Mass Jathara: తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై యంగ్ ప్రొడ్యూసర్ సూర్యదేవర నాగ వంశీ సినిమాలు నిర్మిస్తోన్న సంగతి తెలిసిందే. ‘జెర్సీ’, ‘సార్’, ‘లక్కీ భాస్కర్’ వంటి విజయవంతమైన చిత్రాలతో ఈ బ్యానర్‌కు మంచి గుర్తింపు, బ్రాండ్ వేల్యూ క్రియేట్ అయ్యింది. అయితే రీసెంట్ టైమ్‌లో ఈ బ్యానర్ వరుస సవాళ్లను ఎదుర్కొంటోంది. ముఖ్యంగా, ‘కింగ్‌డమ్’ సినిమా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. అలాగే హృతిక్ రోషన్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘వార్ 2’ను సితార సంస్థ తెలుగులో డిస్ట్రిబ్యూట్ చేస్తే నిర్మాత వంశీకి నష్టాన్ని మిగిలాయనేది ట్రేడ్ వర్గాల సమాచారం. ఇప్పుడు ఈ బ్యానర్ నుంచి రాబోతున్న మరో క్రేజీ ప్రాజెక్ట్ ‘మాస్ జాతర’పై అందరి దృష్టి ఉంది. ఈ నేపథ్యంలో సినిమాకు ఊహించిన లీగల్ సమస్య వచ్చింది.
చక్రి వాయిస్ వివాదం.. లీగల్ నోటీసులు..
‘మాస్ జాతర’ సినిమా విడుదలకు సిద్ధమవుతున్న తరుణంలో చిత్ర యూనిట్‌కు ప్రముఖ దివంగత మ్యూజిక్ డైరెక్టర్ చక్రి తల్లి నుంచి లీగల్ నోటీసులు అందాయి. దీనికి ప్రధాన కారణం ఈ సినిమాలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ద్వారా చక్రి వాయిస్‌ని ఉపయోగించి ‘తు మేరా లవ్’ అనే పాటను కంపోజ్ చేయడం. అయితే ఈ పాటను కంపోజ్ చేసేటప్పుడు చక్రి కుటుంబం నుండి ఎటువంటి అనుమతి తీసుకోలేదని సమాచారం. చక్రి వాయిస్‌ని మళ్లీ వినడం ప్రేక్షకులకు చాలా కొత్తగా అనిపించింది. పాటకు మంచి క్రేజ్ కూడా వచ్చింది. దీని కారణంగా.. ప్రస్తుతం పాపులర్ అయిన ఈ పాటను వేరే సింగర్స్‌తో పాడించే పనిలో చిత్ర యూనిట్ ఉంది. పాట షూటింగ్ ఇప్పటికే పూర్తయినప్పటికీ, ఇప్పుడు కొత్తగా పాడించిన పాటను షూట్ చేసిన విజువల్స్‌కు జతచేయాల్సి వస్తుంది. ఇది నిర్మాతకు కాస్త ఇబ్బందిని కలిగించే విషయమే.
రిలీజ్ వాయిదా..
నిజానికి వినాయక చవిత సందర్భంగా ‘మాస్ జాతర’ను ఆగస్ట్ 27న రిలీజ్ చేస్తామని నిర్మాతలు ప్రకటించారు. కానీ కొన్ని సాంకేతిక కారణాలతో సినిమా వాయిదా పడింది. మరోవైపు, మొదట సెప్టెంబర్ 12న సినిమా విడుదల చేయాలనుకున్నప్పటికీ ప్రస్తుత పరిస్థితులలో ఆ తేదీకి సినిమా వస్తుందనే దానిపై స్పష్టత లేదు. తాజా సమాచార మేరకు అక్టోబర్ నెలలో విడుదల చేయడానికి ప్రణాళికలు చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. మరి ‘మాస్ జాతర’ రిలీజ్ డేట్‌పై మేకర్స్ ఎలా స్పందిస్తారో చూడాలి మరి.
Also Read- Viral Video: గొర్రె పిల్లను చంపబోయిన నాగుపాము.. యజమాని ఏం చేశాడో తెలుసా?
రవితేజ, శ్రీలీల జోడి..
ధమాకా మూవీ బ్లాక్ బస్టర్‌తో రవితేజ, శ్రీలీల జోడీకి మంచి క్రేజ్ క్రియేట్ అయ్యింది. వీరిద్దరూ కలిసి మరోసారి జంటగా ఈ మూవీలో కనిపించబోతున్నారు. రైటర్ భాను బోగవరపు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.


