Nani-The Paradise: మన సినిమా ఇండస్ట్రీలో కొత్త దర్శకులకి అవకాశం ఇవ్వాలంటే అందరు హీరోలు సాహసం చేయరు. ఇలాంటి సాహసం అందరు నిర్మాతలు చేయరు. గతంలో అక్కినేని నాగార్జున ఎక్కువగా తన అన్నపూర్ణ బ్యానర్ లో కొత్త దర్శకులకి అవకాశాలు ఇచ్చేవారు. ఇప్పటికీ, నాగ్ ఇదే ఫాలో అవుతున్నారు. కాబట్టే, రాం గోపాల్ వర్మ, రాఘవ లారెన్స్, దశరథ్, సూర్య కిరణ్ లాంటి వాళ్ళు మన తెలుగు ఇండస్ట్రీకి దర్శకులుగా పరిచయమై సక్సెస్ సాధించారు. అన్నపూర్ణ బ్యానర్ నుంచి ‘మనం’ లాంటి ఎన్నో ప్రయోగాత్మక చిత్రాలు వచ్చాయి.
ఆ రూట్‌లో నేచురల్ స్టార్ నాని కూడా వెళుతున్నాడు. డైరెక్షన్ డిపార్ట్‌మెంట్ నుంచి హీరోగా మారిన నాని, మొదటి సినిమా ‘అష్టా చమ్మా’ తోనే మంచి హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత నాని ఒక్కో సినిమాతో స్టార్ గా మారాడు. మిడ్ రేంజ్ హీరోలలో నానికి ఉన్న ఫ్యాన్స్ బేస్ ఇంకో హీరోకి లేదనే చెప్పాలి. అంతేకాదు, స్టార్ అనే ఫీలింగ్ లేకుండా కథ నచ్చితే ఎలాంటి పాత్ర చేయడానికైనా వెనకాడటం లేదు. ‘జెంటిల్ మేన్’, ‘వి’, ‘సరిపోదా శనివారం’ లాంటి సినిమాలతో నాని యాక్షన్ సినిమాల హీరోగానూ పేరు తెచ్చుకున్నాడు.
జనరల్‌గా ఫ్యామిలీ ఆడియన్స్‌లో మంచి ఫాలోయింగ్ ఉన్న హీరో, మాస్ హీరోగా క్రేజ్ తెచ్చుకోవడం చాలాకష్టం. కానీ, ‘దసరా’ లాంటి సినిమాతో పక్కా మాస్ హీరోగా సినీ ఇండస్ట్రీలో విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. ఇప్పుడు అంతకంటే ఊరమాస్ సినిమాను అదే దర్శకుడితో చేస్తున్నాడు నేచురల్ స్టార్. ఆ సినిమానే ‘ది ప్యారడైజ్’. ఇప్పటికే, ఈ మూవీ నుంచి వచ్చిన నాని ఫస్ట్ లుక్ పోస్టర్ హాట్ టాపిక్ అయింది. టీజర్ అయితే, ప్రతీ ఒక్కరినీ షాకయ్యేలా చేసింది. నాని సినిమాలో ఇలాంటి బూతులున్నాయేంటీ..? అని అవాక్కయ్యారు కూడా.
Also Read- Revenge Killing : థ్రిల్లర్ సినిమాను మించి.. తండ్రి హత్యకు ప్రతీకారంగా తమ్ముడినే కడతేర్చిన అన్న!
కథానుసారం కొన్ని డైలాగ్స్‌ని పెడుతున్నారు. సెన్సార్ కూడా అనుమతిస్తోంది. అయితే, తాజాగా ‘ప్యారడైజ్’ సినిమా నుంచి మరో పోస్టర్ రాబోతుందని మేకర్స్ అప్‌డేట్ ఇచ్చారు. ఆ పోస్టర్ ఎలా ఉంటుందో, ఎన్ని కాంట్రవర్సీలకి తెరతీస్తుందోనని మాట్లాడుకుంటున్నారు. ఇక, నాని హీరోగానే కాకుండా తన సొంత నిర్మాణ సంస్థలో టాలెంటెడ్ డైరెక్టర్స్ కి ఛాన్స్ ఇస్తున్నాడు. అలా వచ్చిన వాళ్ళే ప్రశాంత్ వర్మ, శ్రీకాంత్ ఓదెల, రాం జగదీష్. శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్ లో నాని నిర్మాతగా మెగాస్టార్ చిరంజీవి ఓ సినిమాను ప్రకటించారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్ ఎప్పుడు సెట్స్‌పైకి వస్తుందోనని అందరూ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.


