Mythological Movies: కొన్ని సార్లు పక్కా యాక్షన్ మూవీస్, మరికొన్ని సార్లు ఫ్యామిలీ మూవీస్, హీరో సెంట్రిక్ మూవీస్, హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీస్.. ఫ్యాక్షన్ మూవీస్ ఇలా సినీ ఇండస్ట్రీలో ఒక్కో ట్రెండ్ నడుస్తుంటుంది. ప్రేక్షకాదరణను బట్టే మేకర్స్ సినిమాలు చేస్తుంటారు. ఇప్పుడు నడుస్తోన్న ట్రెండ్.. మైథలాజికల్. నేటి యువతకు కనెక్ట్ అయ్యేలా ప్రెజెంట్ స్టోరీస్‌కు మేకర్స్ మైథలాజికల్ టచ్ ఇస్తున్నారు. ఆ సినిమాలకు ప్రేక్షకాదరణ ఉండటంతో ఇప్పుడు అలాంటి సినిమాలు క్యూ కడుతున్నాయి. ఆ సినిమాలేంటో ఇప్పుడు చూసేద్దాం…
సమకాలీన సినీ రంగంలో ఒక కచ్చితమైన మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. భక్తి, పౌరాణిక నేపథ్యమున్న చిత్రాలకు ప్రేక్షకుల నుంచి సూపర్బ్ రెస్పాన్స్ వస్తోంది. కేవలం భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన సినిమాలు మాత్రమే కాకుండా, చక్కటి కథ, కథనం, ఉన్నత సాంకేతిక విలువలతో కూడిన చిత్రాలు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంటున్నాయి. మన పురాణాలను, దివ్య శక్తులను గ్రాండ్ స్కేల్‌లో, కనుల పండుగ చేసే విజువల్స్‌తో చూడాలనే ఆసక్తి ప్రజల్లో పెరిగిందని ఇలాంటి సినిమాలకు వస్తోన్న రెస్పాన్స్ చూస్తుంటేనే తెలిసిపోతుంది. ఇప్పుడు అలాంటి మూవీస్ చుట్టూనే ఇండస్ట్రీ తిరుగుతుందనటంలో సందేహం లేదు.
రీసెంట్‌గా విడుదలైన యానిమేటెడ్ మూవీ ‘మహావతార్ నరసింహ’ చిత్ర కలెక్షన్లు అద్భుతంగా ఉన్నాయని ట్రేడ్ పండిట్లు ఆశ్చర్యపోతున్నారు. ముఖ్యంగా హిందీ ప్రాంతంలో ఈ యానిమేషన్ సినిమా సాధిస్తున్న వసూళ్లు చూస్తే, సరైన సినిమాలు తీస్తే అవి యానిమేషన్ అయినప్పటికీ థియేటర్లకు జనం పోటెత్తుతారని స్పష్టమవుతోంది. ఈ సినిమా విజయం రాబోయే భక్తి చిత్రాల పట్ల మరింత ఉత్సాహాన్ని నింపుతోంది. ‘మహావతార్ నరసింహ’ ఫ్రాంచైజ్‌లో తదుపరి భాగాల కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అదే విధంగా, ‘రామాయణ’ సినిమా నుంచి వచ్చిన గ్లింప్స్ తర్వాత, సినీ అభిమానుల దృష్టి పూర్తిగా దానిపైనే నిలిచింది. వెండితెరపై అత్యున్నత గ్రాండియర్‌తో, అద్భుతమైన విజువల్ ఎఫెక్ట్స్‌తో మన పౌరాణిక గాథలను చూడటం నిజంగా అద్భుతమైన అనుభూతి అని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Also Read – Ginger: ఈ సమస్యలు ఉంటె.. ఎట్టి పరిస్థితుల్లో అల్లం తినకూడదు..
గత సంక్రాంతికి పలు పెద్ద చిత్రాలు పోటీ పడినప్పటికీ, ప్రశాంత్ వర్మ హనుమంతుడిపై నమ్మకంతో ‘హనుమాన్’ సినిమాను విడుదల చేశారు. ఈ చిత్రం ఊహించని విజయాన్ని సాధించి, బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటుకుంది. ఇప్పుడు, అదే ఫ్రాంచైజ్‌లో ఆయన తెరకెక్కిస్తున్న తదుపరి చిత్రం ‘జై హనుమాన్’. ఈ చిత్రంలో రిషబ్ శెట్టిని తెరపై చూడటానికి రామభక్తులు ఆతృతగా ఉన్నారు. రిషబ్ శెట్టి పేరు ప్రస్తావించినప్పుడు ‘జై హనుమాన్’ మాత్రమే కాదు, ‘కాంతార’ సినిమా కూడా గుర్తుకువస్తుంది. ‘కాంతార’ ఒక నిజమైన బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ ‘దివ్య బ్లాక్‌బస్టర్’కు ప్రీక్వెల్ అక్టోబర్‌లో ప్రేక్షకులను పలకరించబోతోంది.
స్టార్ హీరో నాగచైతన్య నటిస్తున్న రాబోయే చిత్రాల్లో కూడా పురాణాల ఛాయలు ఉంటాయని ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. సినిమా గుహలు, నిధుల చుట్టూ తిరిగినప్పటికీ, అందులో ఒక దివ్యమైన స్పర్శ ఉంటుందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. మొత్తంగా, ఈ విజయాలు భక్తి నేపథ్య చిత్రాలకు ప్రేక్షకుల ఆదరణ ఎలా ఉందో చెబుతున్నాయి. కేవలం తెలుగు నుంచే కాకుండా, హిందీతో సహా ఇతర భాషల వరకు, యానిమేషన్ నుంచి లైవ్-యాక్షన్ వరకు, చక్కటి కథనంతో కూడిన భక్తి చిత్రాలను ప్రేక్షకులు ఆదరిస్తున్నారని స్పష్టమవుతోంది. ఈ ట్రెండ్ కొనసాగితే, రాబోయే కాలంలో మరిన్ని అద్భుతమైన పౌరాణిక, భక్తి రస చిత్రాలను వెండితెరపై చూసే అవకాశం ఉంటుంది.
Also Read – Chiranjeevi: అత్తగారి పాడె ఎత్తుకున్న మెగాస్టార్!


