Lavanya Tripathi: మెగా కోడలు లావణ్య త్రిపాఠి హీరోయిన్‌గా నటించిన తమిళ మూవీ టన్నెల్ ఓటీటీ రిలీజ్ డేట్ కన్ఫామ్ అయ్యింది. క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో అథర్వ మురళి హీరోగా నటించాడు. అక్టోబర్ 17న అమెజాన్ ప్రైమ్ వీడియోలో టన్నెల్ రిలీజ్ కాబోతుంది. తమిళంతో పాటు తెలుగు, కన్నడ, హిందీ, మలయళ భాషల్లో అందుబాటులోకి రానుంది.
రిలీజ్ డిలే…
టన్నెల్ మూవీకి రవీంద్ర మాధవ దర్శకత్వం వహించాడు. అశ్విన్ కాకుమాను కీలక పాత్రలో నటించిన ఈ మూవీకి డియర్ కామ్రేడ్ ఫేమ్ జస్టిన్ ప్రభాకరన్ మ్యూజిక్ అందించాడు. టన్నెల్ మూవీ షూటింగ్ 2023లోనే కంప్లీట్ అయ్యింది. అనివార్య కారణాల వల్ల రెండేళ్ల తర్వాత థియేటర్లలోకి వచ్చింది.
సెప్టెంబర్ మూడో వారంలో ప్రేక్షకుల ముందుకొచ్చిన టన్నెల్ బాక్సాఫీస్ వద్ద యావరేజ్‌గా నిలిచింది. కాన్సెప్ట్ బాగున్నా థ్రిల్లింగ్‌గా చెప్పడంలో దర్శకుడు తడబడిపోయాడనే విమర్శలు వచ్చాయి. లావణ్య త్రిపాఠి పాత్రకు పెద్దగా ఇంపార్టెన్స్ లేకపోవడం కూడా మైనస్‌గా మారింది.
Also Read- Mithra Mandali Review: ‘మిత్ర మండలి’ సినిమా రివ్యూ అండ్ రేటింగ్
టన్నెల్ కథేమిటంటే?
యూపీఎస్‌సీలో టాపర్ అయిన అను (లావణ్య త్రిపాఠి) అఖిల్‌ను (అథర్వ మురళి) ప్రేమిస్తుంటుంది. అఖిల్‌కు ఉద్యోగం లేకపోవడంతో అను తండ్రి వారి పెళ్లికి అభ్యంతరం చెబుతాడు. అను తండ్రి కండీషన్ మేరకు కానిస్టేబుల్ జాబ్‌లో జాయిన్ అవుతాడు అఖిల్. ఉద్యోగంలో చేరిన తొలిరోజే ఓ కిల్లింగ్ గ్యాంగ్‌కు అఖిల్‌తో పాటు అతడి ఫ్రెండ్స్ టార్గెట్‌గా మారతారు. ఆ గ్యాంగ్ బారి నుంచి అఖిల్ ఎలా తప్పించుకున్నాడు? అసలు టన్నెల్ కథేమిటి అన్నదే ఈ మూవీ కథ. టన్నెల్‌తో దాదాపు మూడేళ్ల తర్వాత సిల్వర్ స్క్రీన్‌పైకి రీఎంట్రీ ఇచ్చింది లావణ్య త్రిపాఠి. పెళ్లి తర్వాత విడుదలైన ఫస్ట్ మూవీ ఇదే. తమిళంలో లావణ్య త్రిపాఠికి ఇది రెండో సినిమా. 2014లో రిలీజైన బ్రహ్మం మూవీతో కోలీవుడ్‌లోకి అడుగుపెట్టింది లావణ్య త్రిపాఠి.
సతీలీలావతి…
నవంబర్ 2023 మెగా హీరో వరుణ్‌తేజ్‌తో లావణ్య త్రిపాఠి పెళ్లి జరిగింది. ఇటీవలే మగబిడ్డకు జన్మనిచ్చింది. కుమారుడికి వాయువ్‌తేజ్ అని నామకరణం చేశారు. ప్రస్తుతం లావణ్య త్రిపాఠి తెలుగులో సతీలీలావతి సినిమా చేస్తోంది. దేవ్ మోహన్ హీరోగా నటించిన ఈ క్రైమ్ కామెడీ మూవీ రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. ఈ సినిమాకు తాతినేని సత్య దర్శకత్వం వహించాడు.


