Little Hearts: చిన్న సినిమా లిటిల్ హార్ట్స్ బాక్సాఫీస్ వద్ద అదరగొడుతోంది. రోజురోజుకు ఈ సినిమా కలెక్షన్స్ పెరుగుతోన్నాయి. వరల్డ్ వైడ్‌గా యునానమస్‌గా పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతుంది. ఆరు రోజుల్లోనే ఈ సినిమా 21 కోట్ల కలెక్షన్స్‌ను రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి. కేవలం రెండు కోట్ల నలభై లక్షల కలెక్షన్స్‌తో రూపొందిన ఈ మూవీ మౌత్ టాక్‌తో మొదటిరోజే బ్రేక్ ఈవెన్‌ను సాధించింది. తొలి రోజు కంటే ఈ సినిమా ఆరవ రోజు ఎక్కువ కలెక్షన్స్ రాబట్టింది. మొదటి రోజు రెండు కోట్ల అరవై ఐదు లక్షల కలెక్షన్స్ రాబట్టిన ఈ మూవీ బుధవారం రోజు 2.75 కోట్లకుపైగా వసూళ్లను దక్కించుకున్నది.
ఎనిమిది కోట్ల లాభాలు…
లిటిల్ హార్ట్స్ సినిమా నిర్మాతలకు లాభాల పంటను పండిస్తోంది. ఇప్పటివరకు 8.3 కోట్ల ప్రాఫిట్స్‌తో ట్రిపుల్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఓవరాల్‌గా నిర్మాతలకు ఈ సినిమా పది కోట్లకుపైనే లాభాలను మిగిల్చే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. ఫుల్ థియేట్రికల్ రన్‌లో 27 నుంచి 30 కోట్ల వరకు లిటిల్ హార్ట్స్ కలెక్షన్స్‌ను దక్కించుకోవచ్చని అంటున్నారు. ఈ ఏడాది టాలీవుడ్‌లో మోస్ట్ ప్రాఫిటబుల్ మూవీగా లిటిల్ హార్ట్స్ నిలిచింది. శుక్రవారం కిష్కిందపురితో పాటు మిరాయ్ రిలీజ్ అవుతుండటంతో లిటిల్ హార్ట్స్ కలెక్షన్స్ తగ్గుముఖం పట్టేలా కనిపిస్తున్నాయి.
Also Read – Multistarrer Movies: ఈ మల్లీస్టారర్స్ చాలా స్పెషల్.. ఒక్కో భాషలో ఒక్కోటి!
డైరెక్టర్ ప్రొడ్యూసర్…
లిటిల్ హార్ట్స్ మూవీలో మౌళి తనూజ్, శివానీ నాగారం హీరోహీరోయిన్లుగా నటించారు. సాయి మార్తాండ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను నైంటీస్ మిడిల్ క్లాస్ ఫేమ్ ఆదిత్య హసన్ నిర్మించారు. ఈ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ మూవీని వంశీ నందిపాటితో కలిసి బన్నీవాస్ రిలీజ్ చేశారు.
పోటీగా రిలీజ్…
రిలీజ్‌కు ముందు లిటిల్ హార్ట్స్‌పై ఎలాంటి అంచనాలు లేవు. ఘాటీ, మదరాసి వంటి పెద్ద సినిమాలతో పోటీగా రిలీజ్ అవుతుండటంతో ఈ చిన్న సినిమా థియేటర్లలో ఒక్కరోజు కూడా నిలబడటం కష్టమని అనుకున్నారు. కానీ రిలీజ్ తర్వాత లిటిల్ హార్ట్స్ ధాటికి ఘాటీ, మదరాసి థియేటర్లలో కనిపించకుండాపోయాయి.
యూత్‌కు కనెక్ట్ అయ్యే అంశాలు…
కథలో కొత్తదనం లేకపోయినా కామెడీతో డైరెక్టర్ సాయి మార్తాండ్ మ్యాజిక్ చేశాడు. యూత్ ఆడియెన్స్‌కు కనెక్ట్ అయ్యే అంశాలు ఎక్కువగా ఉండటం, మౌళి తనూజ్‌తోపాటు జయకృష్ణ కామెడీ టైమింగ్ ఈ సినిమాకు ప్లస్ అయ్యాయి. బుధవారం లిటిల్ హార్ట్స్ సక్సెస్ మీట్‌ను మేకర్స్ నిర్వహించారు.
Also Read – Israel: అమెరికా ఏం చేసిందో.. మేం అదే చేశాం- ఇజ్రాయెల్ ప్రధాని


