Raj Tarun – Lavanya: రాజ్‌తరుణ్, లావణ్య వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. రాజ్‌తరుణ్ అనుచరులు తనపై దాడిచేశారంటూ నార్సింగి పోలీసులకు కంప్లైంట్ ఇచ్చింది లావణ్య. ఆమె ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు రాజ్ తరుణ్‌పై కేసును నమోదు చేసినట్లు ప్రచారం జరుగుతోంది.
దూషించారు…
కోకాపేట ఇంటిలో ఉండగా రాజ్‌తరుణ్… అనుచరులను పంపించి తనపై దాడి చేయించాడని ఈ ఫిర్యాదులో లావణ్య పేర్కొన్నది. మూడు వేర్వేరు సందర్భాల్లో దూషించడమే కాకుండా తనపై భౌతికంగా దాడులకు పాల్పడ్డారని కంప్లైంట్ చేసింది.
Also Read – Akkineni Family: నాంపల్లి కోర్టుకు అక్కినేని హీరోలు నాగార్జున, నాగచైతన్య.. కారణం ఇదే!
అభరణాలు ఎత్తుకెళ్లారు..
తన ఇంట్లోని పెంపుడు జంతువులను చంపడమే కాకుండా ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లిపోయారని పోలీసులకు లావణ్య వెల్లడించింది. 2016లో రాజ్ తరుణ్‌తో కలిసి ఆ విల్లాను తాను కొనుగోలు చేశానని, వ్యక్తిగత విభేదాల వల్ల రాజ్ తరుణ్ గత ఏడాది ఈ విల్లాను ఖాళీ చేసి వెళ్లారని లావణ్య పేర్కొన్నది. ఈ విల్లాకు సంబంధించిన వివాదం కోర్టులో ఉందని లావణ్య అన్నది. లావణ్య కంప్లైంట్‌ను స్వీకరించిన పోలీసులు రాజ్‌తరుణ్‌తో పాటు మణికంఠ, రాజశేఖర్, సుశి, అంకిత్ గౌడ్, రవితేజలపై కేసు నమోదు చేశారు.
మాల్వీ మల్హోత్రా కారణంగానే…
రాజ్‌తరుణ్ తనను ప్రేమించి, పెళ్లిచేసుకొని మోసం చేశాడని లావణ్య గత ఏడాది ఆరోపణలు చేసింది. మాల్వీ మాల్హోత్రాపై అనే హీరోయిన్ కారణంగా రాజ్ తరుణ్ తనకు దూరమయ్యాడంటూ పేర్కొన్నది. రాజ్‌తరుణ్‌తో పాటు మాల్వీ మల్హోత్రాపై పోలీసులకు కంప్లైంట్ ఇచ్చింది. అప్పటి నుంచి వివాదం అనేక మలుపులు తిరుగుతోంది. లావణ్యపై రాజ్‌తరుణ్ కూడా కేసు పెట్టాడు. లావణ్య ఉంటున్న కోకాపేట విల్లా తమదే అంటూ రాజ్‌తరుణ్ తల్లిదండ్రులు ఆరోపించారు. లావణ్య తమపై దాడికి పాల్పడ్డదంటూ పోలీసులను ఆశ్రయించారు.
రాజ్ తరుణ్ ప్రస్తుతం గాండ్స్ అండ్ సోల్జర్స్ పేరుతో ఓ సినిమా చేస్తున్నాడు. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ఈ బైలింగ్వల్ మూవీకి విజయ్ మిల్టన్ దర్శకత్వం వహిస్తున్నాడు.


