Friday, September 20, 2024
Homeచిత్ర ప్రభLargest Screen : దేశంలోనే అతి పెద్ద థియేటర్ స్క్రీన్.. మన హైదరాబాద్ లోనే..

Largest Screen : దేశంలోనే అతి పెద్ద థియేటర్ స్క్రీన్.. మన హైదరాబాద్ లోనే..

- Advertisement -

Largest Screen : సినిమాలు చూడటానికి ఎన్ని ప్లాట్ ఫార్మ్స్ ఉన్నా థియేటర్స్ లో చూడటానికే ఇష్టపడతాం. ఒక సినిమాని ఆస్వాదించాలంటే కచ్చితంగా థియేటర్లో చూడాల్సిందే. ఇక సినీ ప్రేమికులైతే థియేటర్స్ లో సినిమాలు రెగ్యులర్ గా చూస్తారు. థియేటర్లో సినిమాలు చూసే వారికి మరో శుభవార్త. అందులోనూ హైదరాబాద్ వాళ్లకి మరింత సంతోషకరమైన వార్త ఇది.

దేశంలోనే అతిపెద్ద స్క్రీన్, ఎక్కువ మంది సీటింగ్ కెపాసిటితో థియేటర్ మన హైదరాబాద్ లో రెడీ అవుతుంది. ఐమాక్స్ అనుభూతిని హైదరాబాద్ వాసులకి పరిచయం చేసిన ప్రసాద్ ఐమాక్స్ ఇప్పుడు మరో కొత్త అనుభూతిని పరిచయం చేయబోతుంది. దేశంలోనే అతిపెద్ద స్క్రీన్ ని ప్రసాద్ ఐమాక్స్ నిర్మిస్తుంది. 630 సీటింగ్‌ కెపాసిటీతో 64 అడుగుల ఎత్తు, 101.6 అడుగుల వెడల్పుతో భారీ తెరను ఇప్పటికే ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఫైనల్ వర్క్ జరుగుతుంది.

డిసెంబర్ 16నవిడుదల కానున్న అవతార్ 2 సినిమాతో ఈ థియేటర్ ఓపెన్ కానుంది. అవతార్ 2 సినిమా మొదటిసారి ఇంత పెద్ద స్క్రీన్ లో హైదరాబాద్ ప్రేక్షకులకి కనువిందు చేయనుంది. ఇంకందుకు ఆలస్యం అవతార్ లాంటి అద్భుతమైన సినిమాని ఇలాంటి సూపర్ స్క్రీన్ మీద చూసేయండి. ఇప్పటికే టికెట్ బుకింగ్స్ కూడా ఓపెన్ చేశారు. ప్రస్తుతం ఈ స్క్రీన్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News