Lavanya Tripathi: కొంత గ్యాప్ తర్వాత సతీ లీలావతి మూవీతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది మెగా కోడలు లావణ్య త్రిపాఠి. రొమాంటిక్ కామెడీ కథాంశంతో రూపొందిన ఈ మూవీకి తానినేని సత్య దర్శకత్వం. శాకుంతలం ఫేమ్ దేవ్ మోహన్ హీరోగా కనిపించబోతున్నాడు.
టీజర్ రిలీజ్…
మంగళవారం సతీలీలావతి టీజర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. భార్యాభర్తల బంధాన్ని ఫన్నీగా చూపిస్తూ ఆద్యంతం ఎంటర్‌టైనర్‌గా ఈ టీజర్ సాగింది. దేవ్ మోహన్, లావణ్య త్రిపాఠి పెళ్లి జరిగే సీన్‌తోనే ఈ టీజర్ మొదలైంది. నాకెందుకో హ్యాపీగా ఉండలేనప్పుడు విడిపోవడమే కరెక్ట్ అనిపిస్తుంది దేవ్ మోహన్ చెప్పిన డైలాగ్‌తో టీజర్ కామెడీలోకి టర్న్ అయ్యింది. భర్తను కట్టేసిన లీలా… అతడిని కొట్టినట్లుగా చెప్పడం ఆసక్తిని పంచుతోంది. గొడవలు పడే జంట జీవితాల్లోకి ఓ లాయర్‌తో పాటు కొందరు వ్యక్తులు ఎలా ప్రవేశించారు? వారి చేసే కన్ఫ్యూసన్ టీజర్‌లో కడుపుబ్బా నవ్విస్తున్నాయి. టీజర్‌లో భర్త వేసే పంచ్‌లకు లీలా రివర్స్ కౌంటర్లు వేసే డైలాగ్స్ కామెడీని పంచాయి. ఈ టీజర్‌లో వీటీవీ గణేష్, సప్తగిరి, మోట్ట రాజేంద్రన్‌తో పాటు పలువురు కమెడియన్లు కనిపించారు.
సస్పెన్స్ క్రియేట్…
భార్యాభర్తల మధ్య గొడవకు కారణమేమిటన్నది మాత్రం టీజర్‌లో రివీల్ చేయకుండా సస్పెన్స్ క్రియేట్ చేశారు. ముసుగుతో ఉన్న స్పైడర్ మ్యాన్ క్యారెక్టర్ ఎవరన్నది కూడా చూపించలేదు. టీజర్‌కు మిక్కీ జే మేయర్ బీజీఎమ్ హైలైట్‌గా నిలిచింది.
Also Read – Amit Shah counters : ఉగ్రవాదుల ఏరివేతపై… అఖిలేశ్‌కు అమిత్ షా చురకలు!
షూటింగ్ కంప్లీట్…
ఇప్పటికే సతీ లీలావతి షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుతున్నారు. త్వరలోనే సతీలీలావతి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఫీల్‌గుడ్ ఎంటర్‌టైనర్‌గా ఈ మూవీ తెలుగు ప్రేక్షకులను అలరిస్తుందని నిర్మాత చెబుతోన్నారు.
డిఫరెంట్ కాన్సెప్ట్…
భీమిలీ కబడ్డీ జట్టు, ఎస్.ఎం.ఎస్(శివ మనసులో శృతి) తెలుగు ప్రేక్షకులను మెప్పించిన డైరెక్టర్ తాతినేని సత్య తన పంథాకు భిన్నంగా డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ఈ మూవీని రూపొందిస్తున్నారు. ఆనంది ఆర్ట్స్ సమర్పణలో నిర్మాత నాగమోహన్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. 2022లో వచ్చిన హ్యాపీ బర్త్‌డే తర్వాత మూడేళ్ల విరామం అనంతరం లావణ్య త్రిపాఠి చేస్తున్న మూవీ ఇది.
Also Read – Manhattan Massacre: న్యూయార్క్ నగరంలోకాల్పుల కలకలం… ఐదుగురు బలి!


