Lisa Ray : టాలీవుడ్ ప్రేక్షకులకు టక్కరి దొంగ సినిమాతో పరిచయమైన బాలీవుడ్ నటి లిసా రే. ఈ నటి జీవితం ఎందరికో ఆదర్శం. కెరీర్ లో ఉన్నతంగా ఎదిగినప్పటికీ మధ్య వయస్సులో జీవితాన్ని కుదిపేసే సవాలు ఎదురైంది. అయినప్పటికీ తనని తాను కూడదీసుకుంటూ ముందుకు వెళ్తున్నానంటుంది ఈ నటి. ఇక తన జీవిత ప్రయాణాన్ని ఇటీవల హైదరాబాద్‌లోని ఫిక్లీ లేడీస్ ఆర్గనైజేషన్ (FLO) వేదికగా పంచుకున్నారు.
కెరీర్ పీక్ లో ఉన్నప్పుడే 37 ఏళ్ల వయసులో లిసా రే కు బ్లడ్ క్యాన్సర్ సోకింది. అయితే “డాక్టర్లు కేవలం ఐదేళ్లు మాత్రమే బతికే అవకాశం ఉందన్నారు. కానీ నా అంతరాత్మనే నన్ను నిలబెట్టిందf” అంటున్నారు లిసా. 16 సంవత్సరాలుగా నన్ను నేను స్ట్రాంగ్ చేసుకుంటు సంతోషంగా జీవిస్తున్నానని తెలిపారు.
ALSO READ : Chandrababu Naidu: నేతన్నలకు కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్.. వరాల జల్లు
ఇంకా లిసా ఏమంటారంటే “మన ఆరోగ్యానికి మనమే CEO. శరీరం ఎంత శుభ్రంగా ఉంచుకుంటామో, మనసులోని కూడా నెగటివ్ ఆలోచనలు రాకుండా అలాగే శుభ్రంగా ఉంచుకోవాలి. ధ్యానం నాకు ఎంతో శాంతిని, ధైర్యాన్ని ఇచ్చింది.”
ఇప్పటి వరకు ప్రపంచంలోని 43 నగరాల్లో నివసించిన లిసా రే, “భారత్ జీవించడానికి అత్యుత్తమమైన దేశం” అని తెలిపారు.
నిజానికి లిసా జీవితం చెబుతున్నదేంటంటే..
ఆరోగ్యమే ధనంగా భావించాలి, మానసిక బలమే నిజమైన విజయానికి మూలం, రోగం సిగ్గు కాదు, పోరాటానికి మునుపటి అడుగు మాత్రమేనని!
Also read : Raviteja Ole Ole Song: రోత పుట్టించేలా ‘ఓలే ఓలే’.. తిడుతోన్న శ్రోతలు!
నిజానికి లిసా రే.. కెనడియన్ నటి. 1990లో ఇండియన్ మోడలింగ్ రంగంలో అడుగుపెట్టి, “బాంబే డైయింగ్”, “లక్మే” వంటి బ్రాండ్‌లకు ప్రచారకర్తగా పనిచేశారు. 1994లో సినీ రంగ ప్రవేశం చేసి బాలీవుడ్, టాలీవుడ్ లో అలరించారు. అయితే 2009లో బ్లడ్ క్యాన్సర్ అని తెలుసుకున్న లిసా.. దానిని ధైర్యంగా ఎదుర్కుంది. “ది యెల్లో డైరీస్” బ్లాగ్ లో ఇందుకు సంబంధించిన అనుభవాలను పంచుకున్నారు. స్టెమ్ సెల్ థెరపీకి మద్దతు ఇస్తూ, క్యాన్సర్ అవగాహన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.


