Saturday, November 15, 2025
Homeచిత్ర ప్రభLittle Hearts: బాక్సాఫీస్ వ‌ద్ద దుమ్మురేపుతున్న లిటిల్ హార్ట్స్ - రెండు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్...

Little Hearts: బాక్సాఫీస్ వ‌ద్ద దుమ్మురేపుతున్న లిటిల్ హార్ట్స్ – రెండు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ – స్టార్స్ మూవీస్ గ‌ట్టి షాక్‌

Little Hearts: సినిమాలో స్టార్స్ ఎవ‌రూ లేరు. పేరున్న డైరెక్ట‌ర్ సినిమానో, భారీ బ‌డ్జెట్ మూవీనో అనుకుంటే అదేమి కాదు. అయినా లిటిల్ హార్ట్స్ మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద అద‌ర‌గొడుతోంది. కేవ‌లం రెండు రోజుల్లోనే ఈ మూవీ బ్రేక్ ఈవెన్‌ను సాధించింది. 2025లో అత్యంత వేగంగా లాభాల్లోకి అడుగుపెట్టిన తెలుగు సినిమాగా లిటిల్ హార్ట్స్ నిలిచింది.

- Advertisement -

పోటీ లేదుగా…
ఈ శుక్ర‌వారం లిటిల్ హార్ట్స్‌తో పాటు అనుష్క ఘాటి, శివ‌కార్తికేయ‌న్ మ‌ద‌రాసి ప్రేక్ష‌కుల ముందుకొచ్చాయి. స్టార్స్ న‌టించిన ఈ సినిమాలు లిటిల్ హార్ట్స్‌కు ఏ మాత్రం పోటీ ఇవ్వ‌లేక‌పోయాయి. ఘాటి, మ‌ద‌రాసి సినిమాల ధాటికి లిటిల్ హార్ట్స్ బాక్సాఫీస్ వ‌ద్ద మొద‌టి రోజు నిల‌బ‌డ‌ట‌మే క‌ష్ట‌మ‌ని అనుకున్నారు. కానీ సీన్ మొత్తం రివ‌ర్స్ అయ్యింది.

రెండు రోజుల్లోనే…
రెండున్న‌ర కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌లో డిస్ట్రిబ్యూట‌ర్లు బ‌న్నీవాసు, వంశీ నందిపాటి ఈ సినిమాను రిలీజ్ చేశారు. రెండు రోజుల్లోనే మూడు కోట్లకుపైగా వ‌సూళ్ల‌ను రాబ‌ట్టి బాక్సాఫీస్ వ‌ద్ద కుమ్మేసింది. శ‌నివారం రోజు క‌లెక్ష‌న్స్‌తో ఈ మూవీ లాభాల్లోకి అడుగుపెట్టింది. రిలీజ్ రోజు 2.65 కోట్ల గ్రాస్‌, కోటి న‌ల‌భై ల‌క్ష‌ల వ‌ర‌కు షేర్ క‌లెక్ష‌న్స్ ద‌క్కించుకున్న‌ది. రెండో రోజు మూడు కోట్ల గ్రాస్‌, కోటి అర‌వై ల‌క్ష‌ల‌కుపైగా షేర్ వ‌సూళ్లు వ‌చ్చిన‌ట్లు స‌మాచారం. ఆదివారం రోజు ఈ సినిమా రెండు కోట్లకుపైగా వ‌సూళ్ల‌ను ద‌క్కించుకునే అవ‌కాశం ఉన్న‌ట్లు చెబుతోన్నారు. నిర్మాత‌ల‌కు ఈ చిన్న సినిమా లాభాల పంట‌ను పండించ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది.

Also Read – Saiyaara OTT: ఓటీటీలోకి 600 కోట్ల బాలీవుడ్ బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ – స్ట్రీమింగ్ డేట్‌, ప్లాట్‌ఫామ్ ఏవంటే?

రొమాంటిక్ ల‌వ్ డ్రామా…
లిటిల్ హార్ట్స్ మూవీలో మౌళి త‌నూజ్‌, శివానీ నాగారం హీరోహీరోయిన్లుగా న‌టించారు. నైంటీస్ మిడిల్‌క్లాస్ బ‌యోపిక్ ఫేమ్ ఆదిత్య హ‌స‌న్ నిర్మించిన ఈ సినిమాకు సాయి మార్తాండ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. యూత్‌ఫుల్ రొమాంటిక్ ల‌వ్ డ్రామాగా ఈ మూవీ తెర‌కెక్కింది. కాన్సెప్ట్ కంటే కామెడీకే ఎక్కువ‌గా ఇంపార్టెన్స్ ఇస్తూ డైరెక్ట‌ర్ ఈ మూవీని రూపొందించాడు.

సీక్రెట్ ఏమిటి?
అఖిల్‌కు ఎంసెట్‌లో సీటు రాదు. దాంతో లాంగ్‌ట‌ర్మ్ కోసం ఓ కోచింగ్ సెంట‌ర్‌లో జాయిన్ అవుతాడు. అక్క‌డే కాత్యాయ‌ని అత‌డికి ప‌రిచ‌యం అవుతుంది. ఇద్ద‌రు ప్రేమ‌లో ప‌డ‌తారు. కానీ కాత్యాయ‌నికి సంబంధించిన ఓ సీక్రెట్ వారి ప్రేమ‌కు అడ్డుగా మారుతుంది? అదేమిటి అన్న‌దే ఈ మూవీ క‌థ‌.

Also Read – TGSRTC : ఆర్టీసీలో స్మార్ట్‌ సవారీ.. ఆధార్​కు ఇక సెలవు!

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad