ చేసేలా తన ఫ్యూచర్ ను ప్లాన్ చేసుకుంటున్నారట.

- Advertisement -

గత దశాబ్ద కాలంగా సౌత్ లోని అన్ని భాషల్లోనూ హీరోయిన్ ఓరియెంటెడ్, గ్లామర్ ఓరియెంటెడ్ రోల్స్ ప్లే చేసిన టాప్ హీరోయిన్ గా, హయ్యస్ట్ పెయిడ్ హీరోయిన్ గా నయన తార దూసుకుపోయారు. కానీ రియల్ లైఫ్ కు అత్యధిక ప్రయారిటీ ఇచ్చ ఆమె రీల్ లైఫ్ కు ఫుల్ స్టాప్ పెట్టేందుకు సై అంటున్నారు. మీకు గుర్తుందా ప్రభుదేవాతో ప్రేమాయణం తరువాత పెళ్లి చేసుకోవాలనుకున్న టైంలో కూడా ఆమె శ్రీరామరాజ్యం సినిమా తరువాత ఇక నటించను అని చెప్పేశారు కూడా. కానీ ప్రభుతో బ్రేకప్ తరువాత మళ్లీ మేకప్ వేసుకోవటం స్టార్ట్ చేశారు. ఆతరువాత చాలా కాలానికి డైరెక్టర్ విఘ్నేశ్ శివన్ తో లివ్ ఇన్, పెళ్లి, సరోగసి పేరెంట్స్ కావటం అన్నీ జరిగిపోయాయి. అద్దె గర్భం ద్వారా నయన్-విఘ్నేశ్ కు ఉయిర్, ఉళగం అనే ఇద్దరు కవల మగపిల్లలు పుట్టారు. వారి ఆలనా పాలనే ఇక తన జీవితం అన్నట్టు నయన్ ఆలోచనలో ఉన్నారట.

యాక్టింగ్ కు గుడ్ బై చెప్పినా ప్రొడ్యూసర్ గా ఆమె తన ఫిల్మీ కెరీర్ కొనసాగిస్తారట. ప్రస్తుతం ఆమె చేతిలో మూడు పెద్ద సినిమాలున్నాయి. కింగ్ ఖాన్ షారూఖ్, తల అజిత్ కుమార్, ఫహాద్ ఫాసిల్ తో ఆమె సినిమాలూ షూటింగ్ స్టేజెస్ లో ఉన్నాయి. మరోవైపు ఆమె పూరి జగన్నాథ్ సినిమా ఆటో జానిలో నటిస్తున్నట్టు సమాచారం. చూడాలి మరి నయన్ కెరీర్ ఏ దిశలో సాగుతుందో.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News