Sunday, November 16, 2025
Homeచిత్ర ప్రభSouth Movies: బడ్జెట్ తక్కువ.. వసూళ్ళు ఊహించనివి..

South Movies: బడ్జెట్ తక్కువ.. వసూళ్ళు ఊహించనివి..

Latest South Movies Collections: మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో భారీ బడ్జెట్ సినిమాలతో పాటు, మీడియం.. చిన్న బడ్జెట్ సినిమాలు వచ్చి ఊహించని వసూళ్లను రాబడుతున్నాయి. కొన్ని సినిమాలకి పెద్ద డిస్ట్రిబ్యూషన్ సంస్థ అండగా ఉంటే ఆ సినిమా రాబట్టే వసూళ్ళు ఊహించలేము కూడా. గతంలో ఇలా పెళ్లి చూపులు లాంటి సినిమాలు ఎన్నో వచ్చాయి. కమెడియన్ వేణు తీసిన బలగం సినిమా కూడా చాలా చిన్న సినిమాగా వచ్చి భారీ విజయాన్ని అందుకుంది. ఇక ఇటీవల వచ్చిన మూడు సినిమాలను పరిశీలిస్తే పెట్టిన పెట్టుబడికి, వచ్చిన వసూళ్ళకి అసలు సంబంధం ఉండదు. ఆ సినిమాలను ఒకసారి పరిశీలిద్దాము.

- Advertisement -

హను-మాన్: నాని తన హోం బ్యానర్ ద్వారా పరిచయం చేసిన దర్శకుడు ప్రశాంత్ వర్మ. ఇప్పుడున్న అతికొద్దిమంది టాలెంటెడ్ డైరెక్టర్స్ లో ప్రశాంత్ వర్మకి సపరేట్ క్రేజ్ ఉంది. ప్రయోగాత్మక చిత్రాలను రూపొందించడంలో ఈ యంగ్ డైరెక్టర్ ఎంతో టాలెంటెడ్. చైల్డ్ ఆర్టిస్ట్ గా పాపులర్ అయిన తేజ సజ్జాతో హను-మాన్ సినిమాను కేవలం 35 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించగా ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద 295 కోట్ల భారీ వసూళ్ళను రాబట్టి ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది. ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ ని ప్రశాంత్ వర్మ రూపొందిస్తున్నాడు.

Also Read – A Rated Films: ఈ సినిమాలకే హైయ్యెస్ట్ కలెక్షన్స్!

కాంతార: కన్నడ సినిమా ఇండస్ట్రీలో భారీ బడ్జెట్ సినిమా అనేది గతంలో ఉండేది కాదు. కానీ, ప్రశాంత్ నీల్ యష్ తో తీసిన కేజీఎఫ్ ఫ్రాంఛైజ్ ఒక్కసారిగా కన్నడ ఇండస్ట్రీని ఆకాశానికి ఎత్తింది. ఆ తర్వాత నుంచి హోంబలే వారు ఎవరి ఊహకి అందనంతగా సినిమాలను ప్రకటిస్తున్నారు. ఇక రిషబ్ శెట్టి నటిస్తూ దర్శకత్వం వహించిన కాంతార 15 కోట్ల బడ్జెట్‌తో నిర్మిస్తే బాక్సాఫీస్ వద్ద 408 కోట్లను రాబట్టి ఒక్కొక్కరికి మైండ్ బ్లాకయ్యేలా చేసింది. ఈ సినిమాకి ఇప్పుడు దాదాపు 205 కోట్లతో రిషబ్ సీక్వెల్ ని రూపొందిస్తున్నారు.

మహావతార్: ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ చూసిన అందరి నోటా మహావతార్ నరసింహ సినిమానే. యానిమేషన్ మూవీగా రూపొందిన ఈ మూవీ బడ్జెట్ కేవలం 10 కోట్లు మాత్రమే. ఇందులో పెద్ద స్టార్స్ గానీ, పెద్ద హీరోలు గానీ లేరు అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఇంకా లెక్కలు తేలనప్పటికీ.. ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా మహావతార్ 250 కోట్లను రాబట్టింది. ఇంకా ఇండియాతో పాటు అమెరికా వంటి దేశాలలోనూ ఇంకా సక్సెస్‌ఫుల్ గా రన్ అవుతోంది. ఈ ఫ్రాంఛైజ్ లో మొత్తం 8 భాగాలు రూపొందనున్నాయి.

Also Read – Aamir Khan Remunaration: ఆమిర్ ఖాన్ రెమ్యునరేషన్ వైరల్.. క్లారిటీ ఇచ్చిన బాలీవుడ్ స్టార్

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad